EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/timechange1b8c62b5-7de1-4237-9e13-57e1346fc32e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/timechange1b8c62b5-7de1-4237-9e13-57e1346fc32e-415x250-IndiaHerald.jpgకాలం మారిపోతోంది.. మనిషి అభిరుచులు మారిపోతున్నాయి. ఒకప్పుడు నీచంగా మారింది.. ఇప్పుడు ఉత్తమంగా మారుతోంది. ఒకప్పుడు ఉత్తమంగా మారింది.. అప్పుడు ఉత్తమంగా ఉన్నది ఇప్పుడు అధమంగా తోస్తోంది.. లోకంలో మార్పు ఫలితం ఇది.. ఏంటీ అర్థం కావడం లేదా.. అయితే కొన్ని ఉదాహరణలు చూస్తే మీకే అర్థం అవుతుంది.. ఇప్పుడు డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు.! పీలికబట్టల్ని వస్త్ర ధారణ అంటున్నారు.! భౌతిక ఆకర్షణను ప్రేమని పిలుస్తున్నారు.! సహజీవనాన్ని సంసారమంటున్నారు.! గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు.! డూప్ ల పోరాటాన్ని హtimechange;deva;maya;mithra;cinema;culture;wife;ee rojullo;v;mahaకాలం మారుతోంది.. ఈ వింతలు గమనించారా..?కాలం మారుతోంది.. ఈ వింతలు గమనించారా..?timechange;deva;maya;mithra;cinema;culture;wife;ee rojullo;v;mahaTue, 05 Jan 2021 00:00:00 GMT
ఇప్పుడు డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు.! పీలికబట్టల్ని  వస్త్ర ధారణ అంటున్నారు.! భౌతిక ఆకర్షణను ప్రేమని పిలుస్తున్నారు.! సహజీవనాన్ని సంసారమంటున్నారు.! గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు.! డూప్ ల పోరాటాన్ని హీరోయిజం అంటున్నారు.! పదవుల పోరాటాన్ని ప్రజాస్వామ్యమంటున్నారు.. అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు.! ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు.! సరదాలను సంస్కృతి అంటున్నారు.! భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు.! కోరిన కోర్కెలు తీరిస్తేనే... దేవుడంటున్నారు.! ఆస్తి ఉంటేనే... గొప్పవాడు అంటున్నారు.!

ఇంకా చెప్పాలంటే.. మందు పోయిస్తేనే... మిత్రుడు అంటున్నారు.! కట్నం తెస్తేనే... భార్య అంటున్నారు.! సొమ్ములు తెస్తేనే... సంసారం అంటున్నారు.! కాసులు తెస్తేనే... కాపురం అంటున్నారు.! అవినీతి చేయకపోతే... అసమర్ధుడంటున్నారు.! అక్రమాలు చేయకపోతే... అమాయకుడంటున్నారు.! అసత్యాలు మాట్లాడితే... బ్రతక నేర్చిన వాడంటున్నారు.! అంతే కదా మరి.

 ఈ రోజుల్లో నిజం పలికితే... బ్రతక నేర్వని వాడంటున్నారు.! న్యాయబద్ధంగా ఉంటే... ఎలా బ్రతుకుతాడో అంటున్నారు.! అన్యాయంగా బ్రతికితే... ఎంచక్కా ఉన్నాడంటున్నారు.! అన్యాయాన్ని ఎదిరిస్తే... అతనికెందుకు అంటున్నారు.! నిజాయితీగా బ్రతికితే... కూడుపెడుతుందా అంటున్నారు.! మాయ కమ్మిన జీవితాన్ని శాశ్వతమనుకుంటున్నారు.! మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు.! పరిస్థితులకనుగుణంగా... అందుకే పాత అర్ధం చెరిగిపోయి, ప్రయోజనాలకు అండగా... పరమార్ధం ఆవిర్భవిస్తోంది! స్వార్ధకాంక్షలకు అణుగుణంగా విపరీతార్ధం ఆవిష్కృతమవుతోంది! కాదంటారా..?

కాలంతో వచ్చే మార్పులను స్వాగతించాల్సిందే.. అయితే అన్ని మార్పులు మంచికే అనుకోలేం కదా.. అందుకే మార్పులపై పరిశీలన జరగాలి.. మంచి మార్పును స్వాగ తించాలి. చెడ్డ మార్పును ఆదిలోనే తుంచి వేయాలి. అప్పుడు నవ సమాజం దిశగా అడుగులు పడతాయి. చక్కటి సమాజం నిర్మితమవుతుంది.


ఇక పవన్‌కు ఛాన్స్ లేనట్టేనా?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>