Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/alibaba076fd211-718c-4441-94af-1479abcebfca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/alibaba076fd211-718c-4441-94af-1479abcebfca-415x250-IndiaHerald.jpgచైనా ఉక్కుపాదాల కింద ఆలీబాబా నలిగిపోతోందా..? జాక్ మాకు ఊపిరాడకుండా చేసి ఆలీబాబాను సమూలంగా అంతం చేయాలని చైనా చూస్తోందా..? అంటే అవుననే సమాధానాలే సర్వత్రా వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం ఓ కార్యక్రమంలో చైనా ప్రభుత్వంపై, అక్కడి ప్రభుత్వ బ్యాంకులపై, చైనా రెగ్యులేటరీలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన..alibaba;rbi;government;february;vegetable market;shanghai;beijingకక్ష తీర్చుకుంటున్న చైనా.. జాక్ మా ‘అలీబాబా’ మూతపడనుందా..?కక్ష తీర్చుకుంటున్న చైనా.. జాక్ మా ‘అలీబాబా’ మూతపడనుందా..?alibaba;rbi;government;february;vegetable market;shanghai;beijingWed, 06 Jan 2021 22:21:19 GMTబీజింగ్: చైనా ఉక్కుపాదాల కింద ఆలీబాబా నలిగిపోతోందా..? జాక్ మాకు ఊపిరాడకుండా చేసి ఆలీబాబాను సమూలంగా అంతం చేయాలని చైనా చూస్తోందా..? అంటే అవుననే సమాధానాలే సర్వత్రా వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం ఓ కార్యక్రమంలో చైనా ప్రభుత్వంపై, అక్కడి ప్రభుత్వ బ్యాంకులపై, చైనా రెగ్యులేటరీలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చైనా ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం కలిగించాయి. వెంటనే ఆలీబాబాను టార్గెట్ చేసుకుని అనేక రెగ్యులేటరీ అధికారులు అనేక దాడులు చేశారు. ఈ నేపథ్యంలో షాంఘై ఐపీఓలో ప్రవేశించాలనుకున్న ఆటీబాబా, యాంట్ గ్రూప్ అభ్యర్థనను చైనా ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల దాదాపు 35 బిలియన్ డాలర్ల మేర ఆలీబాబా నష్టపోయింది. దీంతో అప్పటినుంచి జాక్ మా బయట కనిపించడం కూడా లేదు.

ఇక ఇప్పుడు తాజాగా ఆలీబాబా తన అనుబంధ విభాగాలను కూడా మూసివేస్తోంది. ప్రభుత్వానికి తలొంచుతూ మెల్లమెల్లగా తన వ్యాపారాలను తగ్గించుకుంటోంది. ఫైనాన్సింగ్ రంగంతో పాటూ వివిధ రంగాలకు విస్తరించాలనుకున్న తన ఆలోచనలను పక్కన పెట్టి ఉన్న విభాగాలనే తగ్గించుకుంటోంది.  సంస్థకు చెందిన షామీ మ్యూజిక్ విభాగాన్ని ఫిబ్రవరి నుంచి మూసేస్తున్నట్టు అలీబాబా తాజాగా ప్రకటించడం దీనిని నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ చర్య ద్వారా మ్యూజిక్ రంగంలోకి ప్రవేశంచడం లేదంటూ అలీబాబా ప్రభుత్వానికి చెప్పకనే చెప్పింది.

నిర్వహణ సర్దుబాట్ల చేస్తుంన్నందునే ఈ విభాగాన్ని మూసేస్తున్నట్లు అలీబాబా చెబున్నప్పటికీ.. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోలేకనే ఈ చర్యకు ఆలీబాబా ఉపక్రమించిందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. 2013లో ప్రారంభమైన ఈ విభాగాన్ని విస్తరించేందుకు అలీబాబా భారీగా నిధులు వెచ్చిందని, అయితే చైనా ఆగ్రహానికి గురికావడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ఈ ఆలీబాబా ఈ పని చేసిందని వారు చెబుతున్నారు.

ఇలాగే కొనసాగితే చైనా ఒత్తిడితో ఆలీబాబా కూడా మూతపడే అవకాశం ఉందని, లేకపోతే చైనా ఆదేశాల మేరకు వివిధ స్వతంత్ర విభాగాలుగా అయినా విడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనా ఒక్క చిన్న మాటలో జాక్ మా తన వ్యాపార సాంమ్రాజ్యన్నే దెబ్బతీసుకున్నారనడంలో అతిశయోక్తి లేదని వ్యాఖ్యానిస్తున్నారు.


ఇంతకీ పవన్ అతడికి అవకాశం ఇస్తారా ......??

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>