PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఏపీ సర్కార్ కి కొన్ని కొన్ని సమస్యలు ఇప్పుడు పెద్ద తల నొప్పిగా మారాయి అనే చెప్పాలి. ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన జరుగుతూనే ఉంది. దీనితో రాజకీయంగా కూడా ఇది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రకాశం జిల్లాలో రెండు గ్రామాల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర స్థాయిలో దుమారం రేపింది. ఏపీ మంత్రులు, ఎంపీలు జోక్యం చేసుకున్నా సరే ఈ వివాదం మాత్రం ఆగలేదు. వలల వేట విషయంలో రెండు గ్రామాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా ఈ సమస్యపై మంత్రి అప్పలరాజు మాట్లాడారు. మంత్రి అప్పలరాజు నిన్న మీడియాతో మాట్లాడుతూ కీలక వys jagan;visakhapatnam;jagan;pothula suneetha;andhra pradesh;mopidevi venkata ramana;district;vishakapatnam;minister;sea;prakasam district;prakasm;mantraప్రకాశం జిల్లా గొడవని జగన్ క్లోజ్ చేసారా...?ప్రకాశం జిల్లా గొడవని జగన్ క్లోజ్ చేసారా...?ys jagan;visakhapatnam;jagan;pothula suneetha;andhra pradesh;mopidevi venkata ramana;district;vishakapatnam;minister;sea;prakasam district;prakasm;mantraTue, 05 Jan 2021 10:00:00 GMTఏపీ సర్కార్ కి కొన్ని కొన్ని సమస్యలు ఇప్పుడు పెద్ద తల నొప్పిగా మారాయి అనే చెప్పాలి. ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన జరుగుతూనే ఉంది. దీనితో రాజకీయంగా కూడా ఇది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రకాశం జిల్లాలో రెండు గ్రామాల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర స్థాయిలో దుమారం రేపింది. ఏపీ మంత్రులు, ఎంపీలు జోక్యం చేసుకున్నా సరే ఈ వివాదం మాత్రం ఆగలేదు. వలల వేట విషయంలో రెండు గ్రామాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా ఈ సమస్యపై మంత్రి అప్పలరాజు మాట్లాడారు.

మంత్రి అప్పలరాజు నిన్న మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. వాడరేవు, కఠారివారిపాలెం మత్స్యకారులతో వలల  వివాదంపై చర్చించాం అని అన్నారు. వివాదానికి కారణమైన బల్ల వల, అర అంగులం కంటే తక్కువ గ్యాప్ ఉన్న ఐలా వల నిషేదానికి ఇరు గ్రామాల మత్స్యకారులు ఒప్పుకున్నారు అని ఆయన అన్నారు. సముద్రంలో ఎనిమిది కిలో మీటర్లు లోపు ఈ వలలతో చేపల వేటపై నిషేధం విధించాం అని స్పష్టం చేసారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన వలలు వాడుతున్నారు అని ఆయన అన్నారు.

వలల వలన నష్టాలు, లాభాలపై ఒక పాలసీ తయారు చేసేందుకు కమిటీ వేస్తాం అని ఆయన స్పష్టం చేసారు. రేపటి నుండి ఇరు గ్రామాల మత్స్యకారులు నిషేధం విధించిన వలలు కాకుండా ఇతర వలలు వాడుకోవాలి అని ఆయన సూచించారు. వైజాగ్ కలెక్టరేట్ లో రేపు అక్కడి మత్స్యకారులతో సమావేశం అవుతాం అని అన్నారు. మత్స్యకారుల మధ్య నెలకొన్న వలల వివాదాలని పరిష్కరిస్తాం అని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఇక మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత సహా పలువురు రెండు గ్రామాల వారితో చర్చించి సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేసారు.


అతని కోసం హైదరాబాద్లోనే ఐష్

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>