SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news63ff764b-0cca-4b65-9503-e0856c305871-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news63ff764b-0cca-4b65-9503-e0856c305871-415x250-IndiaHerald.jpgచాలా రోజుల తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ తిరిగి గ్రౌండ్ లో అడుగు పెడుతుండడంతో అందరి చూపు అతని పైనే ఉంది. దాదాపుగా ఐపీఎల్ తర్వాత నుండి కొన్ని ఫిట్ నెస్ సమస్యల కారణంగా ఆసీస్ తో జరిగిన వన్డే టి20 సిరీస్ లకు దూరమయ్యాడు. అలాగే టెస్ట్ సిరీస్ లో మొదటి రెండు టెస్టులకు కూడా రోహిత్ హాజరు కాలేదు. అయితే ఎట్టకేలకు ఫిట్ నెస్ పరీక్షలు పాసైన రోహిత్ మూడవ టెస్ట్ కి అందుబాటులో ఉండనున్నాడు. దీంతో ప్రత్యర్థి జుట్టు ఆస్ట్రేలియా హిట్ మ్యాన్ రోహిత్ ను ఎదుర్కొనే దిశగా ప్రణాళికలో సిద్ధం చేస్తుంది. sports news;rohit;australiaరోహిత్ ను ఎదుర్కొనేందుకు మేము సిద్ధం : లైయన్ !!రోహిత్ ను ఎదుర్కొనేందుకు మేము సిద్ధం : లైయన్ !!sports news;rohit;australiaTue, 05 Jan 2021 07:00:00 GMTరోహిత్ తిరిగి గ్రౌండ్ లో అడుగు పెడుతుండడంతో అందరి చూపు అతని పైనే ఉంది. దాదాపుగా ఐపీఎల్ తర్వాత నుండి  కొన్ని ఫిట్ నెస్ సమస్యల కారణంగా ఆసీస్ తో జరిగిన వన్డే టి20 సిరీస్ లకు దూరమయ్యాడు. అలాగే టెస్ట్ సిరీస్ లో మొదటి రెండు టెస్టులకు కూడా రోహిత్ హాజరు కాలేదు. అయితే ఎట్టకేలకు ఫిట్ నెస్ పరీక్షలు పాసైన రోహిత్ మూడవ టెస్ట్ కి అందుబాటులో ఉండనున్నాడు. దీంతో ప్రత్యర్థి జుట్టు ఆస్ట్రేలియా హిట్ మ్యాన్ రోహిత్ ను ఎదుర్కొనే దిశగా ప్రణాళికలో సిద్ధం చేస్తుంది.

ఇదే విషయంపై ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నెథన్ లైయన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ ఒకరని, అతడి రాక ప్రత్యర్థి బౌలర్లకు సవాలేనని పేర్కొన్నాడు. హిట్‌మ్యాన్‌ సవాల్‌కు తాము సిద్ధమేనని వెల్లడించాడు. అంతేకాకుండా తమ జట్టుకు కలిసొచ్చిన బ్రిస్బేన్‌లోనే నాలుగో టెస్టు పక్కా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తమ లక్ష్యం మాత్రం మూడో టెస్టు గెలవడమేనని తెలిపాడు.అత్యుత్తమ ఆటగాడైన రోహిత్‌ శర్మ బౌలర్లకు సవాల్‌గా మారే అవకాశం ఉందని తెలిపాడు. మేం ఆ సవాల్‌కు సిద్ధంగా ఉన్నాం. అతడు రావడం టీమ్‌ఇండియాకు గొప్ప సానుకూలాంశం అని, అతడిని గౌరవిస్తూనే త్వరగా ఔట్‌ చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని లైయన్‌ అన్నాడు.

భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న అజింక్య రహానెపై కూడా లైయన్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.అజింక్య రహానె ప్రపంచస్థాయి బ్యాట్స్ మెన్ అని. తన బ్యాటింగ్‌తో అతడు జట్టును అన్ని విధాలా ఆదుకుంటున్నాడు. క్రీజులో అతడి ఓపికను బట్టి అతిగా చిరాకు పడడని అర్థమవుతోంది. ఆట మధ్యలో అతడు స్లెడ్జింగ్‌కు దిగడు. చర్చకు తావివ్వడు. ప్రశాంతంగా తన పనికానిచ్చేస్తాడు అంటూ రహానే పై ప్రశంసలు కురిపించాడు. సిడ్నీలో అతడిని అడ్డుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నాడు. ఇక రవిచంద్రన్‌ అశ్విన్‌ స్ట్రెయిట్‌గా బంతులేస్తూ మా బ్యాట్స్ మెన్స్ ను ఇబ్బంది పెడుతున్నాడు. సిడ్నీలో అతడిని ఎదుర్కోవడంపై మావాళ్లు దృష్టి సారించారు.’ అని లైయన్‌ అన్నాడు.


హెరాల్డ్ సెటైర్ : జగన్ దిగిపోవాలి..చంద్రబాబు సీఎం అయిపోవాలి..అర్జంటుగా

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>