PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr41144a7a-5ec3-43e5-866b-3c4e9d75de73-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr41144a7a-5ec3-43e5-866b-3c4e9d75de73-415x250-IndiaHerald.jpgజిల్లా స్ధాయిలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న వివిధ క్యాటగిరీలలో ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను జనవరి 31 లోగా పూర్తి చేయడంతో పాటు, ఎటువంటి జాప్యం లేకుండా కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బిఆర్ కెఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో అన్ని క్యాటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్లు, డీపీసీ లు నిర్వహణ కారుణ్య నియామకాలు, రెవెన్యూ సంబంధిత అంశాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, సెగ్రిగేషన్ షెడ్స్, డ్రైయింగ్ ఫ్లాటkcr;kcr;kumaar;karunya;prakruti;raghu;raj;sandeep;district;january;panchayati;chief minister;car;good news;good newwzబ్రేకింగ్: తెలంగాణా ఉద్యోగులకు కేసీఆర్ బిగ్ గుడ్ న్యూస్బ్రేకింగ్: తెలంగాణా ఉద్యోగులకు కేసీఆర్ బిగ్ గుడ్ న్యూస్kcr;kcr;kumaar;karunya;prakruti;raghu;raj;sandeep;district;january;panchayati;chief minister;car;good news;good newwzTue, 05 Jan 2021 21:11:08 GMTజిల్లా స్ధాయిలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న వివిధ క్యాటగిరీలలో ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను జనవరి 31 లోగా పూర్తి చేయడంతో పాటు, ఎటువంటి జాప్యం లేకుండా కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బిఆర్ కెఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో అన్ని క్యాటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్లు, డీపీసీ లు నిర్వహణ కారుణ్య నియామకాలు, రెవెన్యూ సంబంధిత అంశాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, సెగ్రిగేషన్ షెడ్స్, డ్రైయింగ్ ఫ్లాట్ ఫామ్స్, గ్రామ నర్సరీలు, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై సి.యస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని ఆయన కలెక్టర్లకు తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఈ అంశంపై వెంటనే జిల్లా స్ధాయిలో సమావేశం నిర్వహించి ప్రమోషన్ల ద్వారా నింపే ఉద్యోగ ఖాళీల సంఖ్యను అంచనా వేయాలన్నారు. ప్రతి సోమవారం ప్రమోషన్ల, కారుణ్య నియామాకాలపై సమావేశాలు నిర్వహించి ఈ నెల 24 నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధి హామీ ద్వారా ఈ సీజన్ లో మూడు నెలల ముందుగానే 14.10 కోట్ల పని దినాలు దాటినందుకు అధికారులను అభినందిస్తూ వచ్చే 3 నెలల కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

రైతు వేదికలు, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, డ్రైన్ ప్లాట్ ఫామ్స్, సెగ్రిగేషన్ షెడ్స్, నర్సరీలలో ప్లాంటేషన్ తదితర అంశాలకు ప్రాధాన్యత నిచ్చి పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, జి.ఎ.డి ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, సి.యం కార్యదర్శి శేషాద్రి,  సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్,  గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, యం.డి, టిఎస్ టిఎస్,  జి.టి వెంకటేశ్వర్ రావు  ఇతర అధికారులు  పాల్గొన్నారు.


భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా

భారత్ - ఆసిస్ టెస్ట్.. ప్రేక్షకులకు భారీ షాక్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>