PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan099ecbb9-d98b-477a-a254-64472b78a3b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan099ecbb9-d98b-477a-a254-64472b78a3b3-415x250-IndiaHerald.jpgపేరు చూసి స‌హించలేకే కొంద‌రు విధ్వంసాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు. రాజ‌కీయ దురుద్దేశంతో ప‌క్కా ప్లానింగ్‌తోనే కొంద‌రు అర్ధ‌రాత్రి విగ్ర‌హాల విధ్వంసానికి పాల్ప‌డుతున్నార‌ని.. అలా చేసే వాళ్ల‌తో పాటు కొంద‌రు రాజ‌కీయ స్వార్థ‌ప‌రులు వీటికి సోష‌ల్ మీడియాలో విస్తృత‌మైన ప్ర‌చారం క‌ల్పిస్తున్నార‌ని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ 5 లాంటి మీడియా సంస్థ‌లు వీటికి విస్తృత ప్ర‌చారం చేసి.. కొంద‌రు ప్ర‌జ‌ల మ‌నో భావాల‌ను రెచ్చ‌గొట్టేలా చేస్తున్నాయ‌ని జ‌గ‌న్ jagan;police;media;television;letter;hindusఎవ్వ‌రిని వ‌ద‌ల‌ను... అంద‌రి లెక్క‌లు తేలుస్తా... జ‌గ‌న్ ఓపెన్ వార్నింగ్‌...!ఎవ్వ‌రిని వ‌ద‌ల‌ను... అంద‌రి లెక్క‌లు తేలుస్తా... జ‌గ‌న్ ఓపెన్ వార్నింగ్‌...!jagan;police;media;television;letter;hindusWed, 06 Jan 2021 09:49:45 GMTఏపీలో ప్ర‌స్తుతం రాజ‌కీయం అంతా విగ్ర‌హాల విధ్వంసం చుట్టూ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌తిప‌క్షాలు సీఎం జ‌గ‌న్‌ను గ‌ట్టిగా టార్గెట్ చేస్తున్నాయి. అధికారం నేత‌లు దీనిని ఎంత గ‌ట్టిగా తిప్పికొడుతున్నా హిందువుల మ‌న‌స్సుల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం హిందూ వ్య‌తిరేకా ? అన్న సందేహాలు రేకెత్తించేలా ఉంది. తాజాగా ఈ విగ్ర‌హాల విధ్వంసంపై సీఎం జ‌గ‌న్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చేశారు. ఇలాంటి రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోన్న వారంద‌రికి త్వ‌ర‌లోనే గుణ‌పాఠం చెప్పే రోజు వ‌స్తుంద‌ని ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు.

క‌లెక్ట‌ర్లు, ఎస్సీల స‌మావేశంలో జ‌గ‌న్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. తాను ప్ర‌జ‌ల కోసం ఎన్నో అమ‌లు చేస్తున్నాన‌ని.. సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌భుత్వానికి వ‌స్తోన్న మంచి పేరు చూసి స‌హించలేకే కొంద‌రు విధ్వంసాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు. రాజ‌కీయ దురుద్దేశంతో ప‌క్కా ప్లానింగ్‌తోనే కొంద‌రు అర్ధ‌రాత్రి విగ్ర‌హాల విధ్వంసానికి పాల్ప‌డుతున్నార‌ని.. అలా చేసే వాళ్ల‌తో పాటు కొంద‌రు రాజ‌కీయ స్వార్థ‌ప‌రులు వీటికి సోష‌ల్ మీడియాలో విస్తృత‌మైన ప్ర‌చారం క‌ల్పిస్తున్నార‌ని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ క్ర‌మంలోనే ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ 5 లాంటి మీడియా సంస్థ‌లు వీటికి విస్తృత ప్ర‌చారం చేసి.. కొంద‌రు ప్ర‌జ‌ల మ‌నో భావాల‌ను రెచ్చ‌గొట్టేలా చేస్తున్నాయ‌ని జ‌గ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌స్తుతం ఏపీలో పొలిటిక‌ల్ గొరిల్లా యుద్ధం జ‌రుగుతోంద‌న్న జ‌గ‌న్ ఈ కుట్ర‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటామ‌ని.. కులాలు, మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్టే వాళ్ల‌కు త్వ‌ర‌లోనే త‌గిన గుణ‌పాఠం చెపుతామ‌ని హెచ్చరించారు.

తాము ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆల‌యాల్లో 36 వేల సీసీ కెమేరాలు పెట్టామ‌ని.. ఆల‌యాల్లో సీసీ కెమేరాలు పెడుతున్నామంటే రాజ‌కీయాలు ఏ స్థాయికి దిగ‌జారిపోయాయో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. ఈ క్ర‌మంలోనే విగ్ర‌హాలు ధ్వంసం చేసే వారిని ఉపేక్షించ‌వ‌ద్దంటూ పోలీసుల‌కు ఫుల్ ప‌వ‌ర్స్ ఇచ్చారు. ఏదేమైనా ఈ విష‌యంలో జ‌గ‌న్ ఎవ్వ‌రిని స‌హించేది లేద‌ని తేల్చేశారు. 


ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య సినిమా... టైటిల్ ఇదే...!

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>