PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/can-bird-flu-infect-humans51b53527-c697-499d-a6db-50c370eba30f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/can-bird-flu-infect-humans51b53527-c697-499d-a6db-50c370eba30f-415x250-IndiaHerald.jpgహిమాచల్‌ ప్రదేశ్‌లో 1700 పక్షులు చనిపోయాయి. కాంగ్రా జిల్లాలోని అభయరణ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకేసారి ఈ స్థాయిలో పక్షులు ప్రాణాలు కోల్పోవడం అక్కడ కలకలం రేపుతోంది. దీంతో వెంటనే అక్కడికి పర్యాటకులతో పాటు ఎవరూ వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాంగ్‌డామ్‌ సరస్సు చుట్టూ ఏం జరుగుతోందని నిఘా పెట్టింది. అంతేకాదు.. జిల్లాలో పౌల్ట్రీ కొనుగోళ్ల పైనా నిషేధం విధించారు అధికారులు. పౌల్ట్రీతో పాటు పక్షులు, చేపల వధను నిషేధించినట్లు తెలిపారు. బర్డ్‌ ఫ్లూ కారణంగానే పక్షులు మృత్యవాత పడొచ్చని అనుమానిస్తcan bird flu infect humans;manu;kerala;kottayam;kangraబర్డ్ ఫ్లూ మనుషులకూ సోకుతుందా..?బర్డ్ ఫ్లూ మనుషులకూ సోకుతుందా..?can bird flu infect humans;manu;kerala;kottayam;kangraTue, 05 Jan 2021 21:00:00 GMTకేరళ, నిన్న రాజస్థాన్‌.. ఇప్పుడు హిమాచల్‌ ప్రదేశ్‌..! అసలు ఏం జరిగింది..? కొత్త వైరస్‌ పక్షులను పొట్టన పెట్టుకుంటోందా..? అది మనుషులకూ సోకే ప్రమాదం ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

హిమాచల్‌ ప్రదేశ్‌లో 1700 పక్షులు చనిపోయాయి. కాంగ్రా జిల్లాలోని అభయరణ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకేసారి ఈ స్థాయిలో పక్షులు ప్రాణాలు కోల్పోవడం అక్కడ కలకలం రేపుతోంది. దీంతో వెంటనే అక్కడికి పర్యాటకులతో పాటు ఎవరూ వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాంగ్‌డామ్‌ సరస్సు చుట్టూ ఏం జరుగుతోందని నిఘా పెట్టింది. అంతేకాదు.. జిల్లాలో పౌల్ట్రీ కొనుగోళ్ల పైనా నిషేధం విధించారు అధికారులు. పౌల్ట్రీతో పాటు పక్షులు, చేపల వధను నిషేధించినట్లు తెలిపారు. బర్డ్‌ ఫ్లూ కారణంగానే పక్షులు మృత్యవాత పడొచ్చని అనుమానిస్తున్నారు. ఈ H5N1 ఇన్‌ఫ్లూయోంజా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లోనే కాదు.. అంతకుముందు కేరళలో కూడా బాతులు ఇలాగే చనిపోయాయి. అలప్పుజ, కొట్టాయంలో దాదాపు 12 వేల బాతులు మృత్యువాత పడ్డాయి. వీటిలో H5N8 ఏవియన్‌ ఇన్‌ఫ్లూయోంజాను గుర్తించినట్లు ప్రభుత్వం తెలిపింది. మరో 36 వేల బాతులకు కూడా ఈ వైరస్‌ సోకినట్లు చెబుతున్నారు.

ఇక రాజస్థాన్‌లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అక్కడ కాకులు మృత్యువాతపడుతున్నాయి. చనిపోయిన కాకుల్లోనూ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయేంజా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జలావర్‌ జిల్లాతో పాటు జైపూర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక మధ్యప్రదేశ్‌లోనూ ఈ వైరస్‌ ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో అసలు ఏం జరుగుతుందా..? అన్న ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే కరోనాతో వణికిపోతున్న జనాలకు.. పక్షులకు సోకుతున్న వైరస్‌ దడ పుట్టిస్తోంది. మొత్తానికి బర్డ్ ఫ్లూ జనాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.






కేసీఆర్ ని అనకూడని మాట అన్న బండి సంజయ్... వామ్మో

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>