PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kings44d99aea-612a-428f-a5b3-b21d1480780b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kings44d99aea-612a-428f-a5b3-b21d1480780b-415x250-IndiaHerald.jpgటీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీగా వైయస్సార్ తాడిగడప ప్రకటించింది అని, ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా ఎందుకు వై.యస్.ఆర్ తాడిగడప మున్సిపాలిటీ అని ప్రకటించారు అని ఆయన నిలదీశారు. ఈ పేరును బహిరంగంగా ప్రకటించే ధైర్యం ఉందా అని నిలదీశారు. వై యస్.ఆర్ రాజశేఖర్ రెడ్డి కడపలో పుడితే ఎన్టీఆర్ పుట్టిన కృష్ణా జిల్లాకి వై.యస్.ఆర్ పేరు ఎలా పెడతారు? అని నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేడు స్ధంబించాయి అని అన్నారు. ఎన్టycp;ntr;ganga;dr rajasekhar;prasad;ganges;krishna river;y. s. rajasekhara reddy;telugu;chief minister;mla;tdp;ycp;nandamuri taraka rama rao;reddy;partyబెజవాడలో వైసీపీ కొత్త పంచాయితీబెజవాడలో వైసీపీ కొత్త పంచాయితీycp;ntr;ganga;dr rajasekhar;prasad;ganges;krishna river;y. s. rajasekhara reddy;telugu;chief minister;mla;tdp;ycp;nandamuri taraka rama rao;reddy;partyWed, 06 Jan 2021 21:15:00 GMTటీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీగా వైయస్సార్ తాడిగడప ప్రకటించింది అని, ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా ఎందుకు వై.యస్.ఆర్ తాడిగడప మున్సిపాలిటీ అని ప్రకటించారు అని ఆయన నిలదీశారు. ఈ పేరును బహిరంగంగా ప్రకటించే ధైర్యం ఉందా అని నిలదీశారు. వై యస్.ఆర్ రాజశేఖర్ రెడ్డి  కడపలో పుడితే ఎన్టీఆర్ పుట్టిన కృష్ణా జిల్లాకి వై.యస్.ఆర్ పేరు ఎలా పెడతారు? అని నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేడు స్ధంబించాయి అని అన్నారు.

ఎన్టీఆర్ సిర్కిల్ నుండి కానూరు వరకు పంటకాలవ రోడ్డును అభివృద్ధి చేసింది టీడీపీ పార్టీ అని ఆయన అన్నారు. మహానాడు రోడ్డు నుండి కానూరు వరకు పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ప్రభుత్వం మారింది అని అన్నారు. మీరు వచ్చిన సం.న్నరా కాలంలో ఏమి చేశారో చెప్పగలరా అని నిలదీశారు. వై.యస్.ఆర్ తాడిగడప అని పేరు మార్చితే ప్రజలు తిరగబడతారు అని ఆయన అన్నారు. ప్రజలు నుండి పన్నులు వసూలు చేసేందుకు మాత్రమే వై.యస్.ఆర్ తాడిగడప మున్సిపాలిటీగా ప్రకటిస్తున్నారు అని విమర్శించారు.

ఇలా అయితే ప్రజలు ఊరుకునే ప్రసక్తి లేదు అని హెచ్చరించారు. రాష్ట్రంలో అతిపెద్ద అవినీతిపరుడు ఎవరు అయినా ఉన్నారంటే మొదట వరుసలో ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారు అని, ఇళ్ల స్థలాలు విషయంలో 60 కోట్లు అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. లే ఔట్ లకు మెరకు పేరుతో మరో 150 కోట్లు అవినీతికి పాల్పడ్డారు అని విమర్శించారు.  ఇవి కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం వై.యస్.ఆర్ తాడిగడప అని తెరపైకి తీసుకొచ్చారు అని విమర్శించారు. మైనార్టీ నాయకులు ఇబ్రహీం మాట్లాడుతూ... వై.యస్.ఆర్ కుటుంబము ఇక్కడ ఏమైనా పుట్టిందా వై.యస్.ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పెడతానికి పెడితే ఎన్టీఆర్ తాడిగడప పెట్టాలని లేనిపక్షంలో తాడిగడపగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.


ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ.. ధర తెలిస్తే షాక్ కావాల్సిందే..!

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>