PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/fake-mobile-apps-in-the-name-of-covid-vaccine73c0de07-f5df-4fce-9166-2a59722b1055-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/fake-mobile-apps-in-the-name-of-covid-vaccine73c0de07-f5df-4fce-9166-2a59722b1055-415x250-IndiaHerald.jpgభారత్ లో టీకా పంపిణీ ప్రక్రియకు తొలి అడుగులు పడ్డాయి. అత్యవసర పంపిణీకోసం రెండు టీకాలను ఎంపిక చేసింది ప్రభుత్వం. మరోవైపు టీకా పంపిణీ తేదీపై కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అటు డ్రై రన్ పేరుతో రాష్ట్రాల్లో ట్రయల్ రన్ మొదలు పెట్టింది కేంద్రం. కొవిన్ అనే పోర్టల్ లో డ్రైరన్ కార్యక్రమం అంతా నమోదైందని అధికారులు ప్రకటించారు కూడా. అయితే ఈ కొవిన్ ఏంటి? టీకా కావాలంటే దీనిలో నమోదు చేయించుకోవాలా? అనే అనుమానాలు సామాన్య ప్రజల్లో ఉన్నాయి. కొవిన్ అనే పేరు తెలిసింది కానీ, దాని గురించి పూర్తి వివరాలు మాత్రం బcovin app;india;google;qualification;central governmentటీకా కోసం యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారా..? మీ పని గల్లంతే..టీకా కోసం యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారా..? మీ పని గల్లంతే..covin app;india;google;qualification;central governmentWed, 06 Jan 2021 08:00:00 GMTభారత్ లో టీకా పంపిణీ ప్రక్రియకు తొలి అడుగులు పడ్డాయి. అత్యవసర పంపిణీకోసం రెండు టీకాలను ఎంపిక చేసింది ప్రభుత్వం. మరోవైపు టీకా పంపిణీ తేదీపై కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అటు డ్రై రన్ పేరుతో రాష్ట్రాల్లో ట్రయల్ రన్ మొదలు పెట్టింది కేంద్రం. కొవిన్ అనే పోర్టల్ లో డ్రైరన్ కార్యక్రమం అంతా నమోదైందని అధికారులు ప్రకటించారు కూడా. అయితే ఈ కొవిన్ ఏంటి? టీకా కావాలంటే దీనిలో నమోదు చేయించుకోవాలా? అనే అనుమానాలు సామాన్య ప్రజల్లో ఉన్నాయి. కొవిన్ అనే పేరు తెలిసింది కానీ, దాని గురించి పూర్తి వివరాలు మాత్రం బైటకు రాలేదు. కొంతమంది అత్యుత్సాహవంతులు కొవిన్ పేరుతో గూగుల్ సెర్చ్ చేసి మోసపోతున్నట్టు తెలుస్తోంది.

గూగుల్ ప్లే స్టోర్ సహా.. ఇతర యాప్ స్టోర్స్ లో కొవిన్ పేరుతో లెక్కకు మిక్కిలి యాప్ లు అందుబాటులో ఉన్నాయి. కొవిన్ అనే పేరు బైటకు రాగానే చాలామంది నకిలీ యాప్ లు సృష్టించేసి బయటకు వదిలేశారు. ఈ క్రమంలో వీటి బారిన పడి.. ఆధార్ వంటి సమాచారాన్ని అప్పనంగా అప్పగిస్తే అంతే సంగతులు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

కొవిన్‌ యాప్‌ అధికారికంగా అందుబాటులోకి రావడానికి 3 నుంచి 4 వారాలు పట్టొచ్చని, అప్పటివరకూ వేచి ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇదే విషయంపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. టీకాల పంపిణీలో కీలక పాత్ర పోషించేది ‘కొవిన్‌ యాప్‌’. ఇందులో సమాచారాన్ని నమోదు చేసుకుంటేనే.. టీకా పొందడానికి అర్హత లభిస్తుంది. ఇది ఇప్పటి వరకూ వైద్యసిబ్బందికి, పోలీసు, మున్సిపాల్టీ, రెవెన్యూ సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉంది.  టీకా పంపిణీకి గడువు సమీపిస్తుండడంతో.. సామాన్య ప్రజలు కొవిన్‌ యాప్‌ కోసం యాప్‌ స్టోర్లలో వెతుకుతూ నకిలీల బారిన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కొవిన్‌ యాప్‌ను ఇప్పటి వరకూ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఇది తెలియని లబ్ధిదారులు నకిలీ యాప్‌ లలో తమ సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. దీనివల్ల మోసాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొవిన్ యాప్ పై అధికారికంగా సమాచారం వచ్చే వరకు ఆ పేరుతో ఉన్న ఏ యాప్ జోలికి వెళ్లొద్దని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వమే అధికారిక ప్రకటన చేస్తుందని చెబుతున్నారు. 


కేజిఎఫ్ సినిమా చూడలేదు.. కేజిఎఫ్ 2లో చేస్తున్నాను.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు..?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>