PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/caronaa65e58b5-936f-4e56-93cc-bdd19f6cd524-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/caronaa65e58b5-936f-4e56-93cc-bdd19f6cd524-415x250-IndiaHerald.jpgత్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి కీలక వ్యాఖ్యలు చేసారు. మన రాష్ట్రంలో ఆలయాలలో విగ్రహాలకి తగిన రక్షణ కొరవడిందిఅని ఆయన అన్నారు. అంతర్వేది రధం, రామతీర్థంలో శ్రీరామునికి అపచారం జరిగాయి అని, ఇలాంటి దాడులు చర్చి, మసీదు లపై జరిగినా కూడా తీవ్రంగా స్పందించాలి అని ఆయన కోరారు. చర్చి కానీ, మసీదు కానీ అయితే ప్రపంచం మొత్తం కదిలేది అని అన్నారు. ఆలయాలను ఆసరాగా చేసుకుని జీవించేవారు శాంతియుతంగా ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు.chinna jeeyar,ap;bhavana;sri venkateswara swamy;rama tirtha;yatraబ్రేకింగ్: ఈ నెల 17 నుంచి ఏపీలో స్వామీజీల యాత్రబ్రేకింగ్: ఈ నెల 17 నుంచి ఏపీలో స్వామీజీల యాత్రchinna jeeyar,ap;bhavana;sri venkateswara swamy;rama tirtha;yatraTue, 05 Jan 2021 16:37:39 GMT
సింగరాయకొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగిందని మండిపడ్డారు. వెయ్యికాళ్ళ మండపం విషయంలో అప్పటి హైకోర్టు జస్టిస్ అడిగిన మేరకు వాయిదా వేసాం అని అన్నారు. యాభై కి పైగా విగ్రహాలపై దాడులు జరిగాయని అధికారికంగా తెలుస్తోంది అని, స్ధానికంగా ఉన్న వారికి భయాందోళనలు కలగకుండా మోరల్ సపోర్ట్ ఇవ్వాలి అని ఆయన కోరారు. ధనుర్మాసంలో ఏ ఏ ఆలయాలలో విగ్రహాలు దాడికి గురయ్యాయో అక్కడికి వెళతాం అని ఆయన స్పష్హ్తం చేసారు. అక్కడ స్ధానికులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంటాం అని అన్నారు.

అక్కడ వారిని పరామర్శించి, తక్షణ చర్యలపై పరిశీలిస్తాం అని ఆయన అన్నారు. ఏ దేవాలయాలలో సీసీ కెమెరాలు పెట్టే కార్యక్రమం జరగలేదు అని, రామతీర్థంలో విగ్రహ ధ్వంసం అనంతరం సీసీ కెమెరాలు పెట్టారట అని, ఆలయాలు చూసుకునే ట్రస్టీలకు, వివిధ స్ధానాలలో పని చేసే వారికి బాధ్యత ఉండేది అని అన్నారు. ఎండోమెంట్ కు వెళ్ళాక ఆలయాలపై దృష్టి లేకపోవడంతో ఇలా జరుగుతున్నాయని భావన అని స్వామీజీ అన్నారు. బాధిత, పీడిత ఆలయాలకు ఉపశమనం కలిగించాలి అని కోరారు. ఆలయాలన్నీ దెబ్బతిన్న మనిషిలా ఉన్నాయి అన్నారు. పెద్దలతో, ఆద్యాత్మిక వేత్తలతో కలిసి 17వ తారీఖు నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం అని స్పష్టం చేసారు. ఆలయాల ఉనికికే భంగం కలిగింది కనుక ఈ యాత్ర అని ఆయన అన్నారు.


గుడ్డుతో అన్వాంటెడ్ హెయిర్ కు చెక్ పెట్టొచ్చని తెలుసా..?

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా

భారత్ - ఆసిస్ టెస్ట్.. ప్రేక్షకులకు భారీ షాక్..?

తెలంగాణాకు రాహుల్ గాంధీ...?

ఏపీ లో మరో దారుణం...వరాహ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ధ్వంసం ...!?

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>