PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-reverse-on-bjp-in-ap-politics-9ff1e840-ef10-4084-b4b9-cf5b05e86cb9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-reverse-on-bjp-in-ap-politics-9ff1e840-ef10-4084-b4b9-cf5b05e86cb9-415x250-IndiaHerald.jpgఏపీలో ఆలయాల రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. అయితే ఇవి కుట్ర పూరితంగానే జరుగుతున్నాయని తెలుస్తుంది. కానీ ఎవరు చేశారనేది క్లారీటీ రావడం లేదు. టీడీపీ వాళ్ళు ఏమో వైసీపీ వాళ్లే చేస్తున్నారని, జగన్ క్రిస్టియన్ కాబట్టి, హిందూ మతాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. జగన్ హిందూ ద్రోహి అంటున్నారు. tdp;bharatiya janata party;jagan;andhra pradesh;hosta;minister;christian;cheque;mosque;tdp;central government;ycp;dookuduటీడీపీ రివర్స్: బీజేపీకి చెక్ పడుతుందా?టీడీపీ రివర్స్: బీజేపీకి చెక్ పడుతుందా?tdp;bharatiya janata party;jagan;andhra pradesh;hosta;minister;christian;cheque;mosque;tdp;central government;ycp;dookuduWed, 06 Jan 2021 04:00:00 GMTఏపీలో ఆలయాల రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. అయితే ఇవి కుట్ర పూరితంగానే జరుగుతున్నాయని తెలుస్తుంది. కానీ ఎవరు చేశారనేది క్లారీటీ రావడం లేదు. టీడీపీ వాళ్ళు ఏమో వైసీపీ వాళ్లే చేస్తున్నారని, జగన్ క్రిస్టియన్ కాబట్టి, హిందూ మతాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. జగన్ హిందూ ద్రోహి అంటున్నారు.

ఇదే సమయంలో చంద్రబాబు కుట్ర పన్ని ఇవన్నీ చేయిస్తున్నారని, దీని వెనుక బాబు హస్తం ఉందని, ఆయన చేయించే ఆ తప్పుని జగన్ మీదకు తోసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక వీరి వర్షన్ ఇలా ఉంటే బీజేపీది మరోలా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న దాడులుపై వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతూనే, గతంలో చంద్రబాబు ప్రభుత్వం సైతం పలు హిందూ ఆలయాలని కూల్చివేసిందని విమర్శలు చేస్తున్నారు.

బీజేపీ మొదట నుంచి వైసీపీ కంటే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీనే ఎక్కువ టార్గెట్ చేసి ముందుకెళుతుంది. అయితే ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీ, బీజేపీ మీద అంత దూకుడుగా వెళ్ళడం లేదు. అవసరమైతే బీజేపీతో కలిసి ముందుకెళ్లాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇక ఇది అడ్వాంటేజ్‌గా తీసుకునే బీజేపీ, టీడీపీని టార్గెట్ చేస్తుంది. అయితే తాజాగా మాత్రం టీడీపీ రివర్స్ అయింది. బీజేపీ విమర్శలు మరీ పెరిగిపోవడంతో, టీడీపీ దూకుడు పెంచింది.

జేపీ మాట్లాడితే టీడీపీనే విమర్శిస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడుతున్నారు. విజయవాడలో ఫ్లై ఓవర్ కోసం కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాల మేరకు కొన్ని గుడులు, మసీదులు తొలగించారని చెబుతున్నారు. ఫ్లై ఓవర్ క్రెడిట్ మాత్రం బీజేపీకి కావాలని, కానీ అభివృద్ధిలో భాగంగా తొలగించిన ఆలయాల విషయంలో టీడీపీనే టార్గెట్ చేస్తున్నారని, బీజేపీకి చేతలు లేవని.. కేవలం ప్రసంగాలు మాత్రమేనని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇప్పుడు అభివృద్ధి జరగడం లేదని, కావాలనే ఆలయాలపై దాడులు చేస్తున్నారని, వీటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి చెక్ పెట్టాలని టీడీపీ నేతలు చెబుతున్నారు.




రాజకీయ లభ్ది కోసం చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారు - వైసీపీ నేత

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>