MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sohail5082888a-9441-44b9-a5c6-9cd113b29948-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sohail5082888a-9441-44b9-a5c6-9cd113b29948-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై బిగ్ బాస్ షో ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోలో చికెన్.. మటన్.. చికెన్.. మటన్.. చికెన్..మటన్ అంటూ బిగ్ బాస్ హౌస్లో సందడి చేసిన సోహైల్‌ తెలుగు జనాల మనుసులు గెలిచాడు. బిగ్‏బాస్ సీజన్ 4 ఇంట్లో పక్కింటి అతిధిగా అడుగుపెట్టిన సోహైల్ .. తన ప్రవర్తనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. sohail;chiranjeevi;ram gopal varma;sanjay mishra;manu;srinivas;cinema;bigboss;producer;hindi;chicken;producer1;lella appi reddy;letter;vహిందీ వెబ్ సీరిస్‏లో హీరోగా బిగ్‏బాస్ ఫేం సోహైల్..!?హిందీ వెబ్ సీరిస్‏లో హీరోగా బిగ్‏బాస్ ఫేం సోహైల్..!?sohail;chiranjeevi;ram gopal varma;sanjay mishra;manu;srinivas;cinema;bigboss;producer;hindi;chicken;producer1;lella appi reddy;letter;vWed, 06 Jan 2021 11:00:00 GMTబుల్లితెరపై బిగ్ బాస్ షో ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోలో చికెన్.. మటన్.. చికెన్.. మటన్.. చికెన్..మటన్ అంటూ బిగ్ బాస్ హౌస్లో సందడి చేసిన సోహైల్‌ తెలుగు జనాల మనుసులు గెలిచాడు. బిగ్‏బాస్ సీజన్ 4 ఇంట్లో పక్కింటి అతిధిగా అడుగుపెట్టిన సోహైల్ .. తన ప్రవర్తనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ఫైనల్కు చేరి టాప్–5లో మూడో స్థానంలో నిలిచిన సింగరేణి ముద్దుబిడ్డ ఈ సీజన్లో అందరికంటే ఎక్కువ ఎంటర్ టైన్ చేశాడనడంలో ఎటువంటి సందేహం లేదు.  ఏ గుర్తింపు లేకుండా హౌస్లోకి వచ్చిన సోహైల్ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సెలబ్రెటీ అయ్యాడు. తన క్యారెక్టర్తో లక్షలాది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు.

అంతే కాకుండా ఫినాలే రోజున మెగాస్టార్ చిరంజీవి అభిమానాన్ని కూడా పొందాడు ఈ సింగరేణి బిడ్డ. బిగ్‏బాస్ ఫినాలే తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు. ఇప్పటికే జార్జిరెడ్డి నిర్మాత అప్పిరెడ్డి నిర్మిస్తున్న ఓ సినిమాలో సోహైల్ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాకు వి. శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా నిర్మాత, నటుడు అచ్యుత రామారావు కూడా సోహైల్‏తో మరో సినిమా ప్లాన్ చేసినట్లుగా టాక్.

ఇక ఈ సినిమా కంటే ముందు సోహైల్ ఓ హిందీ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇందులో సంజయ్ మిశ్రా కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా టాక్. ఈ వెబ్ సిరీస్‏ను వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఆ వెబ్ సిరీస్‏కు “మై హూ షోలే” అనే టైటిల్‏ను ఖరారు చేశారట. దాదాపు మూడు నెలలుగా ఈ వెబ్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందట. తొందర్లోనే ఈ వెబ్ సిరీస్‏ను ప్రారంభించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.




దూసుకొస్తున్న బర్డ్ ఫ్లూ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేకపోతే ప్రాణాలు పోతాయి..?

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>