PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr1803770b-6402-408a-a232-528ab5b62c10-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr1803770b-6402-408a-a232-528ab5b62c10-415x250-IndiaHerald.jpgజపాన్‌లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఏప్రిల్ 5 నుంచి 7 వరకు జపాన్‌ రాజధాని టోక్యోలో నిర్వహించనున్న ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ – 2021 సదస్సుకు హాజరుకావాల్సిందిగా… వరల్డ్‌ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గ్ బ్రెండే కేటీఆర్‌కు లేఖ రాశారు.వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు, మంత్రులు, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు ఈ సదస్సులో భాగస్వాములు కానున్నారు.ktr;technology;ktr;vedhika;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;telangana;government;capital;minister;letter;european union;international;custard apple;mantraకేటీఆర్ కు అరుదయిన గౌరవం ...!?కేటీఆర్ కు అరుదయిన గౌరవం ...!?ktr;technology;ktr;vedhika;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;telangana;government;capital;minister;letter;european union;international;custard apple;mantraWed, 06 Jan 2021 13:03:16 GMTజపాన్‌లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఏప్రిల్ 5 నుంచి 7 వరకు జపాన్‌ రాజధాని టోక్యోలో నిర్వహించనున్న ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ – 2021 సదస్సుకు హాజరుకావాల్సిందిగా… వరల్డ్‌ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గ్ బ్రెండే కేటీఆర్‌కు లేఖ రాశారు.వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు, మంత్రులు, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు ఈ సదస్సులో భాగస్వాములు కానున్నారు.

కోవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి తిరిగి వృద్ధి బాట పట్టేందుకు 'ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగం' అనే అంశంపై ఈ సదస్సు జరగనుంది. ఈ నూతన టెక్నాలజీల వినియోగం ద్వారా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాల బలోపేతంతో పాటు అందులో ఎదురయ్యే సవాళ్లు,వాటి పరిష్కార మార్గాలపై సదస్సులో చర్చించనున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్, జీ-20 స్మార్ట్ సిటీస్ అలయన్స్ వంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేపట్టిన కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చినందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్గ్ బ్రండే ధన్యవాదాలు తెలిపారు.భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బోర్గ్ బ్రండే ఆ లేఖలో పేర్కొన్నారు



గతేడాది స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధిపతులు, వివిధ దేశాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. దాదాపు 50కిపైగా సమావేశాలతోపాటు ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన 5 చర్చా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సామాజిక ప్రయోజనాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో కేటీఆర్ నాయకత్వం వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టిందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రాసిన లేఖలో ఆయనపై ప్రశంసలు కురిపించింది.ఈ పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీల అధిపతులు, వివిధ దేశాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర విధానాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి కేటీఆర్‌ వివరించారు. గ్లోబల్‌ టెక్నాలజీ గవర్నెన్స్‌ సదస్సుకు మంత్రి కేటీఆర్‌ వెళ్లడం ద్వారా తెలంగాణకు ప్రపంచ వేదికపై మరోసారి గుర్తింపు దక్కనుంది. 


కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్!

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>