PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu-review-on-tirupathi-by-election6d40d86b-8176-43b4-b0b6-f8c9215b80d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu-review-on-tirupathi-by-election6d40d86b-8176-43b4-b0b6-f8c9215b80d4-415x250-IndiaHerald.jpgతిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. విజయం కోసం పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి తిరుపతి లోక్ సభ పరిధిలో పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు.ఉపఎన్నిక ప్రచారానికి సిద్ధం కావాలని పార్టీ నేతలకు సూచించారు.chandrababu naidu tirupathi;tiru;bharatiya janata party;telugu desam party;janasena;y. s. rajasekhara reddy;congress;mp;tirupati;minister;husband;tdp;ycp;janasena party;partyఈనెల 17 నుంచి టీడీపీ తిరుపతి ప్రచారంఈనెల 17 నుంచి టీడీపీ తిరుపతి ప్రచారంchandrababu naidu tirupathi;tiru;bharatiya janata party;telugu desam party;janasena;y. s. rajasekhara reddy;congress;mp;tirupati;minister;husband;tdp;ycp;janasena party;partyTue, 05 Jan 2021 21:55:46 GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో త్వరలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. విజయం కోసం పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి తిరుపతి లోక్ సభ పరిధిలో పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఉపఎన్నిక ప్రచారానికి సిద్ధం కావాలని పార్టీ నేతలకు సూచించారు.

           తిరుపతి ఉపఎన్నికపై మంగళవారం పార్టీ నేతలతో  చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈనెల  9 నుంచి మూడు రోజులపాటు నియోజకవర్గ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. 17 నుంచి 27 వరకు నాయకులు, ఇంచార్జ్‌లు పర్యటించి పార్టీ తరపున ప్రచారం చేయాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లోకేశ్‌తో పాటు తానూ పర్యటిస్తాని చెప్పారు చంద్రబాబు. గ్రామ, మండల స్థాయిలో 70 మంది సీనియర్లకు ఉప ఎన్నికబాధ్యతలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు.
తిరుపతి ఉప ఎన్నికపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రవెూహన్‌రెడ్డి నివాసంలో టీడీపీ సీనియర్లు సమావేశమయ్యారు. బయట నుంచి ఇన్‌చార్జ్‌లను తిరుపతికి పంపాలని, 10 బూత్‌లకు ఒక ఇన్‌ఛార్జ్‌ను నియమించాలని నిర్ణయించారు.


             తిరుపతి  ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగానే మారింది.సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడం అధికార వైసీపీ కీలకంగా మారగా.. ఏపీలో బలోపేతం కోసం తిరుపతి ఉప ఎన్నికను అస్త్రంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ పెద్దలు కూడా తిరుపతి ఉప ఎన్నికపై ఫోకస్ చేశారని చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని చంద్రబాబు ప్రకటించారు.  వైసీపీ, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీ, జనసేన తరపున ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని ఆ రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో తిరుపతి ఉప ఎన్నిక రాజకీయ వేడి పుట్టించే అవకాశం ఉందని భావిస్తున్నారు.





అమెరికాలో ఆ రాష్ట్రం భారత ఎన్నారై అడ్డా..మామూలు రికార్డ్ కాదుగా..!!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>