PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu5e436d58-184b-429e-9924-487b7d9daf91-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu5e436d58-184b-429e-9924-487b7d9daf91-415x250-IndiaHerald.jpgఅశేష భక్తజనం దర్శించే తిరుమల తిరుపతి కొలువైన తిరుపతి నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. వాటిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్షాలు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. విగ్రహాల ధ్వంసాలు అధికార వైసీపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ, జనసేన కూటమితో పాటు టీడీపీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.chandrababu naidu;kranthi;kranti;tiru;vishwa;makar sakranti;bharatiya janata party;janasena;sankranthi;tirupati;husband;lakshmi devi;tdp;janasena party;partyఇదే ఊపుతో తిరుపతి ఉప ఎన్నికలో గెలవాలిఇదే ఊపుతో తిరుపతి ఉప ఎన్నికలో గెలవాలిchandrababu naidu;kranthi;kranti;tiru;vishwa;makar sakranti;bharatiya janata party;janasena;sankranthi;tirupati;husband;lakshmi devi;tdp;janasena party;partyWed, 06 Jan 2021 11:28:57 GMTఅశేష భక్తజనం దర్శించే తిరుమల తిరుపతి కొలువైన తిరుపతి నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. వాటిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్షాలు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. విగ్రహాల ధ్వంసాలు అధికార వైసీపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ, జనసేన కూటమితో పాటు టీడీపీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా బీజేపీ.. ఈ పరిణామాలు తమకు రాజకీయంగా ఎంత కలిసొచ్చినా.. తమకు అదనపు బలమే అవుతుందనే భావనలో ఉంది.

                 తెలంగాణలో సత్తా చాటుతున్న కమలనాథులు ఆంధ్రాలోనూ పాగా వేయడానికి ఇదే అదునుగా చూస్తున్నాయి. రాష్ట్రంలో పరిణామాల కారణంగా బీజేపీ బలపడతుందేమోనని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రభావం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై ఉండకుండా ఉండేందుకు చంద్రబాబు ఇప్పటినుంచే చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిగా పనబాక లక్ష్మీ పేరును చంద్రబాబు ఇప్పటికే ఖరారు చేశారు. ఆమెను క్షేత్రస్థాయిలో పని చేసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ ఉప ఎన్నిక కోసం టీడీపీ సీనియర్ నేతల సేవలను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.


                                    తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేసేలా ఏకంగా 80 మంది సీనియర్ నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ నుంచే బలమైన పోటీ ఉండాలని.. తమ స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తున్న బీజేపీ, జనసేన కూటమికి ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దని టీడీపీ అధినేత గట్టి పట్టుదలగా ఉన్నారు. అలా జరగాలంటే పార్టీ నేతలంతా ఇప్పటి నుంచే తిరుపతి నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. విగ్రహాల ధ్వంసాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న క్రమంలోనే తిరుపతి స్థానాన్ని కైవసం చేసుకోవాలని చంద్రబాబు విశ్వాసంతో ఉన్నారు. సంక్రాంతి ముగిసిన వెంటనే కీలకమైన గ్రామాలు, మండలాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించాలని టీడీపీ అధినేత నిర్ణయించారని.. ఈ మేరకు పార్టీలోని పలువురు నేతలకు సమాచారం కూడా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.


డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ మార్పు.. అందరూ తప్పక తెలుసుకోండి..?

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>