PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kcrf1f4ad0e-f4b3-42e5-8416-6a86d088e057-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kcrf1f4ad0e-f4b3-42e5-8416-6a86d088e057-415x250-IndiaHerald.jpgతెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని ప్రధాన రాజకీయ శత్రువులు చూస్తున్నా, బిజెపి రాబోయే ఎన్నికల్లో అధికారం నుంచి దూరం చేసి, తెలంగాణ బీజేపీ జెండా ఎగురవేయాలని లక్ష్యంతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్న లోపాన్ని వదిలిపెట్టకుండా ప్రజలలో చర్చకు పెడుతూ , ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్దేశించి అనేక ప్రశ్నలు సంధించారు. కెసిఆర్ రాష్ట్రాన్ని తాగి నడుపుతున్నారని bandi sanjay kcr telangana bjp trs;kcr;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;police;chief minister;central government;shatru1;mantraసంజయ్ మాటల తూటాలు .. కేసీఆర్ సమాధానం చెప్తారా ?సంజయ్ మాటల తూటాలు .. కేసీఆర్ సమాధానం చెప్తారా ?bandi sanjay kcr telangana bjp trs;kcr;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;police;chief minister;central government;shatru1;mantraWed, 06 Jan 2021 02:00:00 GMTబిజెపి రాబోయే ఎన్నికల్లో అధికారం నుంచి దూరం చేసి, తెలంగాణ బీజేపీ జెండా ఎగురవేయాలని లక్ష్యంతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్న లోపాన్ని వదిలిపెట్టకుండా ప్రజలలో చర్చకు పెడుతూ , ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్దేశించి అనేక ప్రశ్నలు సంధించారు.



కెసిఆర్ రాష్ట్రాన్ని తాగి నడుపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని , ఇప్పటి వరకు హైదరాబాద్ మేయర్ ఎన్నిక ఎందుకు జరగడం లేదంటూ పశ్నించారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్ ముందస్తు షెడ్యూల్ ఎందుకు పెట్టలేదని,  బీజేపీ ని చూస్తే కేసీఆర్ కు భయమేస్తుందని విమర్శించారు. కెసిఆర్ పెద్ద తోపు కాదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గల్లంతు అవుతుందని సంజయ్ జోస్యం చెప్పారు.వరంగల్ లో వరదలు వస్తే కెసిఆర్ ఇక్కడకు ఎందుకు రాలేదని, హైదరాబాద్ వరద బాధితులకు 10000 ఇచ్చిన కేసీఆర్ అదే వరద సాయం వరంగల్ లో ఎందుకు చేయలేదని నిలదీశారు.



" కెసిఆర్ దగుల్బాజీ ముఖ్యమంత్రి , బడా చోర్ ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో జరిగినట్లే వరంగల్ లోనూ జరగబోతోంది. వరంగల్ లో బిజెపి గెలవబోతోంది. సర్వేలు కూడా ఇవే చెబుతున్నాయి. అందుకే వరంగల్ లో ఎన్నికలు పెట్టడం లేదు. వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 196 కోట్ల రూపాయలు ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. కేవలం నలభై కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వరంగల్ అభివృద్ధి భద్రకాళి టెంపుల్ లో ప్రమాణానికి వరంగల్ ఎమ్మెల్యేలు , మంత్రులు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. వరంగల్ లో టిఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారు. కెసిఆర్ లక్ష ఉద్యోగాల హామీ ఏమైంది ? తెలంగాణలో ప్రమోషన్లు లేక పోలీసులు ఇబ్బంది పడుతున్నారు '' అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి సంజయ్ వ్యాఖ్యానించారు.


ఆ అడ్వాంటేజ్ పవన్‌కే ఉందా? అదొక్కటే ఇబ్బందా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>