PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janareddy-tpcc1e3072b1-b1b8-4abc-b7e3-32c766267dba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janareddy-tpcc1e3072b1-b1b8-4abc-b7e3-32c766267dba-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. హైకమాండ్ ఆలస్యం చేసే కొద్ది కొత్త కొత్త ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. నెల రోజులైనా టీపీసీసీ కూర్పు కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్ కేడర్ లోనూ అయోమయం నెలకొంది. ఇదిలా ఉండగానే టీపీసీసీ ఎంపికపై మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈసారి సీన్ లోకి ఎంటరయ్యారు సీఎల్పీ మాజీ నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానా రెడ్డి.janareddy tpcc;nagarjuna akkineni;jeevan;revanth;venkat;delhi;hyderabad;telangana;revanth reddy;congress;district;smart phone;king;tpcc;minister;janareddy;chadha venkat reddy;reddy;partyటీపీసీసీ ఎంపికలో జానా రెడ్డి ట్విస్ట్!టీపీసీసీ ఎంపికలో జానా రెడ్డి ట్విస్ట్!janareddy tpcc;nagarjuna akkineni;jeevan;revanth;venkat;delhi;hyderabad;telangana;revanth reddy;congress;district;smart phone;king;tpcc;minister;janareddy;chadha venkat reddy;reddy;partyTue, 05 Jan 2021 21:42:35 GMT       తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. హైకమాండ్ ఆలస్యం చేసే కొద్ది కొత్త కొత్త ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. నెల రోజులైనా టీపీసీసీ కూర్పు కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్ కేడర్ లోనూ అయోమయం నెలకొంది. ఇదిలా ఉండగానే టీపీసీసీ ఎంపికపై
మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈసారి సీన్ లోకి ఎంటరయ్యారు సీఎల్పీ మాజీ నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానా రెడ్డి.

             త్వరలో జరగాల్సి ఉన్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక పూర్తి అయ్యే వరకు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా వేయాలని అధిష్ఠానానికి  జానారెడ్డి విజ్ఞప్తి చేశారు.  ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి కార్యదర్శి ఎస్ ఎస్ బోస్ రాజుకు, హైకమాండ్ పెద్దలకు జానారెడ్డి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది.  పీసీసీ గొడవ ప్రభావం నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పడుతుందని హస్తిన పెద్దలకు జానారెడ్డి తేల్చిచెప్పారని చెబుతున్నారు. ఉప ఎన్నికల ముందు ప్రకటనతో నేతల్లో ఐక్యత లోపిస్తుందని ఆయన హెచ్చరించారట. జానారెడ్డి విజ్ఞప్తితో పీసీసీ ఎంపిక విషయం గందరగోళంలో పడిందనే ప్రచారం గాంధీభవన్ లో జరుగుతోంది.

టీపీసీసీ ఎంపిక కోసం నెల రోజులుగా కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్.. నాలుగు రోజుల పాటు హైదరాబాద్ లోనే మకాం వేసి... పార్టీ నేతల అభిప్రాయాలు సేకరించారు. జిల్లా నేతలతోనూ ఆయన మాట్లాడారు. పీసీసీ చీఫ్ ఎంపికపై
ఎంపీలు రేవంత్‌రెడ్డి,  కోమటిరెడ్డి venkat REDDY' target='_blank' title='వెంకట్‌రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వెంకట్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను హస్తినకు పిలిచి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు ఢిల్లీ పెద్దలు. తాజాగా జానారెడ్డి సూచనతో పీసీసీ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.

   మరోవైపు  తెలంగాణ కాంగ్రెస్ కమిటి కూర్పు ఎట్టకేలకు కొలిక్కి వచ్చిందని, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఖరారు చేశారని సోమవారం నుంచి ప్రచారం జరుగుతోంది.  పీసీసీ చీఫ్ ఖాయమనుకున్న రేవంత్ రెడ్డిని ప్రచార కమిటీ చైర్మన్‌గా , రేసులో నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా,  సీఎల్పీ నేతగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సమన్వయ కమిటీ చైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్కను నియమించారని ప్రచారం జరిగింది.


అమెరికాలో ఆ రాష్ట్రం భారత ఎన్నారై అడ్డా..మామూలు రికార్డ్ కాదుగా..!!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>