SportsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rohita3839c6f-604d-4204-bc0e-73bfe6795475-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rohita3839c6f-604d-4204-bc0e-73bfe6795475-415x250-IndiaHerald.jpgబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు ముందు రోహిత్ శర్మ జట్టులో చేరడం పట్ల వీవీఎస్‌ లక్ష్మణ్‌ స్పందించాడు. రోహిత్ శర్మ సెంచరీతో రీఎంట్రీ ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మూడో టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని అభిప్రాయపడ్డాడు. హిట్ మ్యాన్ బ్యాటింగ్ స్టైల్‌కు ఆసీస్ పిచ్‌లు ఎంతో అనువుగా ఉంటాయని... రోహిత్ కొత్త బంతిని సమర్థవంతంగా ఎదుర్కొంటే శతకం ఖాయమని జోస్యం చెప్పాడు.rohit;pruthvi;rahul new;rahul;rohit;virat kohli;k l rahul;umesh yadav;rohit sharma;india;australia;rahul sipligunj;yuva;international;father;prithvi shaw;mohammed shami;mayank agarwalమూడో టెస్టులో రోహిత్ సెంచరీ పక్కామూడో టెస్టులో రోహిత్ సెంచరీ పక్కాrohit;pruthvi;rahul new;rahul;rohit;virat kohli;k l rahul;umesh yadav;rohit sharma;india;australia;rahul sipligunj;yuva;international;father;prithvi shaw;mohammed shami;mayank agarwalTue, 05 Jan 2021 20:56:30 GMTబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఘోర పరాజయం చవి చూసిన టీమిండియా రెండో టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును మట్టి కరిపించి టెస్టు సిరీస్ ను 1-1తో సమం చేసింది. దీంతో మూడో టెస్టులో భారత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. ఇక రెండో టెస్టులో విజయంతో భారత్ ఆస్ట్రేలియాకు సవాల్ విసిరినట్లు అయింది. ఇది ఇలా ఉండగా  ఈ టెస్టు సిరీస్ లో టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. సిరీస్ ముందే పేసర్ ఇషాంత్ శర్మ టోర్నీకి దూరమవగా... మొదటి టెస్టులో సీనియర్ పేసర్ మహ్మద్‌ షమీ సిరీస్ నుంచి వైదొలిగాడు. ఇక మొదటి టెస్టు అనంతరం పితృత్వ సెలవుల మీద కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా జట్టుకు దూరమైన సంగతి తెల్సిందే. రెండో టెస్టు లో బౌలింగ్ చేస్తూ ఉమేష్ యాదవ్ గాయపడగా, తాజాగా ఇన్ ఫాం బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ కూడా సిరీస్‌ నుంచి వైదొలిగాడు.

ప్రస్తుతం జట్టులో కెప్టెన్ అజింక్య రహానే, నయా వాల్ ఛటేశ్వర్ పూజారా తప్ప అనుభవజ్ఞులైన బ్యాట్స్ మెన్ లేరు. దీంతో మూడో టెస్టు ముందు సీనియర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ జట్టుతో కలవడం టీమిండియాకు బలాన్ని ఇస్తుందనే చెప్పాలి.  ముఖ్యంగా జట్టుకు మంచి శుభారంభాన్ని ఇచ్చే ఓపెనర్లు లేరు. ఇప్పటికే తొలి టెస్టులో విఫలమవడంతో యువ ఆటగాడు పృథ్వీ షా  తుది జట్టులో స్థానం కోల్పోగా, రెండో టెస్టులో మయాంక్ అగర్వాల్ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో మూడో టెస్టులో మయాంక్ ఆడేది అనుమానంగానే మారింది. ఈ నేపథ్యంలో మయాంక్ స్థానంలో రోహిత్  ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తాడా లేక మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తాడా అనే అంశం ఆసక్తిగా మారింది.

కాగా దాదాపు ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన  రోహిత్ శర్మ పునరాగమనంపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ స్పందించాడు. రోహిత్ శర్మ సెంచరీతో రీఎంట్రీ ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మూడో టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని అభిప్రాయపడ్డాడు. హిట్ మ్యాన్ బ్యాటింగ్ స్టైల్‌కు ఆసీస్ పిచ్‌లు ఎంతో అనువుగా ఉంటాయని... రోహిత్ కొత్త బంతిని సమర్థవంతంగా ఎదుర్కొంటే శతకం ఖాయమని జోస్యం చెప్పాడు.




తెలంగాణపై రాహుల్ వ్యూహమిదేనా?

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>