EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/polavaram4c67e3d1-d13a-4147-acec-94bd396cc808-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/polavaram4c67e3d1-d13a-4147-acec-94bd396cc808-415x250-IndiaHerald.jpgపోలవరం.. ఆంధ్రుల డ్రీమ్ ప్రాజెక్ట్‌.. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూనే కాలం వెళ్లబుచ్చింది.. మరి జగన్ సర్కారు ఏం చేస్తోంది.. ఓ సారి పరిశీలిద్దాం.. పోలవరాన్ని పూర్తి చేసి కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 63.20 టీఎంసీలను తరలించే ఎనిమిది లక్షల ఎకరాలు వెరసి 15.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించే దిశగా పనులు వేగవంతం చేశారు. గోదావరి వరద మళ్లించడానికి 1118.40 మీటర్ల పొడవుతో 55 మీటర్ల ఎత్తున 53 బ్లాకులుగా స్పిల్‌ వే నిర్మించpolavaram;godavari river;jagan;telugu;uttarandhra;february;aqua;tdp;aprilజగన్ హయాంలో పోలవరం.. ఇదిగో క్లియర్‌ పిక్చర్ - పార్ట్‌ 1జగన్ హయాంలో పోలవరం.. ఇదిగో క్లియర్‌ పిక్చర్ - పార్ట్‌ 1polavaram;godavari river;jagan;telugu;uttarandhra;february;aqua;tdp;aprilTue, 05 Jan 2021 23:00:00 GMTజగన్ సర్కారు ఏం చేస్తోంది.. ఓ సారి పరిశీలిద్దాం.. పోలవరాన్ని పూర్తి చేసి కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 63.20 టీఎంసీలను తరలించే ఎనిమిది లక్షల ఎకరాలు వెరసి 15.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించే దిశగా పనులు  వేగవంతం చేశారు.

గోదావరి వరద మళ్లించడానికి 1118.40 మీటర్ల పొడవుతో 55 మీటర్ల ఎత్తున 53 బ్లాకులుగా స్పిల్‌ వే నిర్మించాలి. స్పిల్‌ వేకు గరిష్టంగా 18.5 మీటర్ల నుంచి కనిష్టంగా పది మీటర్ల లోతు నుంచి పునాది వేయాలి. 25.72 మీటర్ల వద్ద గేట్లను బిగించాలి. స్పిల్‌ వే సగటున 54 మీటర్ల ఎత్తు వరకూ పనులు పూర్తి చేశారు. ఫిబ్రవరి నాటికి స్పిల్‌ వే పియర్స్, కాంక్రీట్‌ పనులు పూర్తవుతాయి.

జగన్ అధికారంలోకి వచ్చాక 48 రేడియల్‌ గేట్లకుగానూ ఇప్పటికే తొమ్మిది గేట్లు బిగించారు. తాజాగా మరో రెండు గేట్లు బిగించారు. మిగిలిన గేట్లను ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసేలా పనులను వేగవంతం చేశారు. స్పిల్‌ వేపై 1118.4 మీటర్ల చొప్పున స్పిల్‌ వే బ్రిడ్జిని నిర్మించాలి. స్పిల్‌ వే బ్రిడ్జి ఒక్కొక్క శ్లాబ్‌ను నాలుగు నిలువు గడ్డర్లు మీద వేస్తారు. మొత్తం 48 శ్లాబ్‌లకుగానూ 192 నిలువు గడ్డర్లు అవసరం. ఒక్కో గడ్డర్‌ పొడవు 21 మీటర్లు ఉంటుంది.  చంద్రబాబు హయాంలో 22 గడ్డర్లు మాత్రమే పూర్తి చేశారు. ఈ ఏడాదిన్నరలో 170 గడ్డర్లు పూర్తి చేశారు.

స్పిల్‌ వే బ్రిడ్జి స్లాబ్‌ల విషయంలో టీడీపీ సర్కారు 48 శ్లాబ్‌లకుగానూ ఒక్క శ్లాబ్‌ కూడా వేయలేదు. నేడు 48 శ్లాబ్‌లకుగానూ 40 శ్లాబ్‌ల నిర్మాణం పూర్తయింది. ఫిబ్రవరి 15 నాటికి మిగిలిన 8 శ్లాబ్‌లను పూర్తి చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకూ 49 ట్రూనియన్‌ బీమ్‌లకుగానూ 40 పూర్తయ్యాయి. మిగిలిన 9 బీమ్‌లు ఈ నెలలో పూర్తవుతాయి. 49 ఫాల్కన్స్‌ను బిగించారు.

పోలవరం నిర్మాణం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో 371 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఇక్కడ 1,05,601 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో కేవలం 15 పునరావాస కేంద్రాలలో 1,846 ఇళ్ల నిర్మాణాన్ని మాత్రమే పూర్తి చేశారు. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. జగన్ అధికారంలోకి వచ్చాక 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 17,860 కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి వీలుగా ఇప్పటికే 11,500 ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. మరో 6,360 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. మే నాటికి ఈ కుటుంబాలకు పునరావాసం కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


అల్లుడు నిజంగానే అదుర్స్ అనిపించాడు.. 2 మిలియన్ వ్యూస్.. లక్ష లైక్స్..!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>