BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/steaming-face8ff132cb-d6cb-496f-83b3-b8fcbeb75c97-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/steaming-face8ff132cb-d6cb-496f-83b3-b8fcbeb75c97-415x250-IndiaHerald.jpgముఖానికి అందాన్ని తెప్పించే ఫేషియల్ పద్ధతిలో స్టీమింగ్ కూడా ఒకటి. సాధారణంగా ముఖానికి క్లీనింగ్, మాయిశ్చరైజింగ్, స్టీమింగ్,క్లీన్సింగ్, ఫేస్ ప్యాక్ అంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిలో స్టీమింగ్ ముఖ్యమైనది. స్టీమింగ్ పద్ధతినే ముఖానికి ఆవిరి పట్టడం అని అంటారు. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంతో, దానిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల అంతే స్థాయిలో దుష్పరిణామాలు కలుగుతాయని కాస్మెటిక్ నిపుణులు సూచిస్తున్నారు. స్టీమింగ్ వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు దుష్పరిణామాలు ఏంటో ఇప్పుడు చదివి తెలుసుకుందాం.steaming,face;aaviri;manamస్టీమింగ్ ను ఎక్కువగా వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!స్టీమింగ్ ను ఎక్కువగా వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!steaming,face;aaviri;manamWed, 06 Jan 2021 13:46:13 GMTముఖానికి అందాన్ని తెప్పించే ఫేషియల్ పద్ధతిలో స్టీమింగ్ కూడా ఒకటి. సాధారణంగా ముఖానికి క్లీనింగ్,  మాయిశ్చరైజింగ్, స్టీమింగ్,క్లీన్సింగ్, ఫేస్ ప్యాక్ అంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిలో స్టీమింగ్ ముఖ్యమైనది. స్టీమింగ్ పద్ధతినే ముఖానికి ఆవిరి పట్టడం అని అంటారు. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంతో, దానిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల అంతే స్థాయిలో దుష్పరిణామాలు కలుగుతాయని కాస్మెటిక్ నిపుణులు సూచిస్తున్నారు. స్టీమింగ్ వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు దుష్పరిణామాలు ఏంటో ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

ముఖానికి ఆవిరి పట్టించడం వంటివి చేయడం వల్ల చర్మం శుభ్రపడటంతోపాటు,చర్మంలోని రంధ్రాలు తెరచుకొని ముఖం పై ఉన్న మలినాలను,అందులో ముఖ్యంగా బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ ను తొలగించడానికి ఎంతో సహాయపడుతుంది. ముఖానికి మొటిమలు వాటి వల్ల ఏర్పడే మచ్చలు కూడా తొలగించడానికి స్టీమింగ్ ఒక మంచి పద్ధతి అని చెప్పవచ్చు. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు కలుగుతాయని  మనందరికీ తెలిసిందే.అయితే దీనివల్ల ముఖం నిర్జీవంగా మారడంతోపాటు మానసికంగా మనలో ఒత్తిడిని పెంచుతాయి.అలాంటి సమయంలో స్టీమింగ్ బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు.

ముఖానికి ఆవిరి పట్టడం లాంటివి చేయడం వల్ల ముఖంలోని రంధ్రాలు  ఓపెన్ అయి,అందులో ఉన్న దుమ్ము,ధూళి బయటకు వచ్చేస్తాయి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. ఫేస్ స్టీమింగ్ వల్ల ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది. ఆవిరి తీసుకున్న తర్వాత ముఖాన్ని గట్టిగా తుడవడం లాంటి పనులు చేయకూడదు.కేవలం కాటన్ వస్త్రాన్ని తీసుకొని మెత్తగా  ముఖం మీద ఆవిరిని అద్దితే సరిపోతుంది.

ఆవిరి తీసుకునే సమయం కూడా ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ సేపు ఆవిరి పట్టడం వల్ల చర్మంలోని సహజసిద్ధంగా ఉండే నూనెను స్రవించే గ్రంధులు పొడిబారిపోయి, ముఖం కమిలిపోతుంది. దీని వల్ల ముఖం పై ముడతలు వచ్చే అవకాశం ఎక్కువ. ముఖానికి ఆవిరి పట్టిన తర్వాత బాగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఒకవేళ ముఖం పొడిబారినట్లుగా అనిపిస్తే మాయిశ్చరైజర్ ను వాడితే సరిపోతుంది. మన చర్మతత్వాన్ని బట్టి ఫేషియల్ స్టీమింగ్  పద్ధతులను ఎంచుకుంటే అందమైన ప్రకాశవంతమైన ముఖం మన సొంతం.




ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఉపఎన్నికకు రంగం సిద్ధం.... 28న పోలింగ్

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>