PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-jeevan-reddy4445e93e-ddfa-4641-b480-28750ae0003a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-jeevan-reddy4445e93e-ddfa-4641-b480-28750ae0003a-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ కమిటి కూర్పు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పీసీసీ చీఫ్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని ఖరారు చేసింది. ప్రచార కమిటీ చైర్మన్‌గా రేవంత్‌రెడ్డిని, సీఎల్పీ నేతగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబును, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని, సమన్వయ కమిటీ చైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్కను నియమించాలని హైకమాండ్ నిర్ణయించిందని తెలుస్తోంది.revanth reddy jeevan reddy;jeevan;revanth;delhi;jeevan reddy;telangana;revanth reddy;congress;district;tpcc;minister;reddy;partyటీపీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డి! ప్రచార కమిటీ చైర్మన్‌గా రేవంత్‌రెడ్డి!టీపీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డి! ప్రచార కమిటీ చైర్మన్‌గా రేవంత్‌రెడ్డి!revanth reddy jeevan reddy;jeevan;revanth;delhi;jeevan reddy;telangana;revanth reddy;congress;district;tpcc;minister;reddy;partyTue, 05 Jan 2021 08:34:33 GMTతెలంగాణ కాంగ్రెస్ కమిటి కూర్పు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పీసీసీ చీఫ్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని ఖరారు చేసింది. ప్రచార కమిటీ చైర్మన్‌గా రేవంత్‌రెడ్డిని, సీఎల్పీ నేతగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబును, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని, సమన్వయ కమిటీ చైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్కను నియమించాలని హైకమాండ్ నిర్ణయించిందని తెలుస్తోంది.

         పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని ఖరారు చేయవచ్చన్న ఊహాగానాలు వచ్చాయి. రేసులో తానూ ఉన్నానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించుకున్నారు. వీరిద్దరిలో ఎవరికి పీసీసీ పీఠం దక్కుతుందని అందరూ భావించారు. కానీ చివరకు అనూహ్యంగా జీవన్‌రెడ్డి పేరును ఖరారు చేశారని తెలుస్తోంది.
అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా వ్యవహరించిందన్న అభిప్రాయం ఆ పార్టీ రాష్ట్ర నేతల్లో వ్యక్తమైంది.

    టీపీసీసీ ఎంపిక రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ కు సవాల్ గా మారింది. నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లోనే మకాం వేసి సీనియర్ల, జిల్లా పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. ఢిల్లీ వెళ్ళి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో చర్చించారు. ఏఐసీసీ నేతల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్న సోనియాగాంధీ వ్యక్తిగతంగా పీసీసీ రేసులో ఉన్నవారందరితో మాట్లాడినట్లు ఏఐసీసీ నేతలే చెప్పారు. చివరకు అన్ని వర్గాల నేతలకూ సమానదూరంలో,ఉండే జీవన్ రెడ్డి పేరును ఖరారు చేసింది.

   పీసీసీ చీఫ్ పదవి రాకపోయినా తనకు  అసంతృప్తి లేదని, సమష్టి కృషితో పార్టీని బలోపేతం చేయడానికి పని చేస్తానని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రచార కమిటీ చైర్మన్‌గా రాష్ట్రమంతా తిరిగి 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో సొంత పార్టీ నేతలే తనను వ్యతిరేకించడంపై ఒక దశలో ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి తనంతట తానుగా జీవన్‌రెడ్డి పేరును పరిగణనలోకి తీసుకోవాలని అధిష్ఠానానికి ప్రతిపాదించారని చెబుతున్నారు.




ఏపీ సర్కార్ పై వీహెచ్ పీ ఫైర్!

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>