CrimeSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-leader-akhilapriya-joining-ycp-2c14f75e-da65-40cc-b503-5cb200e5e5dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-leader-akhilapriya-joining-ycp-2c14f75e-da65-40cc-b503-5cb200e5e5dc-415x250-IndiaHerald.jpgబోయిన్‌ పల్లిలో నిన్న రాత్రి కేసీఆర్ సమీప బంధువైన మాజీ హాకీ ప్లేయర్ ప్రవీణ్ రావు మరియు ఆయన సోదరులు సినీ ఫక్కీలో కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. బోయిన్ పల్లిలో ఆమెను అదుపులోకి తీసుకొని తన సొంత కారులోనే బోయనపల్లికి తరలిస్తున్నారు. అయితే హఫీజ్ పేట్ లోని 50 ఎకరాల‌ భూవ్యవహారమే ఈ కిడ్నాప్ కు కారణంగా గుర్తించారుakhilapriya;kcr;chandra bose;chandrabose;praveen;hyderabad;telangana;police;bhuma akhila priya;car;minister;husband;arrest;subhas chandra bose;hafiz saeed;bhuma nagi reddy;hockeyకేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్!కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్!akhilapriya;kcr;chandra bose;chandrabose;praveen;hyderabad;telangana;police;bhuma akhila priya;car;minister;husband;arrest;subhas chandra bose;hafiz saeed;bhuma nagi reddy;hockeyWed, 06 Jan 2021 13:35:00 GMTకేసీఆర్ సమీప బంధువైన మాజీ హాకీ ప్లేయర్ ప్రవీణ్ రావు మరియు ఆయన సోదరులు సినీ ఫక్కీలో కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. బోయిన్ పల్లిలో ఆమెను అదుపులోకి తీసుకొని తన సొంత కారులోనే బోయనపల్లికి తరలిస్తున్నారు. అయితే హఫీజ్ పేట్ లోని 50 ఎకరాల‌ భూవ్యవహారమే ఈ కిడ్నాప్ కు కారణంగా గుర్తించారు. భూమా నాగిరెడ్డి హయాం నుండి ఈ భూ వివాదం నడుస్తోంది. అయితే భార్గవ్ సోదరుడు సెటిల్ మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. రెక్కీ నిర్వహించి మరీ కిడ్నాప్ చేశారు. మొత్తం ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే కిడ్నాపర్లు ఉన్నారు.



ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... బోయిన్ పల్లిలో రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మాజీ హాకీ ప్లేయర్ ప్రవీణ్ రావు మరియు అతని సోదరులు కిడ్నాప్‌కు గురయ్యారు. ఐటీ అధికారుల పేరుతో సోదాలు, అరెస్ట్ ల పేరుతో కిడ్నాపర్లు ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్నవారిని ఓ గదిలో బంధించారు. ఈ ముగ్గుర్ని కూడా కారుల్లో ఎక్కించి తీసుకెళ్లారు. అయితే ఫిర్యాదు అందిన ఆరుగంటల్లోనే నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సిసి కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. నేరుగా రంగంలోకి హైదరాబాద్ సిపి అంజనీకుమార్ దిగారు. నగర శివార్లు దాటకముందే కిడ్నాపర్స్ ఎవరో గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 15మంది నిందితులు ఉన్నారు. కిడ్నాపర్లు ఉపయోగించిన మూడు వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తీసుకెళ్లిన ఫోన్స్, హార్డిస్క్, డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. హఫీజ్ పేట్ 50 ఎకరాల భూ వివాదమే ఈ కిడ్నాప్ కి కారణం అని పోలీసులు తేల్చారు. అయితే ఈ భూ వివాదంలో చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో భూమా అఖిల ప్రియ భర్త భార్గవరామ్ సోదరుడు చంద్రబోస్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు . ఈ క్రమంలోనే పోలీసులు మాజీ మంత్రి అఖిలప్రియను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.


ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం ...!?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>