PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/high-court-judge-stops-chinna-jeeyar-on-temple-yatrabf9b5311-ced3-4d7d-977b-3500b88a79de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/high-court-judge-stops-chinna-jeeyar-on-temple-yatrabf9b5311-ced3-4d7d-977b-3500b88a79de-415x250-IndiaHerald.jpgఈనెల 17వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలను సందర్శించి స్థానికుల అభిప్రాయం తీసుకుంటానని ప్రకటించారు త్రిదండి చినజీయర్ స్వామి. అయితే గతంలో కూడా పలుమార్లు ఆయన యాత్రలకు సిద్ధమైన సందర్భాలున్నాయి. కానీ అప్పుడు అవి సాధ్యం కాలేదు. ఈసారి కూడా చినజీయర్ యాత్ర మొదలు పెడతారా? లేక ఇది కూడా మొదలు కాకుండానే ఆగిపోతుందా అనే అనుమానాలున్నాయి. chinna jeeyar;tiru;media;chinna jeeyar swamy ji;local language;march;yatra;yevaruచినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?chinna jeeyar;tiru;media;chinna jeeyar swamy ji;local language;march;yatra;yevaruWed, 06 Jan 2021 11:00:00 GMTచినజీయర్ స్వామి. అయితే గతంలో కూడా పలుమార్లు ఆయన యాత్రలకు సిద్ధమైన సందర్భాలున్నాయి. కానీ అప్పుడు అవి సాధ్యం కాలేదు. ఈసారి కూడా చినజీయర్ యాత్ర మొదలు పెడతారా? లేక ఇది కూడా మొదలు కాకుండానే ఆగిపోతుందా అనే అనుమానాలున్నాయి.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో పెద్ద సంఖ్యలో గుళ్లను కూల్చిన ఘటనలపై మీడియా చినజీయర్ ని ప్రశ్నించగా.. ఆ గుడులను మళ్లీ నిర్మిస్తామని చెప్పడంతో తాను జోక్యం చేసుకోలేదని ఆయన బదులిచ్చారు. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం కూల్చివేసినప్పుడు కూడా యాత్ర చేస్తానని అన్నారు చినజీయర్. అయితే అప్పుటి హైకోర్టు జడ్జి ఇచ్చిన సలహాతో తాను ఆ కార్యక్రమాన్ని ఆపివేశానని చెప్పారాయన. యాత్రపై పునరాలోచించుకోవాలని సదరు జడ్జి తనకు చెప్పారని, ఆయన మాట మన్నించి తాను జనంలోకి వెళ్లలేదని చెప్పారు. అయితే ఆ జడ్జి పేరు మాత్రం ఆయన బైట  పెట్టలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను సంచలనంగా మార్చి, ప్రజల్ని ఉద్రేకపరచకూడదన్నారు చినజీయర్. మతపరమైన విషయాలతో రాజకీయాలను ముడివేయొద్దని సూచించారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో.. ఇప్పుడే రాష్ట్రంలోని ఆలయాల్లో వరుసగా ఎందుకు ఉపద్రవాలు జరుగుతున్నాయో? వీటి వెనుక ఎవరున్నారో నిగ్గుతేల్చాల్సిన అవసరముందని అన్నారు చినజీయర్. ఇంటెలిజెన్స్‌ విభాగం పెద్దలతో కమిటీని నియమించి.. వారికి పూర్తి అధికారాలిచ్చి విచారణ జరిపిస్తే.. బాధ్యులెవరో తప్పకుండా తెలుస్తుందని ప్రభుత్వానికి సూచించారు. ఆలయాలకు రక్షణ కొరవడిందనే విషయం స్పష్టంగా కనబడుతోందన్నారాయన. ఆలయాలకు సంబంధించి రాష్ట్రంలో 50కి పైగా ఘటనలు జరిగాయని, 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆలయాలను సందర్శిస్తానని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని వెంటనే ఆపేయాలని ఆయన సూచించారు. రాజకీయ పార్టీలు కూడా సంయమనం పాటించాలని, ప్రజల్ని రెచ్చగొట్టొద్దని కోరారు.




దూసుకొస్తున్న బర్డ్ ఫ్లూ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేకపోతే ప్రాణాలు పోతాయి..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>