Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/movies/movies_actors/circle-inspector-father-selutes-daughter-who-became-district-superintendent-of-police-c11c4f5d-0c48-4ad4-8c80-69976c5f36dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/movies/movies_actors/circle-inspector-father-selutes-daughter-who-became-district-superintendent-of-police-c11c4f5d-0c48-4ad4-8c80-69976c5f36dd-415x250-IndiaHerald.jpgతల్లితండ్రులు ఎప్పుడూ తమ పిల్లలు తమకంటే ఓ మెట్టు పైనే ఉండాలనుకుంటారు. ఆ తండ్రి కూడా అలానే అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సీఐగా పనిచేస్తున్న శ్యాంసుందర్.. తన కెమార్తె జెస్సీ ప్రశాంతిని కష్టపడి చదివించారు. పోలీసును చేశారు. ఆమె కూడా తండ్రి మాటకు కట్టుబడి గొప్పగా చదువుకుని..chiranjeevi;chiranjeevi;prasanthini;prashanthi;sundar;andhra pradesh;police;media;twitter;traffic police;fatherకూతురు డీఎస్పీ.. తండ్రి సీఐ.. సెల్యూట్ ఫోటోపై చిరంజీవి సూపర్ ట్వీట్కూతురు డీఎస్పీ.. తండ్రి సీఐ.. సెల్యూట్ ఫోటోపై చిరంజీవి సూపర్ ట్వీట్chiranjeevi;chiranjeevi;prasanthini;prashanthi;sundar;andhra pradesh;police;media;twitter;traffic police;fatherWed, 06 Jan 2021 10:32:00 GMTఇంటర్నెట్ డెస్క్: తల్లితండ్రులు ఎప్పుడూ తమ పిల్లలు తమకంటే ఓ మెట్టు పైనే ఉండాలనుకుంటారు. ఆ తండ్రి కూడా అలానే అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సీఐగా పనిచేస్తున్న శ్యాంసుందర్.. తన కెమార్తె జెస్సీ ప్రశాంతిని కష్టపడి చదివించారు. పోలీసును చేశారు. ఆమె కూడా తండ్రి మాటకు కట్టుబడి గొప్పగా చదువుకుని ఆయన కలను నిజం చేశారు ప్రశాంతి. ఏకంగా డీఎస్పీ అయ్యారు. తనకంటే పై ఉద్యోగం సాధించి వచ్చిన కూతురికి తండ్రి శ్యాంసుందర్ గర్వంగా, గౌరవంగా సెల్యూట్ చేశారు. వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పుడు అదే ఫోటోను మెగాస్టార్ చిరంజీవి కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. తండ్రీ, కూతుళ్లపై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు.

మెగాస్టార్ చిరంజీవి సాధారణంగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సెటైర్లు, పంచ్‌లే కాకుండా.. మంచి ఎక్కడున్నా, గొప్ప పని ఎవరు చేసినా ముందుగా ప్రశంసిస్తుంటారు. తనకు తెలిసిన ప్రతి మంచి పనినీ అభిమానులతో పంచుకుంటుంటారు. ఏపీకి చెందిన శ్యాంసుందర్, ప్రశాంతిల విషయం తెలిసి వారి ఫొటోను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

అంతేకాదు ఆ ఫోటోకు ‘ఈ ఫోటోలో ఉంది తండ్రి-కూతురు.. తండ్రి సీఐ శ్యాం సుందర్ గారు.. కూతురు డీఎస్పీ జెస్సీ ప్రశాంతి.. తన గుండెలమీద ఎత్తుకుని పెంచిన బిడ్డ,తనపై అధికారిగా వచ్చినప్పుడు ఆ తండ్రి చేసిన సెల్యూట్లో బోల్డంత సంతృప్తిని,గర్వాన్ని,ప్రేమని చూసాను. శ్యాం సుందర్ గారు.. నేను మీకు సెల్యూట్ చేస్తున్నాను...మీ ఇద్దరు ఇంకెందరికో స్ఫూర్తి’ అంటూ ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు.

ఇదిలా ఉంటే చిరంజీవి ఇంతకు ముందు కూడా ఇలాంటి అనేక విషయాలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. విధి నిర్వహణకు ఎంతో నిబద్ధతతో నిర్వహించే మరికొందరి గురించీ గతంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ పోస్ట్ మ్యాన్, ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ ఇలాం మరెంతో మందిని అభినందిస్తూ ఆయన మెసేజ్‌లు షేర్ చేశారు. ఆయన షేర్ చేసిన ప్రతి పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యాయి. మరి ఇప్పుడు ఈ పోలీసు తండ్రి, కూతుళ్ల ఫొటోలను కూడా చిరంజీవి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

" style="height: 760px;">




నిజమైన రాబందుల తో పొడిపించుకున్న వెంకటేష్..అందుకే కదా మీరు విక్టరీ వెంకటేష్

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్

74 ఏళ్ళ చంద్రబాబు.. కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>