PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eggbfbb6527-f271-4fb8-92f6-ac8c34abd3f3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eggbfbb6527-f271-4fb8-92f6-ac8c34abd3f3-415x250-IndiaHerald.jpgగుడ్లు తినడం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుందని అందరికి తెలుసు. కానీ గుడ్లు ఎక్కువ తిన్నా డేంజరే. రోజూ అతిగా గుడ్లు తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2 నెలల కిందట యూపీకి చెందిన ఓ వ్యక్తి అతిగా గుడ్లు తినడం వల్ల చనిపోయాడు. అతను 50 గుడ్లు తినగలనని పందెం వేసి.. 42 గుడ్లు తిన్నాక చనిపోయాడు. ఇక ఆ విషయం అటు ఉంచితే.. అసలు రోజూ మనం ఎన్ని గుడ్లు తినవచ్చో అది ఇప్పుడు తెలుసుకుందాం. egg;manu;tara;vitamin a;vitamin;protiens;proteinగుడ్లు ఎక్కువగా తింటే చనిపోతారా..!?గుడ్లు ఎక్కువగా తింటే చనిపోతారా..!?egg;manu;tara;vitamin a;vitamin;protiens;proteinTue, 05 Jan 2021 06:00:00 GMT
గుడ్లు తింటే శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. దీంతో మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. గుడ్డు ఆరోగ్యానికి మంచిది కాబట్టి.. రోజూ తొనొచ్చు. ఇలా రోజుకు 1 లేదా 2 గుడ్లు తినవచ్చు. ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ తింటే మాత్రం అవే గుడ్లు అనారోగ్యానికి దారితీస్తాయి. జిమ్‌ లకు వెళ్లేవారు, బాడీ గార్డులూ ఎక్కువగా గుడ్లు తింటారు. ఐతే వారు తిన్నాక మనలా మామూలుగా ఉండరు. తిన్న ఆహారం కండ బట్టేలా గంటల తరబడి వర్కవుట్లు, ఎక్సర్‌ సైజ్‌ చేస్తారు. కాబట్టి.. ఆ గుడ్ల ఆహారం వారికి బాడీలో కలుస్తుంది. అయినప్పటికీ వారు కూడా రోజుకు నాలుగు లేదా 5 గుడ్లు మాత్రమే తినడం ఆరోగ్యానికి మేలు.

గుడ్లను పరిమితికి మించి తినొద్దు. అలా తింటే పొట్టలో గడబిడ, ఏసీడీటీ, గ్యాస్ వంటివి మొదలవుతాయి. ఇదే కంటిన్యూ అయితే.. కిడ్నీలు కూడా పాడవుతాయని డాక్టర్లు తెలిపారు. గుడ్లు అతిగా తింటే జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బ తింటుంది. గుడ్లలో ప్రోటీన్‌ తో పాటు విటమిన్ ఏ, బీ12, డీ, ఈ, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటి కోసమైనా రోజూ 1 లేదా 2 గుడ్లు తినాలి. వాటిని ఫ్రై చేసి కాకుండా ఉడకబెట్టి తినడం మంచిది. గుడ్లు తినడం వల్ల మీ కండరాలు బలంగా అవుతాయి. గుడ్లలోని తెల్ల సొన ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు సొన ఎక్కువగా తింటే మనుషులు బలంగా అవుతారు. సన్నగా ఉండి బరువు పెరగాలనుకునేవారు.. గుడ్లలో పసుపు సొన తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.


జ‌న‌వ‌రి 5వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>