PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/breking-siment-pampiniki-ys-nirman-yapaba5270d-3553-4d1b-8f0f-f7f038cc6b70-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/breking-siment-pampiniki-ys-nirman-yapaba5270d-3553-4d1b-8f0f-f7f038cc6b70-415x250-IndiaHerald.jpgదివీస్ ఫార్మా యాజమాన్యం, తుని ఎమ్మెల్యే, తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ సమీ, మత్స్య శాఖ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు , పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం జవ్వాది, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ అర్జా శ్రీకాంత్, ఇతర అధికారులు హాజరయ్యారు. హ్యాచరీస్ పరిశ్రమకు విఘాతం కలగని విధంగా ముందుకు వెళ్లాలని మంత్రి మేకపాటి ఆదేశాలు ఇచ్చారు. mekapati goutham reddy,ycp,mla,ap;gautham new;gautham;raja;srikanth;yajamanya;godavari river;dadisetti raja;muralidhar rao;mekapati goutham reddy;district;east;industries;east godavari;smart phone;collector;mla;director;february;minister;traffic police;local language;tuni;reddyఎమ్మెల్యేకి ఫోన్ చేసిన మంత్రి మేకపాటి... ఆ విషయంలో ఏం జరుగుతుందని ఆరా...!ఎమ్మెల్యేకి ఫోన్ చేసిన మంత్రి మేకపాటి... ఆ విషయంలో ఏం జరుగుతుందని ఆరా...!mekapati goutham reddy,ycp,mla,ap;gautham new;gautham;raja;srikanth;yajamanya;godavari river;dadisetti raja;muralidhar rao;mekapati goutham reddy;district;east;industries;east godavari;smart phone;collector;mla;director;february;minister;traffic police;local language;tuni;reddyWed, 06 Jan 2021 16:10:00 GMTతుని ఎమ్మెల్యే, తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ సమీ, మత్స్య శాఖ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు , పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం జవ్వాది, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ అర్జా శ్రీకాంత్,  ఇతర అధికారులు హాజరయ్యారు. హ్యాచరీస్ పరిశ్రమకు విఘాతం కలగని విధంగా ముందుకు వెళ్లాలని మంత్రి మేకపాటి ఆదేశాలు ఇచ్చారు.

భూగర్భంలోకి దివీస్ వ్యర్థాలు వెళ్లకుండా ఏవైనా చర్యలు చేపట్టారా అని పీసీబీ అధికారులను ఆరా తీసారు. దివీస్ తో సహా ఇతర పరిశ్రమలలోని కాలుష్యం పై లోతుగా అధ్యయనం చేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది అధ్యక్షతన సి ఐ బీ ఏ, ఎస్ ఐ ఎఫ్ టీ, మెరైన్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి ఆదేశాలు ఇచ్చారు. ఫిబ్రవరి మొదటి వారంలోగా దివీస్ సహా ఇతర పరిశ్రమలలోని కాలుష్యం, నియంత్రించే విధానం, చేపట్టవలసిన చర్యలపై నివేదిక అందజేయాలని ఆయన ఆదేశించారు.

తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో ఫోన్ లో ప్రత్యేకంగా మాట్లాడారు మంత్రి. దివీస్ గురించి మాత్రమే కాదు రాబోయే పరిశ్రమలు, పెట్టుబడుల గురించి కూడా ఆలోచన అవసరమని ఆయన సూచించారు. దివీస్ అంటేనే పట్టుకోలేని ఆగ్రహంతో స్థానిక ప్రజలు ఉన్నారని తుని ఎమ్మెల్యే  వివరించారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, దివీస్ పరిశ్రమ డైరెక్టర్ కలిసి ప్రజల ఆలోచనలు, ఆరోపణలు, ఆవేశాలు పరిగణలోకి తీసుకుని ఒకే తాటిపైకి వచ్చేలా చర్చించాలని సూచనలు చేసారు. స్థానిక ప్రజలు, మత్స్యకారుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. దివీస్ సమస్య పరిష్కారంలో జాప్యం జరిగితే ఫార్మా రంగంపైనే ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.


ప్చ్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కు ఇంకా క్లారిటీ రాలేదేంటబ్బా..

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్

74 ఏళ్ళ చంద్రబాబు.. కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>