PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kings44d99aea-612a-428f-a5b3-b21d1480780b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kings44d99aea-612a-428f-a5b3-b21d1480780b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల విషయంలో సిఎం జగన్ ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన జరుగుతూనే ఉంది. రాజకీయంగా ఏపీలో ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి. కాని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎక్కడో ఒక చోట అవినీతి చేస్తూనే ఉన్నారు. ఇళ్ళ పట్టాలను పంపిణీ నుంచి ఎంపిక వరకు అవినీతి జరిగింది అని విపక్షాలు తీవ్ర స్థాయిలో రాష్ట్ర సర్కార్ ని వైసీపీ నేతలను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నా సరే వైసీపీ నేతల్లో మార్పు రావడం లేదు.jagan,ycp,ap;jagan;andhra pradesh;collector;village;ycpజగన్ మేనత్త ఊర్లో... వైసీపీ పరువు తీసిన వైసీపీ నాయకులుజగన్ మేనత్త ఊర్లో... వైసీపీ పరువు తీసిన వైసీపీ నాయకులుjagan,ycp,ap;jagan;andhra pradesh;collector;village;ycpTue, 05 Jan 2021 14:04:15 GMTఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల విషయంలో సిఎం జగన్ ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన జరుగుతూనే ఉంది. రాజకీయంగా ఏపీలో ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి. కాని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎక్కడో ఒక చోట అవినీతి చేస్తూనే ఉన్నారు. ఇళ్ళ పట్టాలను పంపిణీ నుంచి ఎంపిక వరకు అవినీతి జరిగింది అని విపక్షాలు తీవ్ర స్థాయిలో రాష్ట్ర సర్కార్ ని వైసీపీ నేతలను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నా సరే వైసీపీ నేతల్లో మార్పు రావడం లేదు.

తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. సీఎం జగన్ మేనత్త గ్రామంలో వైసీపీ నాయకుల ఇళ్లపట్టాల దందా ఒకటి బయటపడింది. ఇళ్ల పట్టాలు  వచ్చిన లబ్ధిదారులు నుండి సభ ఖర్చుల పేరుతో మైలవరం మండలం గణపవరం గ్రామ వైసీపీ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. గ్రామ వైసీపీ నాయకుడి మామిడి తోటలో వాలంటీర్ లకు మీటింగ్ పెట్టి డబ్బులు వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. డబ్బులు వసూలు బాధ్యతలు ఒక్కో సామాజిక వర్గ నాయకుడికి వాలంటీర్ కు వైసీపీ నాయకులు అప్పగించడం గమనార్హం.

లబ్ధిదారులు నుంచి 500 రూపాయలు చొప్పున  డబ్బులు వసూలు చేసారు కొంతమంది వాలంటీర్ లు. లబ్ధిదారులు సభలో ఫిర్యాదు చేస్తారేమోనని భయపడిన కొంతమంది వాలంటీర్లు డబ్బులు వసూలు చేయలేదు. డబ్బులు వసూలు చేయాలని వాలంటీర్లపై వైసీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. డబ్బులు వసూలు విషయం తహసీల్దార్, కలెక్టర్ వద్దకు చేరడంతో నగదు వసూలును  వాలంటీర్ లు ఆపేశారు. అయితే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది...? ఎవరు ఆదేశాలు ఇచ్చారు...? ఎంత మంది వసూలు చేసారు, ఎంత మంది వద్ద నుంచి వసూలు చేసారు అనే వివరాలను అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు.


ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>