PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgబీజేపీ వాళ్ల‌లో ఎందుకు గుబులు రేపుతోంది ? ఆ క‌థేంటో ? చూద్దాం. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌కు పోటీగా బీజేపీయే ఎదుగుతోంద‌న్న‌ది నిజం. దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌తో పాటు ఇటీవ‌ల జ‌రిగిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో బీజేపీ అంచ‌నాల‌కు మించి సంచ‌ల‌న విజ‌యాల‌తో దూసుకు పోతోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ తామే టీఆర్ఎస్ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి అన్న విష‌యాన్ని తెలంగాణ ప్ర‌జ‌ల్లో ప్రొజెక్ట్ చేసుకోవ‌డంలో బీజేపీ స‌క్సెస్ అయ్యింది. అయితే ఇక్క‌డే అస‌లు క‌థ ఉంది. రేవంత్‌రెడ్డి bjp;revanth;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;scheduled caste;assembly;letter;reddy;partyబీజేపీని టెన్ష‌న్ పెడుతోన్న తెలంగాణ పీసీసీ రేస్‌... !బీజేపీని టెన్ష‌న్ పెడుతోన్న తెలంగాణ పీసీసీ రేస్‌... !bjp;revanth;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;scheduled caste;assembly;letter;reddy;partyWed, 06 Jan 2021 13:03:00 GMTతెలంగాణ‌లో కొత్త పీసీసీ అధ్య‌క్షుడు ఎవర‌న్న స‌స్పెన్స్‌కు ఇంకా తెర‌ప‌డ‌లేదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీ పీసీసీ రేస్ రేవంత్‌రెడ్డి, కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి మ‌ధ్య దోబూచులాడి ఇప్పుడు అది సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి ద‌గ్గ‌ర ఆగింది. మ‌ళ్లీ జీవ‌న్ రెడ్డి కూడా చేతులు ఎత్తేయ‌డంతో అది రేవంత్ వైపు వెళుతున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడి ఎంపిక కాంగ్రెస్ పార్టీలో కాకుండా అనూహ్యంగా బీజేపీలో పెద్ద కాక రేగ‌డంతో పాటు ఆ పార్టీ వాళ్ల‌ను తెగ టెన్ష‌న్ పెట్టేస్తోంద‌ట‌.

అదేంటి టీ పీసీసీ అధ్య‌క్షుడి ఎంపిక బీజేపీ వాళ్ల‌లో ఎందుకు గుబులు రేపుతోంది ? ఆ క‌థేంటో ?  చూద్దాం. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌కు పోటీగా బీజేపీయే ఎదుగుతోంద‌న్న‌ది నిజం. దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌తో పాటు ఇటీవ‌ల జ‌రిగిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో బీజేపీ అంచ‌నాల‌కు మించి సంచ‌ల‌న విజ‌యాల‌తో దూసుకు పోతోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ తామే టీఆర్ఎస్ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి అన్న విష‌యాన్ని తెలంగాణ ప్ర‌జ‌ల్లో ప్రొజెక్ట్ చేసుకోవ‌డంలో బీజేపీ స‌క్సెస్ అయ్యింది.

అయితే ఇక్క‌డే అస‌లు క‌థ ఉంది. రేవంత్‌రెడ్డి లేదా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిల్లో ఎవ‌రికి టీ పీసీసీ ప‌గ్గాలు ఇచ్చానా తెలంగాణ‌లో కాంగ్రెస్ ఖ‌చ్చితంగా పుంజుకుంటోంది. ఇంకా చెప్పాలంటే  బీజేపీ ఈ రేసులో వెన‌క్కి వెళ్లి కాంగ్రెస్ వ‌ర్సెస్ టీఆర్ఎస్ పోటీయే మ‌ళ్లీ ఉంటుంది. కోమ‌టిరెడ్డి క‌న్నా రేవంత్ రెడ్డికి పీసీసీ ప‌గ్గాలు ఇస్తే బీజేపీకి చాలా మైన‌స్‌. ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ తీరుపై విసిగిపోయిన వారంతా కాంగ్రెస్‌పై న‌మ్మ‌కం లేక‌.. వాళ్ల‌కు ఒక్క‌డంటే ఒక్క నేత కూడా క‌నిపించ‌క బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇప్పుడు వాళ్ల‌తో పాటు మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు అంద‌రూ కాంగ్రెస్‌కు ఉండ‌డంతో పాటు రేవంత్ ఆక‌ర్ష‌ణ తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు జ‌వ‌స‌త్వాలు ఇస్తుంది. ఇక రేవంత్ త‌ర్వాత కోమ‌టిరెడ్డి కూడా స్ట్రాంగ్ లీడ‌ర్ కావ‌డంతో పాటు పైస‌లు ఉన్న నేత కావ‌డంతో ఆయ‌న పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్నా బీజేపీకి దెబ్బ ఖాయం. ఈ ఇద్ద‌రికి కాకుండా ఏ ఇత‌ర నేత‌కు టీ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చినా కాంగ్రెస్ మ‌రింత పాతాళంలోకి వెళ్ల‌డంతో పాటు తెలంగాణ బీజేపీకి తిరుగు ఉండ‌దు. అందుకే ఇప్పుడు టీ పీసీసీ పీఠం రేవంత్‌, కోమ‌టిరెడ్డికి రాకూడ‌ద‌న్న‌దే బీజేపీ వాళ్ల కోరిక‌..?




కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్!

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>