MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-act-of-killing-movie54872534-4593-4715-bad6-b53ad7bf0ea8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-act-of-killing-movie54872534-4593-4715-bad6-b53ad7bf0ea8-415x250-IndiaHerald.jpgఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా చరిత్ర ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. బయోపిక్ లు వచ్చాయి. అయితే తన బయోపిక్ లో తానే లీడ్ రోల్ లో నటించే హీరోలు, హీరోయిన్లు బహుశా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా గాని ఒక క్రిమినల్ బయోపిక్ లో క్రిమినల్ నటించడం అనేది ఇప్పటివరకూ లేదనే చెప్పాలి. the act of killing movie;jeevitha rajaseskhar;tiru;indonesia;pithe;korcha;cinema;hollywood;history;murder;director;october;murder.;v;oscar;criminalవెయ్యి మందిని చంపి.. తన పాత్రలో తానే నటించిన నర హంతకుడువెయ్యి మందిని చంపి.. తన పాత్రలో తానే నటించిన నర హంతకుడుthe act of killing movie;jeevitha rajaseskhar;tiru;indonesia;pithe;korcha;cinema;hollywood;history;murder;director;october;murder.;v;oscar;criminalWed, 06 Jan 2021 15:13:03 GMTచరిత్ర ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. బయోపిక్ లు వచ్చాయి. అయితే తన బయోపిక్ లో తానే లీడ్ రోల్ లో నటించే హీరోలు, హీరోయిన్లు బహుశా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా గాని ఒక క్రిమినల్ బయోపిక్ లో క్రిమినల్ నటించడం అనేది ఇప్పటివరకూ లేదనే చెప్పాలి. వెయ్యి మందిని చంపిన ఓ నర హంతకుడి జీవిత కథ ఆధారంగా సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఆ నర హంతకుడ్నే అతని పాత్రలో నటింపజేసే సాహసం చేయడం మరొక ఎత్తు. ఆ సాహసం చేసింది ఎవరో కాదు, డైరెక్టర్ జాషువా ఓపెన్హీమర్. "ది యాక్ట్ ఆఫ్ కిల్లింగ్" పేరుతో 2012 లో డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ డాక్యుమెంటరీలో నటించిన ఆ నర హంతకుడి పేరు "అన్వర్ కాంగో". 1965 నుంచి 1966 మధ్య కాలంలో ఇండోనేషియాలో జరిగిన "రాజకీయ ప్రక్షాళన" సమయంలో దాదాపు 5 లక్షల మందికి పైగా హత్యకు గురయ్యారు.

ఆ సమయంలో తమ అధికారానికి ఎదురుతిరుగుతున్నారనే నెపంతో నాటి ఇండోనేషియా సైన్యం రైట్ వింగ్ ఫారా మిలటరీ, నేరాలు చేసే ముఠాలతో కలిసి ఓ ప్రత్యేక దళాన్ని ఏర్పాటుచేసింది. అలా ఏర్పడిన వాటిలో ఫ్రాగ్ స్క్వాడ్ ఒకటి. ఈ ఫ్రాగ్ స్క్వాడ్ కు చెందిన వాడే ఈ అన్వర్ కాంగో. అప్పటికి ఉన్న దళాల్లో ఇతనిదే అత్యంత కిరాతకమైన హంతక ముఠా. ఈ ఊచకోతల్లో అన్వర్ కాంగో కీలకపాత్ర పోషించారు. కమ్యూనిస్టులను, అనుమానంగా తిరుగుతున్న వారిని చంపడమే అన్వర్ పని. అందులో భాగంగానే దాదాపు 1000 మందిని హత్య చేసినట్లు ఆ డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చాడు. ఎలా చంపాడు? అనేది డాక్యుమెంటరీలో చేసి చూపించాడు. గొంతుకు వైరు బిగించి, ఊపిరాడకుండా చేసి చంపడం తనకిష్టమైన పద్ధతి అని, కొట్టి చంపితే అనవసర గందరగోళం, శ్రమ ఎక్కువ, అందుకే ఈ పద్ధతిని ఎంచుకున్నాడట. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే, అతను చేసే హత్యలకు హాలీవుడ్ సినిమాల నుంచే ప్రేరణ పొందాడట. మాఫియా సినిమాల్లోని మర్డర్ సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుని ఆ రీతిలో హత్యలకు పాల్పడేవాడట.

మరి ఇన్ని హత్యలు చేసిన ఈ నర హంతకుడ్ని ప్రభుత్వం ఏమీ చేయలేదా అంటే ప్రభుత్వమే ఇదంతా చేయిస్తుంది, ఇక నన్నెవరు ఏం చేస్తారు అని అంటాడు. అయితే అన్వర్ పేరు వింటే జనాలు వణికిపోయేవారట. అలాంటి అన్వర్ లో తన మీద డాక్యుమెంటరీ తీస్తుండగా తాను చేసిన పాపాలకు పశ్చాత్తాప భావం మొదలైందట. ఒక సీన్ లో బాధితుడిగా నటిస్తున్నప్పుడు, తన మెడకు వైరు బిగించినప్పుడు ఊపిరాడక షూటింగ్ ఆపివేయమన్నాడు. ఓ మూలన కూర్చుని, ఇంత నరకంగా ఉంటుందా? నేను ఎంత పెద్ద తప్పులు చేశాను? చాలా పాపాలు చేశాను అంటూ కుమిలికుమిలి ఏడ్చాడట. ఆ తర్వాత డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యి ఆస్కార్ పురస్కారాలకు నామినేట్ అయ్యింది. ఇక అన్వర్ 2018 అక్టోబర్ 25 న మరణించాడు. అయితే ఈ డాక్యుమెంటరీ అక్కడ కమ్యూనిస్టులను సైనికులు చూసే విధానంపై ప్రభావం చూపించింది. అధికారికంగా అక్కడ నిషేధం ఉన్నా రహస్యంగా ప్రదర్శనలు జరిగాయి. తర్వాత బాధితుల కోణంలో 2015 లో "ద లుక్ ఆఫ్ సైలెన్స్" పేరుతో ఒక సినిమా వచ్చింది.




శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>