PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/bharat-ready-to-fight-againist-china-3b0cc9f0-b011-4ed8-805d-ba27bb7ef3a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/bharat-ready-to-fight-againist-china-3b0cc9f0-b011-4ed8-805d-ba27bb7ef3a0-415x250-IndiaHerald.jpgయుద్ధానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆ దేశ సైన్యాన్ని ఆదేశించారు. ఏ క్షణంలో అయినా యుద్ధంలో దూకేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని ఆయన సైన్యాన్ని కోరారు. సైన్యానికి నిజమైన పోరాట పరిస్థితులు ఉండే వాతావరణంలో శిక్షణను పెంచాలని, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టు కునేలా ఉండాలని పేర్కొన్నారు.xingping;view;raj;ranina;jagan;rajnath singh;cm;minister;war;army;kshanam;beijingబ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!xingping;view;raj;ranina;jagan;rajnath singh;cm;minister;war;army;kshanam;beijingTue, 05 Jan 2021 22:54:00 GMTబీజింగ్ : యుద్ధానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆ దేశ సైన్యాన్ని ఆదేశించారు. ఏ క్షణంలో అయినా యుద్ధంలో దూకేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని ఆయన సైన్యాన్ని కోరారు. సైన్యానికి నిజమైన పోరాట పరిస్థితులు ఉండే వాతావరణంలో శిక్షణను పెంచాలని, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టు కునేలా ఉండాలని పేర్కొన్నారు.

చైనా ప్రభుత్వ అధికార వార్తా సంస్థ జిన్‌హువా తెలిపిన వివరాల ప్రకారం, చైనా దేశానికి చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఏ సెకండ్‌లో అయినా యుద్ధ చర్యలకు దిగేందుకు సిద్ధంగా ఉండాలని జీ జిన్‌పింగ్ ఆదేశించారు. అన్ని వేళలా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. దళాల సామర్థ్యాలను మరింత మెరుగు పరచడం కోసం అత్యాధునిక వ్యూహాత్మక పోరాట పద్ధతులను తప్పనిసరిగా నేర్చుకోవాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమాల్లో టెక్నాలజీని, అత్యాధునిక టెక్నాలజీని చేర్చాలని సూచించారు. యథార్థమైన పోరాట పరిస్థితుల్లో సైనిక శిక్షణను బలోపేతం చేయాలని నొక్కి వక్కాణించారు. గెలుపు సామర్థ్యానికి పదును పెట్టాలని పేర్కొన్నారు.

జీ జిన్‌పింగ్ సంతకంతో 2021లో సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) జారీ చేసిన మొదటి ఆదేశం ఇదేనని జిన్‌హువా తెలిపింది. సీఎంసీ ఆదేశాలను పీఎల్ఏ తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది.

ఇదిలావుండగా, గత ఏడాది జూన్‌లో భారత సైనికులతో ఘర్షణకు దిగిన చైనా సైనికులకు చేదు అనుభవం మిగిలిన సంగతి తెలిసిందే. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులు కాగా, చైనా సైనికులు కూడా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏ క్షణంలో అయినా యుద్ధం జరగొచ్చని వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో పెద్దగా మార్పులు రాలేదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో జగన్ పింగ్ ఆదేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.


ఏపీ పాలిటిక్స్‌లోకి రేవంత్...హస్తం టార్గెట్ మారిందా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>