PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan1f775ab3-4823-4719-9455-297d77530c9f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan1f775ab3-4823-4719-9455-297d77530c9f-415x250-IndiaHerald.jpgఏపీలో విగ్రహాల ధ్వంసం ఘటనలు కొన్ని రోజులుగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో ఘటనలు జరగడం అది కాస్తా రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం జగన్ కూడా ఘాటుగా స్పందించారు. దేవుళ్లపై రాజకీయం చేస్తున్నారని టీడీపీ నేతలు, బీజేపీ నేతలపై మండిపడ్డారు. అయితే.. టీడీపీ దీన్ని కౌంటర్ చేస్తోంది. ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీ క్రైస్తవులు కాబట్టే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై విధ్వంసకాండ జరుగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. 136 దుర్ఘటనలు జరిగినా ప్రభుత్వ పెద్దల అjagan;cbn;deva;bharatiya janata party;jagan;andhra pradesh;mp;telugu;chief minister;cbi;minister;tdp;central government;rama tirtha;nijam;mantraఆ ముగ్గురు క్రిస్టియన్లు.. అందుకే ఏపీలో విగ్రహాలపై దాడులా..?ఆ ముగ్గురు క్రిస్టియన్లు.. అందుకే ఏపీలో విగ్రహాలపై దాడులా..?jagan;cbn;deva;bharatiya janata party;jagan;andhra pradesh;mp;telugu;chief minister;cbi;minister;tdp;central government;rama tirtha;nijam;mantraTue, 05 Jan 2021 08:00:00 GMTఏపీ సీఎం జగన్ కూడా ఘాటుగా స్పందించారు. దేవుళ్లపై రాజకీయం చేస్తున్నారని టీడీపీ నేతలు, బీజేపీ నేతలపై మండిపడ్డారు. అయితే.. టీడీపీ దీన్ని కౌంటర్ చేస్తోంది. ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీ క్రైస్తవులు కాబట్టే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై విధ్వంసకాండ జరుగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది.

136 దుర్ఘటనలు జరిగినా ప్రభుత్వ పెద్దల అండ ఉండబట్టే ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుగు దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రైస్తవ ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి.. విగ్రహాల ధ్వంసంపై చర్యలు తీసుకుంటారన్న నమ్మకం తమకు లేదని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని సీబీఐ దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేసింది. జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేయాలని, అవసరమైతే దిల్లీకి బృందాన్ని పంపించాలని నిర్ణయించింది. పొలిట్‌బ్యూరో సమావేశంలో చేసిన తీర్మానాలను, తీసుకున్న నిర్ణయాలను మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు.

జగన్‌ పాలనలో హిందూ మతంపై జరుగుతున్న దుర్మార్గాలు, దుశ్చర్యలు బ్రిటిష్‌ హయాంలో కూడా జరగలేదని టీడీపీ కామెంట్ చేసింది. రాజకీయ కుట్రలో భాగంగానే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం వెళ్లారని... అక్కడున్నవారిని చంద్రబాబు పైకి ఉసిగొల్పాలని చూశారని... ప్రజలు తిరగబడటంతో విశాఖకు పారిపోయారని కాలవ అన్నారు. చంద్రబాబుకు లభించిన ఆదరణ చూసి, కడుపుమంటతో ఆయనపైనా, అచ్చెన్నాయుడు, కళావెంకటరావుపైనా అక్రమ కేసులు పెట్టారని..  జగన్‌ నిజంగా లౌకికవాది అయితే... మంత్రుల వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.

అంతే కాదు.. జగన్ సీఎం అయినప్పటి నుంచి ఒక మతానికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలుగు దేశం ఆరోపిస్తోంది. పేకాటరాయుళ్లు, గ్యాంబ్లర్లు మంత్రులుగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారంటున్న తెలుగుదేశం నేతలు..  మంత్రులు పేకాట క్లబ్బుల నిర్వహణలో మునిగి తేలుతున్నారు. పేకాట, మద్యం, మాఫియా.. ఇలా రాష్ట్రంలో డాన్‌ సంస్కృతిని జగన్‌రెడ్డి పెంచి పోషిస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది.




స్టేజ్ పైనే చిర్రెత్తి పోయిన జబర్దస్త్ ఇమ్మానియేల్.. ఇంత అన్యాయం చేస్తావా అంటూ..?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>