PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-on-rama-theertham-incident-e653fb12-1f5f-4b27-92f7-e406b5a60509-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-on-rama-theertham-incident-e653fb12-1f5f-4b27-92f7-e406b5a60509-415x250-IndiaHerald.jpgటీడీపీ నేతల ఆరోపణలపై కాసు వారబ్బాయ్ ఘాటుగా స్పందించారు. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను నడిరోడ్డుపై హత్య చేసిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. ఆయన హయాంలో రాష్ట్రంలో చాలా హత్యలు జరిగాయని.. అవన్నీ ఆయన ప్రోద్బలంతోనే జరిగాయని భావించాలా? అంటూ సూటిగా ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం శవరాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.chandrababu;cbn;mahesh;pithe;telugu;police;history;mla;murder.;tdp;ycp;vangaveeti;reddy;narendra;gurazalaరాజకీయ లభ్ది కోసం చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారు - వైసీపీ నేతరాజకీయ లభ్ది కోసం చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారు - వైసీపీ నేతchandrababu;cbn;mahesh;pithe;telugu;police;history;mla;murder.;tdp;ycp;vangaveeti;reddy;narendra;gurazalaWed, 06 Jan 2021 05:30:00 GMTఇటీవలే తాజాగా పల్నాడులో కలకలం రేపిన టీడీపీ నేత, పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకుల్‌ హత్యపై అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి ప్రోద్బలంతోనే అంకులు దారుణ హత్యకు గురయ్యాడని మాజీ ఎమ్మెల్యే, సీనియర్ టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నలుగురు టీడీపీ కార్యకర్తలను దారుణంగా హత్య చేయించారని ధ్వజమెత్తారు. అటు టీడీపీ నేతల ఆరోపణలపై కాసు వారబ్బాయ్ ఘాటుగా స్పందించారు. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను నడిరోడ్డుపై హత్య చేసిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. ఆయన హయాంలో రాష్ట్రంలో చాలా హత్యలు జరిగాయని.. అవన్నీ ఆయన ప్రోద్బలంతోనే జరిగాయని భావించాలా? అంటూ సూటిగా ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం శవరాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.





 తన రాజకీయ ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే యరపతినేనిపైనా విరుచుకుపడ్డారు. పిడుగురాళ్లలో జరిగిన ఉన్నం నరేంద్ర హత్య కేసులో ముద్దాయిగా ఉన్న సంగతి మర్చిపోయావా అంటూ నిలదీశారు. హత్యకు గురైన అంకులు ఎవరో కూడా తనకు తెలియదన్న కాసు మహేష్.. కనీసం ఆయనను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఆయన్ను చంపితే తమకేం వస్తుందంటూ ఎదురుదాడికి దిగారు. టీడీపీ నాయకులు శవరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పురంశెట్టి అంకులు హత్యపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని.. అసలు నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తెలిపారు. అంకులు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ హత్య కేసులో ఎంతటి వారున్నా శిక్ష తప్పదని కాసు వ్యాఖ్యానించారు. కేవలం సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే దేవాలయాలపై దాడులు, శవరాజకీయాలకు టీడీపీ తెరలేపిందని ఆయన విమర్శించారు.




కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>