Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl567e2eb8-3300-4a73-9ac8-d2166f89763e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl567e2eb8-3300-4a73-9ac8-d2166f89763e-415x250-IndiaHerald.jpgఐండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఇకముందు మరింత వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఉన్న 8 జట్లతో పాటు 2022 నుంచి మరో రెండు కొత్త జట్లనూ చేర్చేందుకు ఇటీవలే బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) నిర్ణయించింది. అయితే కొత్త జట్లు ఏవి..? వాటి ఫ్రాంచైజీగా ఎవరు ఉండబోతున్నారు..? అనే విషయాలు మాత్రం ఇప్పటికీ...ipl;varsha;cricket;india;australia;media;bcci;letter;vఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ.. ధర తెలిస్తే షాక్ కావాల్సిందే..!ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ.. ధర తెలిస్తే షాక్ కావాల్సిందే..!ipl;varsha;cricket;india;australia;media;bcci;letter;vWed, 06 Jan 2021 21:38:24 GMTఇంటర్నెట్‌ డెస్క్‌: ఐండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఇకముందు మరింత వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఉన్న 8 జట్లతో పాటు 2022 నుంచి మరో రెండు కొత్త జట్లనూ చేర్చేందుకు ఇటీవలే బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) నిర్ణయించింది. అయితే కొత్త జట్లు ఏవి..? వాటి ఫ్రాంచైజీగా ఎవరు ఉండబోతున్నారు..? అనే విషయాలు మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. కానీ ఇప్పుడు దీనికి సబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే కొత్త జట్ల కనీస ధర.

గతేడాది డిసెంబర్లో జరిగిన బీసీసీఐ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీల గురించి సభ్యులు చర్చ జరిగింది. అయితే ఆ సమావేశంలో పాల్గొన్న ఓ బీసీసీఐ సభ్యుడు చెబుతున్న దాని ప్రకారం.. ఒక్కో ఫ్రాంచైజీ కనీస ధర రూ.1500-1600 కోట్లు ఉంటుందట. ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ, మిగిలిన ఫ్రాంచైజీల పెరిగిన విలువను పరిగణనలోకి తీసుకుంటే ఇది తక్కువ మొత్తమేనని బీసీసీఐ భావిస్తోందట. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ జట్లకు టెండర్లు కూడా ఆహ్వానిస్తారట. 2018లో దిల్లీ క్యాపిటల్స్‌లో కేవలం 50% వాటానే జేఎస్‌డబ్ల్యూ రూ.1100 కోట్లకు కొనుగోలు చేసిందని, ఏటా ఫ్రాంచైజీల విలువ పెరుగుతోందని, త్వరలో నిర్వహించే మీడియా హక్కుల టెండర్‌ ఆ విలువను మరింత పెంచుతుందని ఆ అధికారి చెబుతున్నాడు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే కొత్త టెండర్ల కనీస ధరను నిర్ణయించనున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే ప్రపంచ దేశాల్లోనే ధనిక క్రికెట్ బోర్డు భారత్‌ది. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ), ఇంగ్లాండ్‌కు చెందిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ)ల కంటే మన బీసీసీఐ అత్యంత ధనికమైన క్రికెట్ బోర్డు. అయితే క్రికెట్ బోర్డులోనే కాదు... క్రికెట్ లీగ్‌లలోనూ మనమే టాప్. ముఖ్యంగా ఐపీఎల్ విషయానికొస్తే.. ఈ టోర్నీ బీసీసీఐతో పాటు ఆటగాళ్లకు కూడా కాలుల వర్షం కురిపిస్తుంది. కోట్ల మంది ప్రజలకు ఇదో అద్భుతమైన వినోదపు విందు. ఈ టోర్నీ కోసం వివిధ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తాయి. అదే ఇప్పుడు కొత్త ఫ్రాంచైజీల విషయంలో బీసీసీఐని ముందుకు నడిపిస్తోందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందొో వేచి చూడాలి.


కేసీఆర్ ప్లాన్ వల్ల మళ్ళీ గ్రేటర్ ఎలక్షన్స్ వస్తాయా..?

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>