PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/behind-the-disappearance-of-apara-kubera7eae1148-bbaa-4bbb-ad8e-35cc75a026b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/behind-the-disappearance-of-apara-kubera7eae1148-bbaa-4bbb-ad8e-35cc75a026b7-415x250-IndiaHerald.jpgచైనాకు చెందిన అపర కుబేరుడు జాక్ మా అదృశ్యమయ్యాడు. వ్యాపారవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడైన జాక్ మా రెండు నెలల నుంచి కనిపించడం లేదు. చైనా ప్రభుత్వంతో తలెత్తిన వివాదమే అతని అదృశ్యానికి కారణమని తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌ లో షాంఘైలో జరిగిన ఒక కార్యక్రమంలో చైనా ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలపై తీవ్ర విమర్శలు చేశారు జాక్ మా. అప్పటి నుంచి ఆయన వ్యాపారాలు నష్టపోతూనే ఉన్నాయి. ప్రముఖ టాలెంట్ షో ఆఫ్రికా బిజినెస్ హీరోస్ ఫైనల్లో జాక్ మా జడ్జిగా పాల్గొనాల్సి ఉంది. అయితే ఆ షో నిర్వాహకులు తయ వెబ్‌ సైట్‌ నుంచి జాక్ మాbehind the disappearance of apara kubera;business;sampada;hosta;rbi;government;king;october;king 1;banking;currency;corporate;beijingఅపర కుబేరుడు కనిపించకుండా పోవడం వెనుక..!అపర కుబేరుడు కనిపించకుండా పోవడం వెనుక..!behind the disappearance of apara kubera;business;sampada;hosta;rbi;government;king;october;king 1;banking;currency;corporate;beijingWed, 06 Jan 2021 21:30:00 GMT
ప్రముఖ టాలెంట్ షో ఆఫ్రికా బిజినెస్ హీరోస్ ఫైనల్లో జాక్ మా జడ్జిగా పాల్గొనాల్సి ఉంది. అయితే ఆ షో నిర్వాహకులు తయ వెబ్‌ సైట్‌ నుంచి జాక్ మా ఫొటోలను తొలగించారు. దీంతో జాక్ మా ఏ మయ్యారనేది మిస్టరీగా మారింది. ఏ విషయమైనా చాలా రహస్యంగా జరిగే చైనాలో... ప్రస్తుతం నడుతున్న అంతుచిక్కని పరిణామాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చైనా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తే వాళ్లలో జాక్ మా కూడా ఒకరు. ఈ క్రమంలోనే చైనా తీసుకొచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్కరణలపై జాక్ మా విమర్శలు చేశారు. ఆ సంస్కరణలు అవి వృద్ధ విధానాలని, వాటి వల్ల వివిధ వ్యాపార నష్టపోతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు జాక్ మా. జాక్ మా విమర్శలపై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అక్టోబర్ తర్వాత ఆయన వ్యాపారాలు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి.

యాంట్, అలీబాబా సంస్థల అధిపతిగా జాక్ మా... చైనాలో అత్యధిక సంపద గల వాళ్లలో రెండో స్థానంలో ఉన్నారు. చైనా ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసిన జాక్ మా... అక్కడి బ్యాంకింగ్  విధానాలపై మండిపడ్డారు. బ్యాంకుల్లో సంస్కరణలు తేవడం లేదని, బ్యాంకులను తాకట్టు దుకాణాల్లా నడుపుతున్నారని ఆరోపించారు. తర్వాత సీన్ మారిపోయింది. భారత కరెన్సీ ప్రకారం ఆయన సంస్థలు ఈ మధ్య కాలంలో 83వేల కోట్ల రూపాయలు నష్టపోయాయి. అలాగే జాక్‌ మా సంస్థ యాంట్ గ్రూప్‌ కు దక్కాల్సిన ఓ పబ్లిక్‌ ప్రాజెక్టును చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశాలతో నిలిపివేశారు బీజింగ్ అధికారులు.

జాక్ మా దాదాపు రెండు నెలలుగా కనిపించకుండా పోవడం కార్పొరేట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ముందే షెడ్యూలైన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకపోవటంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీని వెనుక చైనా ప్రభుత్వ హస్తం ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.




బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>