EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagance9da526-23f0-47ac-b679-3e095839d6ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagance9da526-23f0-47ac-b679-3e095839d6ef-415x250-IndiaHerald.jpgగతంలో చంద్రబాబు హాయాంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిన అంశాల్ల ఇసుక ఒకటి.. ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక కూడా ఇసుక విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. జగన్ సీఎం అయిన మొదట్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉండేది.. ఇప్పుడు క్రమంగా సెట్ అవుతోంది. అందుకే జగన్ సర్కారు ఆరోపణలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు కొత్త పద్దతులు ఉపయోగిస్తోంది. ప్రజలకు పారదర్శకంగా ఇసుక అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇసుక రీచ్‌లలో తవ్వకాలు, రవాణా కోసం టెండర్ల నిర్వహణలో అవకతవకలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ సాయం తీసుకjagan;amala akkineni;godavari river;krishna river;jagan;east;east godavari;vishakapatnam;central government;ycp;mantraజగన్‌... ఇకనైనా నీకు ఇసుక కష్టాలు తప్పేనా..?జగన్‌... ఇకనైనా నీకు ఇసుక కష్టాలు తప్పేనా..?jagan;amala akkineni;godavari river;krishna river;jagan;east;east godavari;vishakapatnam;central government;ycp;mantraWed, 06 Jan 2021 06:00:00 GMTజగన్ సీఎం అయ్యాక కూడా ఇసుక విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. జగన్ సీఎం అయిన మొదట్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉండేది.. ఇప్పుడు క్రమంగా సెట్ అవుతోంది. అందుకే జగన్ సర్కారు ఆరోపణలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు కొత్త పద్దతులు ఉపయోగిస్తోంది. ప్రజలకు పారదర్శకంగా ఇసుక అందించేందుకు ప్రయత్నిస్తోంది.

ఇసుక రీచ్‌లలో తవ్వకాలు, రవాణా కోసం టెండర్ల నిర్వహణలో అవకతవకలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌  సాయం తీసుకుంటోంది. అప్‌గ్రేడెడ్‌ శాండ్, మైనింగ్‌ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ మధ్య ఎంఓయూ కుదుర్చుకుంది.  ఇసుక రీచ్‌లలో తవ్వకాలు, రవాణా కోసం టెండర్ల నిర్వహణ బాధ్యత కేంద్ర ప్రభుత్వ సంస్థ చేపట్టనుంది. ప్రజలకు పారదర్శకంగా ఇసుక అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ విధానం ప్రకారం రాష్ట్రంలో 13 జిల్లాలు మూడు జోన్లుగా విభజించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తూర్పుగోదావరి జిల్లాలు ఒక జోన్‌. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు మరో జోన్, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైయస్‌ఆర్‌ జిల్లాలు ఇంకో జోన్‌గా విభజించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు.


కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా అమ్మకాలు చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా అక్రమాలకు ఆస్కారం ఉండదంటున్నారు వైసీపీ నాయకులుయ ఈ ఒప్పందం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నామంటున్నారు. ఎడ్లబండ్ల ద్వారా రీచ్‌లకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో టోకెన్‌ విధానంతో ఇసుక అందించనున్నామన్నారు. ఆన్‌లైన్‌ లేకుండా ఆఫ్‌లైన్‌లోనూ ఇసుక ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం డబ్బే పరమావధిగా ఇసుక విధానం అమలు చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్‌జీటీ రూ.100 కోట్ల జరిమానా కూడా విధించిందని గుర్తుచేశారు. మరి ఈ విధానం ఎంతవరకూ సక్సస్ అవుతుందో చూడాలి. 


జ‌న‌వ‌రి 6వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>