PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bird-fluf853b180-af73-4ba6-8b71-267398c350e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bird-fluf853b180-af73-4ba6-8b71-267398c350e6-415x250-IndiaHerald.jpgదేశం లో మనుషులకి వచ్చిన వైరస్ సరిపోదని ఇప్పుడు పక్షులను కూడా ఒక వైరస్ వెంటాడుతుంది .. కరోనా వైరస్ తో మనుషులు ఏవిధంగా మరణించారో ఇప్పుడు బర్డ్ ఫ్లూ తో పక్షులు పిట్టల్లా రాలుతున్నాయి .. రోజురోజుకి మరణాలు పెరగడంతో దేశం లో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తుంది .. దాంతో పాటు వేలాదిగా పక్షులు మృతి చెందుతున్నాయి .. ఇలా కొన్ని వేల సంఖ్యలో పక్షులు మరణించడంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తం అయ్యాయి .. బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా కేంద్రం కూడా అప్రమత్తం అయి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపిందిbird flu;manu;andhra pradesh;district;central government;coronavirusవేగంగా వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ .పిట్టల్లా రాలుతున్న పక్షులువేగంగా వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ .పిట్టల్లా రాలుతున్న పక్షులుbird flu;manu;andhra pradesh;district;central government;coronavirusWed, 06 Jan 2021 16:56:28 GMTకరోనా వైరస్ తో మనుషులు ఏవిధంగా మరణించారో ఇప్పుడు బర్డ్ ఫ్లూ తో పక్షులు పిట్టల్లా రాలుతున్నాయి .. రోజురోజుకి మరణాలు పెరగడంతో దేశం లో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తుంది .. దాంతో పాటు వేలాదిగా పక్షులు మృతి చెందుతున్నాయి .. ఇలా కొన్ని వేల సంఖ్యలో పక్షులు మరణించడంతో  రాష్ట్రాలన్నీ అప్రమత్తం అయ్యాయి .. బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా కేంద్రం కూడా అప్రమత్తం అయి  కొన్ని  జాగ్రత్తలు తీసుకోవాలని  తెలిపింది అంతేకాదు రాష్ట్రాలకి కేంద్రం తరుపు నుండి కొన్ని మార్గదర్శకాలను కూడా ప్రకటించింది ....  సాధారణంగా బర్డ్ ఫ్లూ సోకినా పక్షులలో   వణుకు, విరేచనాలు, తల వంపు, పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు ..  ఇక బర్డ్ ఫ్లూ నేపథ్యంలో జంతు ప్రదర్శనశాలల్లో ఉన్న  పక్షులను ఎప్పటికప్పుడు  పర్యవేక్షిస్తూ  ఉండాలని కేంద్రం  పేర్కొంది. ఎవరైనా  జంతువులు, పక్షులను తమ చేతిలోకి తీసుకునేటపుడు  రక్షణ కవచాలు ధరించాలని, అలాగే మీ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని  కేంద్రం ప్రజలకు  సూచించింది. బర్డ్ ఫ్లూ కి మందు లేదు కాబట్టి దీని నుండి బయటపడాలంటే ముందు జాగ్రత్త చర్యలే పాటించడం ముఖ్యం .. కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో కొన్ని రోజుల క్రితం పక్షులు మరణించడం అందరిని కలిచి వేసింది .. అవి చనిపోడానికి గల కారణం బర్డ్ ఫ్లూ అని తెలియడంతో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రమత్తం అయి పక్షుల పట్ల జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు .. ఇక దక్షిణాది లో   కేరళలో కూడా పక్షుల ఆలా చనిపోవడంతో పక్షుల కళేబరాలని గమనించగా బర్డ్ ఫ్లూ  అన్ని తేలింది .. బర్డ్ ఫ్లూ అనేది పక్షులకు సంక్రమించే వ్యాధి అయినప్పటికీ మనుషులకి కూడా హాని తలపెట్టగలదు .కాబట్టి జాగ్రత్తగా ఉండడం ముఖ్యం ..  మన దేశం లో పక్షుల సంఖ్య మనుషుల సంఖ్య కంటే  చాలా తక్కువ .. ఈ ఫ్లూ వల్ల పక్షుల  సంఖ్య ఇంకా తగ్గుతుంది ..  ఆలా జరగడం ప్రమాదకరం .. ఈ ఫ్లూ తొందరగా తగ్గిపోవాలని కోరుకుందాం .. తాజాగా బర్డ్ ఫ్లూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా కలవర పెడుతుంది .. రాష్ట్రం లోని గుంటూరు జిల్లా లో కొన్ని పక్షుల చనిపోవడం కలకలం రేపుతోంది .. దీనిపై రాష్ట్రం వెంటనే స్పందించి జాగ్రత్త చర్యలని తీసుకోవాలి ..


 


అఖిల ప్రియ అరెస్ట్ పై హైదరాబాద్ పోలీసుల కీలక ప్రకటన

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్

74 ఏళ్ళ చంద్రబాబు.. కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>