PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/girls7129b19f-2c44-4591-b566-2ad5dfdb2b8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/girls7129b19f-2c44-4591-b566-2ad5dfdb2b8f-415x250-IndiaHerald.jpgచాల మంది ఆడపిల్లను కనడానికి భయపడిపోతుంటారు. అయితే ఆడపిల్లల భవిష్యత్ కోసం పొదుపు చేయాలనుకునే వారికి సుకన్య సమృద్ది యోజన అద్భుతమైన పొదుపు పథకంగా ఉపయోగపడుతుంది. ఇక పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రారంభించిన ఈ పథకంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. మీ అమ్మాయి చదువుకు, వివాహానికి అవసరమయ్యే ఖర్చుకు ఇది ఆర్థిక భరోసానిస్తుంది దీనిలో పెట్టుబడిపై అధిక వడ్డీతో పాటు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అన్ని పోస్టల్ సేవింగ్స్ ఖాతాలతో పోలిస్తే ఎస్‌ఎస్‌ఏపై అధిక వడ్డీ లభిస్తుంది.girls;adah sharma;sukanya;poorna;january;girl;indian postal service;central government;marchఆడపిల్లల భవిష్యత్ కోసం అద్భుతమైన స్కీమ్..!?ఆడపిల్లల భవిష్యత్ కోసం అద్భుతమైన స్కీమ్..!?girls;adah sharma;sukanya;poorna;january;girl;indian postal service;central government;marchWed, 06 Jan 2021 08:00:00 GMTసుకన్య సమృద్ది యోజన అద్భుతమైన పొదుపు పథకంగా ఉపయోగపడుతుంది. ఇక పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రారంభించిన ఈ పథకంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. మీ అమ్మాయి చదువుకు, వివాహానికి అవసరమయ్యే ఖర్చుకు ఇది ఆర్థిక భరోసానిస్తుంది దీనిలో పెట్టుబడిపై అధిక వడ్డీతో పాటు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అన్ని పోస్టల్ సేవింగ్స్ ఖాతాలతో పోలిస్తే ఎస్‌ఎస్‌ఏపై అధిక వడ్డీ లభిస్తుంది.

ఇక ఈ పథకంపై 7.6% వడ్డీని అందిస్తుంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్లను పరిశీలిస్తే వీటిపై వరుసగా 7.1%, 7.4% వడ్డీ లభిస్తుంది. అయితే, సాధారణంగా ప్రతి మూడు నెలలకోసారి ఈ వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది ప్రభుత్వం. అయితే, 2021 జనవరి నుంచి -మార్చి మధ్య కాలంలో మాత్రం దీని వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులు చేయట్లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, సుకన్య సమృద్ధి యోజనపై అధిక వడ్డీ లభిస్తున్నప్పటికీ, పిల్లల కోసం ఆదా చేయడానికి ఇదొక్కటే ఉత్తమమైన పెట్టుబడి మార్గం కాదని నిపుణులు చెబుతున్నారు.

అయితే సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సహజంగా ఈ వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకొకసారి మారుస్తుంది. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి కనీస పెట్టుబడిగా రూ. 250, గరిష్టంగా రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. నిర్ణీత కాలంలో కనీస మొత్తాన్ని జమ చేయకపోతే, పోస్టాఫీసు ఆ అకౌంట్ ను "డిఫాల్ట్ అకౌంట్"గా పరిగణిస్తుంది. అయితే, డిఫాల్ట్ అయిన అకౌంట్లను అకౌంట్ ప్రారంభించిన తేదీ నుండి 15 సంవత్సరాలు పూర్తయ్యేలోపు పునరుద్ధరించుకోవచ్చు. మీ అమ్మాయికి 10 సంవత్సరాల కంటే తక్కువ వయసుంటేనే ఈ పథకంలో చేరే అవకాశం ఉంటుంది.

ఒక కుటుంబం గరిష్టంగా ఇద్దరు ఆడ పిల్లలకు మాత్రమే ఎస్ఎస్ఏ ఖాతా తెరవగలరు. ఇక అకౌంట్ విత్డ్రా విషయానికి వస్తే మీ అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా పదవ తరగతి పూర్తయిన తర్వాత పైచదువుల కోసం లేదా వివాహం కోసం డబ్బు తీసుకోవచ్చు. అంతేకాక, సుకన్య సమృద్ధి అకౌంట్ తెరిచిన 5 ఏళ్ల తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే దీని నుంచి ఎగ్జిట్ కావచ్చు. ఆ సమయంలో 50% ఫండ్స్ మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ గడువు 21 సంవత్సరాలు కనుక, పథకంలో ఎప్పుడు చేరినా సరే 21 ఏళ్ల తర్వాతే దీని ద్వారా సంపూర్ణ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.


టీడీపీ... బిజెపి పొత్తు ఫైనల్...?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>