PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-pawan-facing-problems-with-same-party-leaders-5ea7764a-9f83-4b84-a704-31e90f31e54b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-pawan-facing-problems-with-same-party-leaders-5ea7764a-9f83-4b84-a704-31e90f31e54b-415x250-IndiaHerald.jpgగెరిల్లా వార్ ఫేర్ అంటూ జగన్ రెడ్డి బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నా రని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన తలుచుకుంటే హైకోర్టు సీజేలు, న్యాయమూర్తులు క్షణంలో బదిలీ అవుతార ని పవన్ ఎద్దేవా చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100కు పైగా దేవాలయాలపై గత రెండేళ్ల కాలంలో దాడులు జరిగాయని, రథాలు దగ్ధాలు, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమయ్యాయని అన్నారు. జరుగుతున్న ఈ ఆరాచకంపై మాట్లాడితే “ప్రతిపక్షాల పై ఎదురుదాడి చేస్తారా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజలు హర్షించరు అంటూ పవన్ చెప్పుకొandhra pradesh;pawan;deva;kalyan;sudhakar;tara;jagan;police;chief minister;doctor;war;letter;kshanam;reddy;shaktiమీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్andhra pradesh;pawan;deva;kalyan;sudhakar;tara;jagan;police;chief minister;doctor;war;letter;kshanam;reddy;shaktiWed, 06 Jan 2021 16:00:00 GMTగెరిల్లా వార్ ఫేర్ అంటూ జగన్ రెడ్డి బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నా రని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన తలుచుకుంటే హైకోర్టు సీజేలు, న్యాయమూర్తులు క్షణంలో బదిలీ అవుతార ని పవన్ ఎద్దేవా చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100కు పైగా దేవాలయాలపై గత రెండేళ్ల కాలంలో దాడులు జరిగాయని, రథాలు దగ్ధాలు, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమయ్యాయని అన్నారు. జరుగుతున్న ఈ ఆరాచకంపై మాట్లాడితే “ప్రతిపక్షాల పై ఎదురుదాడి చేస్తారా  ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజలు హర్షించరు అంటూ పవన్ చెప్పుకొచ్చారు.


 మీరు ఎంతటి శక్తిమంతులో ఈ దేశ ప్రజలందరికి తెలుసన్న పవన్ మీరు ఒక్క లేఖ రాస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు క్షణంలో బదిలీ అయిపోతారని అన్నారు. అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా వార్ ఫేర్ చేయడానికి ఎవరు సాహసిస్తారని ఆయన ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 115 మంది ఐ.పి.ఎస్ లు, మరో 115 మంది అదనపు ఎస్.పి.లు వేలాది మంది పోలీసు సిబ్బంది మీ చేతుల్లో ఉన్నారని  అయినా విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. నిస్సహాయుడైన డాక్టర్ సుధాకర్ గారి పైన, సోషల్ మీడియాలో మీపైన పోస్టులు పెట్టేవారిపై అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసేవారిని పట్టుకుని ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. 

ఊరికో వాలంటీరు చొప్పున 2.60 లక్షల మందిని నియమించారు కదా వారు కూడా సమాచారం ఇవ్వలేకపొతున్నారా?  ఎక్కడ వుంది లోపం? మీలోనా? మీ నీడలో వున్న వ్యవస్థలోనా? అని ప్రశ్నించారు. పైగా ప్రతిపక్షాలు అన్నింటినీ ఒకే గాటన కట్టి దుష్ప్రచారం చేస్తున్నారనడం 'ఆడలేక మద్దెలు ఓడు' అన్నట్లు ఉందని పవన్ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా సహనంతో ఉన్న పీఠాధిపతులు సైతం రోడ్డుపైకి రావలసిన పరిస్థితిని తెచ్చారన్న ఆయన ఇకనైనా ఇటువంటి మాటలు కట్టిపెట్టి దోషులను పట్టుకుని, వారిని ప్రజల ముందు నిలబెట్టే పనిలో ఉంటే మంచిదని హితవపలికారు. 



రిలీజ్ డేట్ కు నోచుకోని రానా పాన్ ఇండియా..!

74 ఏళ్ళ చంద్రబాబు.. కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>