PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/warangal-trs-bjp-leaders-war69ab2f16-7b7d-4c9a-a5bd-61f74a29f92f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/warangal-trs-bjp-leaders-war69ab2f16-7b7d-4c9a-a5bd-61f74a29f92f-415x250-IndiaHerald.jpgవరంగల్ పర్యటనలో సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన బండి సంజయ్ పై వరంగల్ టీఆర్ఎస్ నేతలు ఫైరయ్యారు. బండిపై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తొండి సంజయ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ‘‘నీది నోరా...? మోరా..? ’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వినయ్ భాస్కర్.bandi sanjay vinay bhasker;kcr;bhaskar;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;baba bhaskar;chief minister;qualification;central governmentతొండి సంజయ్.. నాలుక చీరేస్తాం!తొండి సంజయ్.. నాలుక చీరేస్తాం!bandi sanjay vinay bhasker;kcr;bhaskar;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;baba bhaskar;chief minister;qualification;central governmentWed, 06 Jan 2021 19:38:26 GMTవరంగల్ రాజకీయాలు వేడెక్కాయి. త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జరగనుండటంతో
ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ పర్యటనతో
అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వరంగల్ పర్యటనలో సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన బండి సంజయ్ పై వరంగల్ టీఆర్ఎస్ నేతలు ఫైరయ్యారు. బండిపై  ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తొండి సంజయ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ‘‘నీది నోరా...? మోరా..? ’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వినయ్ భాస్కర్. సీఎం కేసీఆర్‎ను విమర్శించే అర్హత బండి సంజయ్‌కు లేదని మండిపడ్డారు. కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు అవాకులు చెవాకులు పేలితే నాలుక చీరేస్తాం అంటూ బండి సంజయ్ కి వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్.  బీజేపీ నేతలు ఒళ్లు దగ్గర పెటుకొని ఉండాలన్నారు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని.. లేదంటే ఖబడ్దార్ అంటూ బీజేపీ నేతలను హెచ్చరించారు వినయ్ భాస్కర్.

       మంగళవారం వరంగల్ లో పర్యటించిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్‌ తోపేం కాదు. పచ్చి దగుల్బాజీ, బడాచోర్‌, మూర్ఖుడు  అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. మద్యం తాగి పాలన చేస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఢిల్లీ వెళ్లొచ్చిన కేసీఆర్‌.. ఫామ్‌ హౌస్‌కే పరిమితమయ్యారనీ, ప్రజలను కలవని ఏకైక ముఖ్యమంత్రి ఈయనేనని బండి మండిపడ్డారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరించి వరంగల్‌ను మజ్లిస్‌ అడ్డాగా మార్చేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారన్నారు బండి సంజయ్.  

       
   బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు వరంగల్ కమలం నేతలు వెంటనే కౌంటరిచ్చారు. భూకబ్జాలే కాకుండా నయిమ్ తో సెటిల్మెంట్లు చేసిందెవరో వరంగల్ ప్రజలకు తెలుసన్నారు. వరంగల్ అభివృద్ధిపై చర్చించేందుకు  భద్రకాళి గుడికి టిఆర్ ఎస్ నేతలు రావాలని సవాల్ చేశారు. స్మార్ట్ సిటీ నిధులపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.




మరో చిన్నారి ప్రాణం నిలబెట్టిన సోనూసూద్

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>