PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/what-devineni-speak-about-jagans-courage-on-cabinet-meetinge1de4dfc-7e47-44f3-84a8-6dbae412bbd8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/what-devineni-speak-about-jagans-courage-on-cabinet-meetinge1de4dfc-7e47-44f3-84a8-6dbae412bbd8-415x250-IndiaHerald.jpgఇటీవలే పవన్ కళ్యాణ్ మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరువకముందే తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడలో పేకాట ఆడుతూ మంత్రి కొడాలి నాని అనుచరులు పట్టుపడటం తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంపై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్‌మాన్, భరత్ అనే నేను సినిమాలు చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. devineni uma;pawan;mahesh;nani;bharath;kalyan;kodali nani;kranthi;kranti;murali;makar sakranti;telugu desam party;krishna river;jagan;andhra pradesh;devineni avinash;sri bharath;district;telugu;rajani kanth;sankranthi;court;chief minister;minister;krishna district;tdp;tadepalli;devineni uma maheswara rao;reddy;partyసీఎం జగన్.... మహేష్ బాబు సినిమాల తరహాలో పాలన చేస్తున్నారు - దేవినేని ఉమసీఎం జగన్.... మహేష్ బాబు సినిమాల తరహాలో పాలన చేస్తున్నారు - దేవినేని ఉమdevineni uma;pawan;mahesh;nani;bharath;kalyan;kodali nani;kranthi;kranti;murali;makar sakranti;telugu desam party;krishna river;jagan;andhra pradesh;devineni avinash;sri bharath;district;telugu;rajani kanth;sankranthi;court;chief minister;minister;krishna district;tdp;tadepalli;devineni uma maheswara rao;reddy;partyTue, 05 Jan 2021 05:00:00 GMTఇటీవలే పవన్ కళ్యాణ్ మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరువకముందే తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడలో పేకాట ఆడుతూ మంత్రి కొడాలి నాని అనుచరులు పట్టుపడటం తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంపై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్‌మాన్, భరత్ అనే నేను సినిమాలు చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘‘భరత్ అనే నేను సినిమాలో మాదిరిగా ‘జగన్ అనే నేను’ అని ప్రమాణం చేశావు కదా.. దమ్ము, ధైర్యం ఉంటే ఇప్పుడు పేకాట రాయుడ్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు’’ అంటూ

దేవినేని ఉమా అన్నారు.



అలాగే సీఎం జగన్ గత ఏడాది సంక్రాంతి సంబరాలకు గుడివాడకు వచ్చి పేకాట శిబిరాలను ప్రోత్సహించారని మంత్రి ఉమా ఆరోపించారు. గత 19 నెలలుగా మంత్రి కొడాలి నాని, అతని అనుచరుడు దొండపాడు పీఏసీఎస్ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటే యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతోనే ఒక బాధ్యత గల మంత్రి ఈ రకంగా బూతులు మాట్లాడుతూ యంత్రాంగాన్ని భయపట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం రాత్రి కోట్ల రూపాయలు డబ్బులు దొరికి వాహనాలు సీజ్ అయితే ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు? నిందితులను కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదని దేవినేని ఉమా ప్రశ్నించారు. రూ. 42 లక్షలు దొరికాయని డీఎస్పీ, రూ. 55 లక్షలు దొరికాయని ఎస్పీ చెప్తున్నారని.. ప్రజలేమో రూ. 10 కోట్లు దొరికాయని చెప్తున్నారని పేర్కొన్నారు. మిషన్లతో లెక్కించిన గోనె సంచుల్లో పట్టబడ్డ డబ్బులన్నీ తాడేపల్లి రాజప్రసాదానికి వెళ్లాయా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి, మంత్రి కొడాలి నానికి వాటాల్లో తేడాలు రావడం వల్లే పేకాట శిబిరాలు బయటకు వచ్చాయని తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలను తిడితేనో, తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకుంటేనో మీ పాపాలు పోవని, మంత్రి పేకాట శిబిరాలతో వేలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయని మండిపడ్డారు. గడ్డం గ్యాంగ్ పేకాట డెన్‌లో ఒక రోజు టర్నోవర్ రూ. 20 కోట్ల పైనే ఉంటుందని, పట్టుబడ్డ ఈ మొత్తాన్ని కోర్టులో స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మంత్రి, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి, కొడాలి నానిని బర్తరఫ్ చేసి, సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలని కోరారు.


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ యువ ఎమ్మెల్యేకు కేబినెట్ బెర్త్ ఫిక్స్...?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>