Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/marriage8df01f36-1dc5-4d64-bbd4-be0cc162a90b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/marriage8df01f36-1dc5-4d64-bbd4-be0cc162a90b-415x250-IndiaHerald.jpgతెలుగులో ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘శుభలగ్నం’ సినిమా అందరికీ గుర్తుంది కదా..! ఆ సినిమాలో ఆమనికి డబ్బంటే చాలా ఇష్టం. కానీ భర్త జగపతిబాబు నీతిగా సంపాదించే సంపాదన ఆమెకు నచ్చేది కాదు. దీంతో ఎలాగైనా త్వరగా కోటీశ్వరురాలు అయిపోవాలని అనుకుంటుంది. అంతలో ఆమెకు రోజా కనిపిస్తుంది. ‘నీ భర్తను నాకు అమ్మేస్తావా..?’ అని అడుగుతుంది. కోటి రూపాయలు ఇచ్చేందుకు..marriage;women;koti;tiru;krishna river;roja;madhya pradesh - bhopal;cinema;telugu;police;sv museum;capital;court;love;husband;wife;woman;father;nijam;bhopal;reddy;love story;aamaniరూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య.. ‘శుభలగ్నం’ స్టోరీ రిపీట్!రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య.. ‘శుభలగ్నం’ స్టోరీ రిపీట్!marriage;women;koti;tiru;krishna river;roja;madhya pradesh - bhopal;cinema;telugu;police;sv museum;capital;court;love;husband;wife;woman;father;nijam;bhopal;reddy;love story;aamaniTue, 05 Jan 2021 12:56:17 GMTభోపాల్: తెలుగులో ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘శుభలగ్నం’ సినిమా అందరికీ గుర్తుంది కదా..! ఆ సినిమాలో ఆమనికి డబ్బంటే చాలా ఇష్టం. కానీ భర్త జగపతిబాబు నీతిగా సంపాదించే సంపాదన ఆమెకు నచ్చేది కాదు. దీంతో ఎలాగైనా త్వరగా కోటీశ్వరురాలు అయిపోవాలని అనుకుంటుంది. అంతలో ఆమెకు రోజా కనిపిస్తుంది. ‘నీ భర్తను నాకు అమ్మేస్తావా..?’ అని అడుగుతుంది. కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. అంతే ఆమని వెంటనే ఓకే చెప్పేసి ఆ కోటి రూపాయలు తీసేసుకుని భర్తను రోజాకు అప్పగించేస్తుంది. సరిగ్గా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు అన్ని వస్తువుల ధరలూ బాగా పెరిగిపోయాయి కదా.. అందుకే భర్త ధర కూడా పెరిగింది. కోటి నుంచి రూ.1.5 కోట్లకు పెరిగింది.

భోపాల్‌లో చోటు చేసుకున్న ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లే ఇద్దరు పిల్లలున్న ఓ వ్యక్తిపై అతడి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రి ఆఫీస్‌లో పనిచేసే ఓ మహిళతో కలిసి తిరుగుతూ అమ్మను బాధపెడుతున్నాడని, తరచూ ఇద్దరూ గొడవపడుతున్నారని, దాని వల్ల తనతో పాటు తన చెల్లెలి చదువు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసు భోపాల్ ఫ్యామిలీ కోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో ఆ బాలిక తల్లిదండ్రులను కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా అతడికి వేరొక మహిళతో నిజంగానే సంబంధం ఉన్నట్లు తేలింది. అంతేకాదు తనకు తన భార్య కంటే ఆ మహిళ అంటేనే ఇష్టమని, ఆమెతోనే ఉంటానని చెప్పాడు. దీంతో షాకైన భార్య అందుకు ఒప్పుకోలేదు. కానీ చివరకు ఓ షరతుపై అంగీకరించింది.

సమస్య పరిష్కారించేందుకు అధికారులు అనేకసార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. చివరకు కొన్ని షరతులను పెట్టిన భార్య.. వాటిని అతడు పాటిస్తేనే తాను, తన పిల్లలు అతడిని విడిచి వెళ్లిపోతామని చెప్పింది.  పెళ్లయి ఇన్ని సంవత్సరాల తరువాత తన భర్త ఇలా చేయడం తనకు నచ్చలేదని అన్నారు. అయితే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నానని, అందువల్ల తాను భర్తను వదిలి వెళ్లిపోవాలంటే ఒక ఖరీదైన ఫ్లాట్‌తో పాటు రూ. 27 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అప్పుడే తన భర్తను ఆమెకు అప్పగిస్తారని తేల్చి చెప్పింది. విశేషం ఏంటంటే ఈ షరతులకు భర్త ప్రియురాలు ఒప్పేసుకుంది కూడా. వీటి మొత్తం ఖరీదు దాదాపు రూ.1.5 కోట్ల ఉంటుంది. అంటే తన భర్తను రూ.1.5 కోట్లకు ఆమె విక్రయించేసింది. అదండీ మధ్యప్రదేశ్ ‘శుభలగ్నం’ స్టోరీ. 


ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్‌...!

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>