Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/snake-condoma363d489-df4f-479d-a7b6-b59a3b1621c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/snake-condoma363d489-df4f-479d-a7b6-b59a3b1621c8-415x250-IndiaHerald.jpgపైశాచిత్వానికి పరాకాష్ఠ. ఓ పాము తలకు కండోమ్ తొడిగి పాశవికంగా ఆనందపడిన దుర్మార్గపు ఘటన ఇది. గుర్తు తెలియని వ్యక్తి తొడిగిన ఆ కండోమ్ తీసుకోలేక, ఆహారం తీసుకోలేక, నీరు తాగలేక తీవ్ర ఇబ్బందులు పడిన పాము దీన స్థితి ఇది. ఎవరో ఓ వ్యక్తి ఉపయోగించిన కండోమ్‌ను పాము తలకు తొడిగి..snake condom;manu;mumbai;capital;driver;doctor;cow slaughter;local language;dogs;vపాము తలకు కండోమ్.. పైశాచికత్వానికి పరాకాష్ఠపాము తలకు కండోమ్.. పైశాచికత్వానికి పరాకాష్ఠsnake condom;manu;mumbai;capital;driver;doctor;cow slaughter;local language;dogs;vTue, 05 Jan 2021 22:21:35 GMTముంబై కందివాల్(తూర్పు) ప్రాంతంలో దానిని కొందరు గుర్తించారు. అప్పటికే అలసిపోయి, నీరసించిపోయి ఉన్న ఆ పామును సులభంగానే పట్టుకున్నారు. ఆ తరువాత దగ్గరలోని వెటర్నరీ అధికారి వద్దకు తీసుకెళ్లారు.

చెక్కర్డ్ కీల్‌బ్యాక్‌గా పిలిచే ఈ పాము విషపు జాతికి చెందిందని, దీనిని పట్టుకోవడం అంత సులభం కాదని, ఈ పని సాధారణ వ్యక్తులు చేయలేరని, నిపుణుడైన పాములు పట్టే వ్యక్తే చేసి ఉంటాడని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. తలకు ఉన్న తొడుగును తొలగించినప్పటికీ.. ఇన్నాళ్లుగా ఆ టార్చర్ అనుభవించడం వల్ల మానసికంగా తీవ్ర ఆందోళనలో పాము ఉందని, పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తోందని, ఏం చేస్తోందో..? ఎటు వెళ్తోందో కూడా తెలియని దుర్భర స్థితిలోకి చేరిందని అక్కడి డాక్టర్ చెబుతున్నారు.

ఇంతకుముందు కూడా అనేక చోట్ల ఇలా జంతువులపై దాడులు జరిగాయి. గర్భంతో ఉన్న ఏనుగుకు పనసకాయలో టపాసులు పెట్టి తినిపించారు. దీంతో ఆ ఏనుగు నోట్లో పేలి ఆ ఏనుగు చనిపోయింది. ఇలాంటి ఘటనలోనే మరో ఆవు కూడా చనిపోయింది. ఆ తరువాత ఓ కోతిని చంపేశారు.

ఇదిలా ఉంటే మనుషుల పైశాచికత్వం మరిన్ని దారుణాలకూ ఒడిగట్టేలా చేస్తోంది. కుక్కలు, ఆవులు వంటి జంతువలపై అత్యాచారానికి కూడా పురిగొల్పుతోంది. ఆ మధ్య దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లగాబాద్‌లో ఓ ఆవును రేప్ చేసి పొడిచి చంపేశారు. అదే ఢిల్లీలో ఓ మగ కుక్కను గ్యాంగ్ రేప్ చేయడం ఆ కుక్క మరణించింది. అలాగే ముంబైలోనూ ఓ కుక్కను స్థానిక ట్యాక్సీ డ్రైవర్ రేప్ చేశాడు. ఇక మన తెలంగాణలోనే ఓ గేదె కాళ్లు కట్టేసి, దానిపై 40 ఏళ్ల వ్యక్తి దారుణంగా అత్యాచారం చేశారు. ఇలా జంతువులను దారుణంగా హింసించడం దేశంలో అనుక్షణం ఎక్కడో ఒక చోట వింటూనే ఉన్నాం. మరి వీరి పైశాచికత్వానికి అంతం ఎప్పుడో.. వేచి చూడాలి.


మాస్క్ పెట్టుకోనన్న కస్టమర్.. క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడంటే..!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>