PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-pawan-has-no-chance-in-tirupati8a7e4531-9d50-4c31-a61d-aa035f9fcfbb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-pawan-has-no-chance-in-tirupati8a7e4531-9d50-4c31-a61d-aa035f9fcfbb-415x250-IndiaHerald.jpgపవన్ కల్యాణ్ మళ్ళీ పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీలకు మద్ధతు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అప్పుడప్పుడు బయటకొచ్చి, చంద్రబాబు ప్రభుత్వానికి మద్ధతు తెలిపారు. ఇక మధ్యలో టీడీపీ-బీజేపీలతో విభేదించి వారిపై విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి తొలిసారి ఎన్నికల బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఇక ఓడిపోయాకైనా కాస్త యాక్టివ్‌గా ఉండి జనసేనని బలోపేతం చేసే కార్యక్రమం చేయడం లేదు. pawan kalyan;pawan;nani;kodali nani;nithya new;pawan kalyan;tiru;bharatiya janata party;jagan;janasena;2019;cinema;government;tirupati;media;parliment;husband;tdp;janasena party;party;mantraఇక పవన్‌కు ఛాన్స్ లేనట్టేనా?ఇక పవన్‌కు ఛాన్స్ లేనట్టేనా?pawan kalyan;pawan;nani;kodali nani;nithya new;pawan kalyan;tiru;bharatiya janata party;jagan;janasena;2019;cinema;government;tirupati;media;parliment;husband;tdp;janasena party;party;mantraTue, 05 Jan 2021 03:00:00 GMTపవన్ కల్యాణ్ మళ్ళీ పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీలకు మద్ధతు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అప్పుడప్పుడు బయటకొచ్చి, చంద్రబాబు ప్రభుత్వానికి మద్ధతు తెలిపారు. ఇక మధ్యలో టీడీపీ-బీజేపీలతో విభేదించి వారిపై విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి తొలిసారి ఎన్నికల బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఇక ఓడిపోయాకైనా కాస్త యాక్టివ్‌గా ఉండి జనసేనని బలోపేతం చేసే కార్యక్రమం చేయడం లేదు.

ఎప్పటిలాగానే అప్పుడప్పుడు బయటకొచ్చి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పైగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక పవన్ దూకుడు తగ్గించేశారు. సోషల్ మీడియా లేదా, అప్పుడప్పుడు పార్టీ సమావేశాలు పెట్టి మమ అనిపిస్తున్నారు. ఇక మళ్ళీ సినిమాలు తీయడం మొదలుపెట్టడంతో రాజకీయాల వైపు పెద్దగా దృష్టి సారించినట్లు కనిపించడం లేదు.

కానీ మధ్య మధ్యలో కేడర్‌ని ఉత్సాహపరించేందుకు పవన్ రంగంలోకి పర్యటనలు చేసి, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఒకరోజు మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలపై తీవ్ర ఆరోపణలు చేసి, మళ్ళీ సినిమా షూటింగ్‌లో బిజీ అయిపోయారు. ఇలా పవన్ పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేయడం వల్ల బీజేపీకి మంచి ఛాన్స్ వచ్చినట్లు కనిపిస్తోంది. తమకంటే ఎక్కువ ఓట్లు ఉన్నా సరే జనసేనని డామినేట్ చేస్తూ బీజేపీ ముందుకెళుతుంది. బీజేపీ నేతలు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు.

ఇక దాని వాళ్లే తిరుపతి పార్లమెంట్ సీటుని బీజేపీ అడుగుతుంది. త్వరలో జరగబోతే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో బీజేపీ తరుపున అభ్యర్ధి ఉంటారని, ఆ పార్టీ నేతలు ప్రకటించేస్తున్నారు. అయితే ఇక్కడ జనసేన మద్ధతు కూడా ఉంటుందని చెబుతున్నారు. అసలు జనసేనకు ఎలాంటి ఛాన్స్ లేకుండా తామే బరిలో ఉండాలని బీజేపీ చూస్తుంది. దీనిపై పవన్ సైతం సీరియస్‌గా లేనట్లు కనిపిస్తోంది. కానీ జనసేన కార్యకర్తలు మాత్రం సీరియస్‌గా ఉన్నారు. తిరుపతిలో తమ అభ్యర్ధినే పెట్టాలని అనుకుంటున్నారు. పరిస్తితి చూస్తే మాత్రం అలా లేదు. మొత్తానికైతే తిరుపతిలో పవన్‌కు ఛాన్స్ లేనట్లే కనిపిస్తోంది.




ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !

ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>