HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/anjur-healthc7cb8bd5-80c6-4d7d-9681-dfd1a03cbb6e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/anjur-healthc7cb8bd5-80c6-4d7d-9681-dfd1a03cbb6e-415x250-IndiaHerald.jpgఉదయాన్నే అల్పాహారంగా మనం తీసుకునే ఆహారం,రోజంతటి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఉదయం తీసుకునే అల్పాహారం మంచి ప్రోటీన్,ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తుంటారు. అంతేకాకుండా ఉదయం తీసుకునే అల్పాహారం, ఎన్నో ఆరోగ్యసమస్యలను దూరం చేస్తుందని మనందరికీ తెలుసు. అందుచేత మనం తీసుకునే అల్పాహారాన్ని ఆచితూచి తీసుకోవాలి.ఇప్పుడు చెప్పబోయే ఆ ఒక్కటి తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను అదుపు చేయడంతో పాటు, కొత్త సమస్యలు దరిచేరకుండా ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. anjur,,health;iron;heart;copper;sugar;cheque;antioxidant;common fig;manam;shaktiఅల్పాహారంలో ఆ ఒక్కటి చేర్చుకోవడం వల్ల ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు!అల్పాహారంలో ఆ ఒక్కటి చేర్చుకోవడం వల్ల ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు!anjur,,health;iron;heart;copper;sugar;cheque;antioxidant;common fig;manam;shaktiTue, 05 Jan 2021 11:30:00 GMTఉదయాన్నే అల్పాహారంగా మనం తీసుకునే ఆహారం,రోజంతటి పైన ఆధారపడి ఉంటుంది.  కాబట్టి ఉదయం తీసుకునే అల్పాహారం మంచి ప్రోటీన్,ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తుంటారు. అంతేకాకుండా ఉదయం తీసుకునే అల్పాహారం, ఎన్నో ఆరోగ్యసమస్యలను దూరం చేస్తుందని మనందరికీ తెలుసు. అందుచేత మనం తీసుకునే అల్పాహారాన్ని ఆచితూచి తీసుకోవాలి.ఇప్పుడు చెప్పబోయే ఆ ఒక్కటి  తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను అదుపు చేయడంతో పాటు, కొత్త సమస్యలు దరిచేరకుండా ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

మనందరికీ తెలిసిన అంజీరపండు. అంజీరపండును ఎండబెట్టి,నానబెట్టి తింటుంటారు.ఎండాకాలంలో మరీ ముఖ్యంగా నానబెట్టిన అంజీరపండ్లు తీసుకోవడం వల్ల  శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అందడంతో పాటు శరీరంలో వేడిని తగ్గిస్తుంది.ఏ కాలమైనా సరే అంజీర పండ్లను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే  అల్పాహారానికి ముందుగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఎన్నో రకాలైన న్యూట్రీషియన్స్ అందుతాయి.ఎందుకంటే వేటినైనా నీటిలో నానబెట్టి తినడం వల్ల వాటిలో ఉండే న్యూట్రిషియన్స్ రెట్టింపయ్యే అవకాశం ఎక్కువ.

అంజీరలో ఎక్కువగా న్యూట్రీషన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్, మెగ్నీషియం, పొటాషియం,జింక్, కాపర్, మాంగనీస్ తోపాటు ఐరన్ లు అధికంగా లభిస్తాయి.అయితే ముఖ్యంగా డయాబెటిస్ రోగులు అంజీర పండ్లు తినకూడదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. 2016 లో జరిగిన ఒక అధ్యయనం ద్వారా అంజీరపండులో హై బ్లడ్ ప్రెజర్ ను నార్మల్ స్థితికి తీసుకొచ్చే శక్తి ఎక్కువగా ఉంటుందని నిరూపణ అయింది. అందుచేత డయాబెటీస్ రోగులు రోజుకు రెండు అంజీర పండ్లు చొప్పున తింటే సరిపోతుంది. అంజీరపండును రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల, జుట్టుకు కావలసిన శోషణ అందడంతో పాటు జుట్టు రాలకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎన్నో కంపెనీలు షాంపూలు, కండిషనర్లు తయారు చేసేటప్పుడు ఎక్కువగా అంజీర పండ్లను వాడుతుంటారు.

మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నవారు అంజీరపండ్లు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.ఎందుకంటే మలబద్ధకాన్ని నివారించడానికి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.అందుకు నానబెట్టిన అంజూరపండ్లను పరగడుపున తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ శరీరానికి పుష్కలంగా లభించి సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో రక్తస్థాయిలను పెంచడానికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది.ఎనీమియా సమస్య ఎక్కువ ఉన్నవారు అంజీరపండ్లు తినడం వల్ల వీటిలో ఉండే ఐరన్ సమృద్ధిగా లభించి, రక్తహీనత నుంచి బయటపడవచ్చు.ఇందుకోసం గోరువెచ్చని పాలలో, అంజీరపండ్లను వేసుకొని తినడం వల్ల రక్తం బాగా వృద్ధి చెందుతుంది.అంజీరపండులో ఉండే మినరల్స్ రక్తంలోని టాక్సిన్స్ ను నాశనం చేయడానికి సహాయపడతాయి.

బీపీ నీ అదుపులో ఉంచి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అరికడుతుంది.కంటి ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.ఎందుకంటే అంజీరపండులో ఉండే న్యూట్రిషన్ కంటిలో ఉండే టిష్యూ లేయర్ ను దృఢంగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.  తద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది.కిడ్నీల ఆరోగ్యాన్ని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల ఇంకా ఎన్నో రోగాలను అరికట్టవచ్చని వైద్య నిపుణులతో పాటు ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.




రేవంత్ రెడ్డి కి హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>