MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywood-producers-unit37f73e93-dd69-45da-b7e5-1937900aae1a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywood-producers-unit37f73e93-dd69-45da-b7e5-1937900aae1a-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లలో సీటింగ్‌ సామర్థ్యాన్ని 100 శాతానికి పెంచడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు తెలుగు సినిమా నిర్మాతల మండలి లేఖ రాసింది. తమిళనాడు తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ 100 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమాల ప్రదర్శన నిర్వహణకు అనుమతులు ఇవ్వాలంటూ లేఖలో పేర్కొన్నారు.tollywood producers unit;ram gopal varma;kranthi;kranti;ram pothineni;ravi teja;makar sakranti;andhra pradesh;telangana;tollywood;industries;cinema;sankranthi;cinema theater;kollywood;jaggery;letter;central government;reddy;kavuru srinivasతెలుగు నిర్మాతల ఆశలు తీరేనా...?తెలుగు నిర్మాతల ఆశలు తీరేనా...?tollywood producers unit;ram gopal varma;kranthi;kranti;ram pothineni;ravi teja;makar sakranti;andhra pradesh;telangana;tollywood;industries;cinema;sankranthi;cinema theater;kollywood;jaggery;letter;central government;reddy;kavuru srinivasWed, 06 Jan 2021 12:00:00 GMTకోలీవుడ్ బాటలో నడుస్తున్న టాలీవుడ్. తెలుగు రాష్ట్రాలలోని థియేటర్ లలో సీటింగ్ సామర్ధ్యం 50 శాతం నుండి వంద శాతానికి పెంచాలంటూ... ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలకు వచ్చిన లేఖ. కరోనా కష్ట సమయంలో వివిధ రకాల పరిశ్రమల తో పాటు సినీ పరిశ్రమ కూడా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే కరోనా వ్యాప్తి తగ్గు ముఖం పట్టింది. దేశమంతటా అన్ లాక్ డౌన్ విధానాలు మొదలయ్యాయి. కేంద్రం  సూచించడంతో థియేటర్లు మాత్రం 50 శాతం సీటింగ్ కే పరిమితమయ్యాయి... దీంతో కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.

 అయితే తిరిగి థియేటర్లు లాభాలు  గడించి సినీ పరిశ్రమ ఓ కొలిక్కి రావాలంటే సినిమా హాలు 50 శాతం నుండి 100 శాతానికి పెంచాలని కోలీవుడ్ సినీ ప్రముఖులు ప్రభుత్వాన్ని కోరగా తమిళనాడు ప్రభుత్వం అందుకు అంగీకరించి అనుమతులు ఇచ్చింది. ఇటు తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇదే చర్చ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లలో సీటింగ్‌ సామర్థ్యాన్ని 100 శాతానికి పెంచడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు తెలుగు సినిమా నిర్మాతల మండలి లేఖ రాసింది. తమిళనాడు తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ 100 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమాల ప్రదర్శన నిర్వహణకు అనుమతులు ఇవ్వాలంటూ లేఖలో పేర్కొన్నారు.

ఇలా చేయడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమ తిరిగి పూర్వవైభవాన్ని పొందేందుకు పెద్ద సమయం పట్టదు అని అభిప్రాయపడుతున్నారు. మరి ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాయో వేచి చూడాలి. ఇక సంక్రాంతి బరిలోకి దిగేందుకు....దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ‘జాంబి రెడ్డి’,
రవితేజ ‘క్రాక్‌’, రామ్‌ ‘రెడ్‌’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ‘అల్లుడు అదుర్స్‌’, విజయ్‌ ‘మాస్టర్‌’ (డబ్బింగ్‌),  ‘క్రేజీ అంకుల్స్‌’ సినిమాలు రెడీగా ఉన్నాయి. అయితే నిర్మాతలు ప్రభుత్వాలపై పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది చూడాలి. 


టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>