PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp-bjp3ac3fccd-4ce5-4a12-8c12-e68b2e5199cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp-bjp3ac3fccd-4ce5-4a12-8c12-e68b2e5199cd-415x250-IndiaHerald.jpgకాని ప‌రిస్థితి. గ‌తంలో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు గ‌ట్టిగా ఫైట్ చేసినందుకు వైఎస్ నాడు కాంగ్రెస్‌లో చేర్చుకుని ప్ర‌యార్టీ ఇచ్చారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ వైసీపీ పెట్టిన వెంట‌నే ఆ పార్టీలో చేరారు. ఆ త‌ర్వాత బీజేపీ అధికారంలో ఉండ‌డంతో ఆ పార్టీలో చేరారు. కిష‌న్ రెడ్డి జీవిత‌కు సెన్సార్ బోర్డు మెంబ‌ర్ ప‌ద‌వి ఇప్పించారు. ఆ ప‌ద‌వి పోయాక తిరిగి చంద్ర‌బాబుకు ద‌గ్గ‌ర‌య్యారు. చివ‌ర‌కు ఎన్నిక‌ల‌కు ముందు మ‌ళ్లీ వైసీపీ కండువా క‌ప్పుకుని ఆ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేశారు. ఇప్పుడు జ‌గ‌న్ వాళ్ల‌ను ప‌టysrcp bjp;chiranjeevi;kcr;jeevitha rajaseskhar;delhi;bharatiya janata party;andhra pradesh;telangana;congress;mp;cinema;mla;wife;letter;ycp;reddy;partyఏపీలో జ‌గ‌న్ భ‌జ‌న‌.. తెలంగాణ‌లో బీజేపీ భ‌జ‌న‌... వీళ్ల స్టైలే వేరు...!ఏపీలో జ‌గ‌న్ భ‌జ‌న‌.. తెలంగాణ‌లో బీజేపీ భ‌జ‌న‌... వీళ్ల స్టైలే వేరు...!ysrcp bjp;chiranjeevi;kcr;jeevitha rajaseskhar;delhi;bharatiya janata party;andhra pradesh;telangana;congress;mp;cinema;mla;wife;letter;ycp;reddy;partyWed, 06 Jan 2021 13:30:00 GMTపార్టీ మారిన దాఖ‌లాలు చూశాం.. అది వాళ్ల అవ‌స‌రం.. ఏ పార్టీలో ప‌ద‌వి, హోదా ఉంటుందో ? ఆ పార్టీలోకే జంప్ చేసేస్తారు. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు మూడు రోజుల్లో ఏకంగా మూడు పార్టీలు మారారు. ఈ రోజు టీడీపీలో ఉన్న ఆయ‌న రేపు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. ఆ మ‌రుస‌టి రోజే కేసీఆర్ స‌మ‌క్షంలో గులాబీ కండువా క‌ప్పుకుని మ‌ల్కాజ్‌గిరి ఎంపీ సీటు ద‌క్కించుకున్నారు. కేసీఆర్ ఆ సీటు ఇవ్వ‌క‌పోయి ఉంటే ఆయ‌న ఆ వెంట‌నే మ‌రో పార్టీ మారినా పెద్ద ఆశ్చ‌ర్య ప‌డాల్సిన ప‌నిలేదు.

ఇక సినిమా భార్య భ‌ర్త‌లు అయిన జీవితా రాజ‌శేఖ‌ర్ దంప‌తుల పార్టీ కండువాల మార్పు గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. అస‌లు వీళ్లు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో ?  కూడా అర్థం కాని ప‌రిస్థితి. గ‌తంలో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు గ‌ట్టిగా ఫైట్ చేసినందుకు వైఎస్ నాడు కాంగ్రెస్‌లో చేర్చుకుని ప్ర‌యార్టీ ఇచ్చారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ వైసీపీ పెట్టిన వెంట‌నే ఆ పార్టీలో చేరారు. ఆ త‌ర్వాత బీజేపీ అధికారంలో ఉండ‌డంతో ఆ పార్టీలో చేరారు. కిష‌న్ రెడ్డి జీవిత‌కు సెన్సార్ బోర్డు మెంబ‌ర్ ప‌ద‌వి ఇప్పించారు.

ఆ ప‌ద‌వి పోయాక తిరిగి చంద్ర‌బాబుకు ద‌గ్గ‌ర‌య్యారు. చివ‌ర‌కు ఎన్నిక‌ల‌కు ముందు మ‌ళ్లీ వైసీపీ కండువా క‌ప్పుకుని ఆ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేశారు. ఇప్పుడు జ‌గ‌న్ వాళ్ల‌ను ప‌ట్టించుకోక పోవ‌డంతో తిరిగి మ‌ళ్లీ బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా బీజేపీలో చేరిన జీవిత‌కు ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కండువా క‌ప్పేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌క పోవ‌డంతో చివ‌ర‌కు ఆమే స్వ‌యంగా కండువా మొడ‌లో వేసుకోవాల్సి వచ్చింది.

విచిత్రం ఏంటంటే ఈ సారి రాజ‌శేఖ‌ర్ పార్టీ మార‌లేదు. అంటే రాజ‌శేఖ‌ర్ వైసీపీలో ఉన్న‌ట్టేనా ?  ఇక జీవిత ఏపీ బీజేపీ అధ్య‌క్షుడి స‌మ‌క్షంలో పార్టీలో చేర‌వ‌చ్చు.. కానీ ఆమె అలా చేయ‌లేదు.. అంటే తెలంగాణ‌లో బీజేపీ స్వింగ్‌లో ఉండ‌డంతో ఆమె ఆ పార్టీలో చేరారు. కాలం క‌లిసొస్తే హైద‌రాబాద్‌లో ఏదో ఒక సీటు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌న్న‌దే ఆమె ఆశ‌. ఏపీలో జ‌గ‌న్ భ‌జ‌న చేస్తూ.. తెలంగాణ‌లో బీజేపీ భ‌జ‌న చేస్తూ రాజ‌కీయం చేయాల‌ని వీరు ప్ర‌స్తుతానికి డిసైడ్ అయిన‌ట్టు ఉంది. మ‌రి రేప‌టికి ఈ భార్య భ‌ర్త‌లు ఏ పార్టీలో ఉంటారో ?




కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్!

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>