MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/thaman2339d9f5-6851-4f7f-968c-c63870a465bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/thaman2339d9f5-6851-4f7f-968c-c63870a465bc-415x250-IndiaHerald.jpgతెలుగు చలన చిత్ర పరిశ్రమకు బీభత్సం సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఎస్.ఎస్.తమన్. నిజానికి అంతకు ముందు ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్ సినిమాలో మంచి రోల్ లో నటించిన తమన్ ఆ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో బాగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ పై పూర్తిగా నటనకు విరామం పలికిన తమన్ అక్కడి నుండి సంగీతదర్శకుడిగానే కొనసాగాడు. ఇక అతడికి రవితేజ, సురేందర్ రెడ్డి ల కాంబినేషన్ లో తెరకెక్కిన కిక్ సినిమా నుంచి బ్రేక్ ను అందించింది.s thaman;alavaikunthapuramulo;ravi;gopichand;shruti haasan;allu arjun;geetha;ravi teja;shankar;srinivas;surender reddy;thaman s;trivikram srinivas;cinema;sangeetha;media;blockbuster hit;success;arjun 1;nijam;kick;ala vaikunthapurramloo;reddy;v;krackఅలాంటోళ్ళ నోళ్లు మూయించడానికి ... నాకు రెండు నిముషాలు చాలు .....??అలాంటోళ్ళ నోళ్లు మూయించడానికి ... నాకు రెండు నిముషాలు చాలు .....??s thaman;alavaikunthapuramulo;ravi;gopichand;shruti haasan;allu arjun;geetha;ravi teja;shankar;srinivas;surender reddy;thaman s;trivikram srinivas;cinema;sangeetha;media;blockbuster hit;success;arjun 1;nijam;kick;ala vaikunthapurramloo;reddy;v;krackTue, 05 Jan 2021 01:00:00 GMTసినిమా ద్వారా సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఎస్.ఎస్.తమన్. నిజానికి అంతకు ముందు ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్ సినిమాలో మంచి రోల్ లో నటించిన తమన్మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో బాగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ పై పూర్తిగా  నటనకు విరామం పలికిన తమన్ అక్కడి నుండి సంగీతదర్శకుడిగానే కొనసాగాడు. ఇక అతడికి రవితేజ, సురేందర్ రెడ్డి ల కాంబినేషన్ లో తెరకెక్కిన కిక్ సినిమా నుంచి బ్రేక్ ను అందించింది.

సినిమా రిలీజ్ తర్వాత సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో పాటు అందులోని సాంగ్స్ కూడా థమన్ కి బాగా క్రేజ్ తెచ్చి పెట్టాయి. ఇక అక్కడినుండి వరుస అవకాశాలతో కొనసాగి మంచి సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న తమన్ యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను తన మ్యూజిక్ తో ఎంతో అలరించాడు. అయితే ఒకానొక సమయంలో కొన్ని పాటలు కాపీ కొడతాడు అనేటువంటి విమర్శలు తనపై రావడంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి, తనని తాను మరింతగా మార్చుకున్న తర్వాత మహానుభావుడు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్బస్టర్ సక్సెస్ కొట్టాడు థమన్. ఇక ఇటీవల అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాలోని సాంగ్స్ తో ఏకంగా జాతీయస్థాయిలో ప్రఖ్యాత సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తమన్ చేతిలో ప్రస్తుతం చాలా బడా సినిమాలు ఉన్నాయి.

అయితే ప్రస్తుతం వాటిలో ఒకటి క్రాక్. రవితేజ, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ కూడా శ్రోతల మంచి స్పందన రాబట్టాయి. కాగా అందులో భలేగా తగిలావే బంగారం అనే సాంగ్ విషయమై మాత్రం తమన్ కి మరొకసారి కాపీ సమస్యలు ఎదురు కాక తప్పలేదు. గతంలో వచ్చిన ఒక పరభాష సాంగ్ ని కాపీ కొట్టిన తమన్ ఈ సాంగ్ ట్యూన్ ని అలాగే దించేసాడు అంటూ కొందరు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేయడం జరిగింది. ఇక నిన్న కొన్ని ప్రముఖ తెలుగు పత్రికలకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయమై ప్రత్యేకంగా మాట్లాడిన తమన్, కేవలం తన మీదనే కాకుండా చాలామంది సంగీత దర్శకులు మీద ఈ విధమైన కాపీ అనేటువంటి ఆరోపణలు ఎక్కువయ్యాయని అన్నారు.

నిజానికి తను వాడేది లక్షల రూపాయల విలువ చేసే సాఫ్ట్ వెర్లు అని, అలాగే తనతో పనిచేసే సినిమా బృందాల వారు తాము ఇచ్చే ట్యూన్స్ విషయమై తాము మాత్రమే కాకుండా మూవీ టీమ్ లోని ఎందరో వింటారని మరి వారిలో ఎవరో ఒకరైన సరే ఇది కాపీ అని చెప్పొచ్చు కదా ఒకవేళ అది నిజంగా కాపీ అయితే సదరు ఒరిజినల్ ట్యూన్ కంపోజ్ చేసిన వారు తమ మీద వెంటనే చర్యలు తీసుకుంటారు కదా మరి ఇన్ని తెలిసిన కొందరు ఎంతో ఫులిష్ గా ఆలోచించి మాలాంటి వారి పై ఎందుకు విమర్శలు చేస్తారో అర్థం కావడం లేదు. నిజానికి తాను అటువంటివన్నీ పెద్దగా పట్టించుకోనని ఒకవేళ పట్టించుకుంటే కేవలం రెండు నిమిషాల్లోనే అటువంటి వారి నోళ్లకు తాళం వేసేలా గట్టిగా బుద్ధిచెప్పగలనని తమన్ ఒకింత షాకింగ్ కామెంట్ చేశారు. ఇక రాబోయే రోజుల్లో తను చేస్తున్న సినిమాలకు మరింత అద్భుతమైన మ్యూజిక్ ని అందించేలా ఎప్పటికప్పుడు మరింత కృషి చేస్తానని థమన్ చెప్పడం జరిగింది......!!


ఇక పవన్‌కు ఛాన్స్ లేనట్టేనా?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>