PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/temple01b72ae9-c004-4f8b-bd52-52f0f79b0cc2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/temple01b72ae9-c004-4f8b-bd52-52f0f79b0cc2-415x250-IndiaHerald.jpgగుడి అన్నది ఒక మత‌ విశ్వాసానికి సంబంధించిన విషయం. ఆధ్యాత్మిక భావన అన్నది కూడా మానవుడికి కొత్త ఆలోచనలు కలిగిస్తుంది. వారానికి ఒకసారి అయినా ఆలయాలకు వెళ్లడం అన్నది ఆస్తిక జనులకు మంచిదని అంటారు. కానీ ఇపుడు ఏపీలో చూస్తే అంతా టెంపుల్ రన్ అంటున్నారు. ఆ వైపుగా బాట పడుతున్నారు. ఏపీలో అనేక రాజకీయ‌ పార్టీలు ఉన్నాయి. వారంతా ఇపుడు ఛ‌లో కోవెల అనేస్తున్నారు. temple;amala akkineni;bhavana;ramu;tiru;bharatiya janata party;janasena;mp;temple;chinna jeeyar swamy ji;ycp;janasena party;yatraటెంపుల్ రన్...స్వామీజీలూ రెడీ ?టెంపుల్ రన్...స్వామీజీలూ రెడీ ?temple;amala akkineni;bhavana;ramu;tiru;bharatiya janata party;janasena;mp;temple;chinna jeeyar swamy ji;ycp;janasena party;yatraTue, 05 Jan 2021 22:00:00 GMTగుడి అన్నది ఒక మత‌ విశ్వాసానికి సంబంధించిన విషయం. ఆధ్యాత్మిక భావన అన్నది కూడా మానవుడికి కొత్త ఆలోచనలు కలిగిస్తుంది. వారానికి ఒకసారి అయినా ఆలయాలకు వెళ్లడం అన్నది ఆస్తిక జనులకు మంచిదని అంటారు. కానీ ఇపుడు ఏపీలో చూస్తే అంతా టెంపుల్ రన్ అంటున్నారు. ఆ వైపుగా బాట పడుతున్నారు. ఏపీలో అనేక రాజకీయ‌ పార్టీలు ఉన్నాయి. వారంతా ఇపుడు ఛ‌లో కోవెల అనేస్తున్నారు.

అలా ఆలయాలకు వెళ్ళడం వల్ల భక్తి ముక్తి అన్నీ ఒక్క దెబ్బకు వచ్చేస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు కొత్త ఏడాది రెండవ రోజునే రామతీర్ధానికి వచ్చి హడావుడి చేశారు. ఆయన కంటే ముందు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్ళి మరీ రామున్ని దర్శించుకున్నారు, ఇక బీజేపీ జనసేన కూడా చలో రామతీర్ధం అంటూ వచ్చారు.

ఇక ఇపుడు చూస్తే చిన జీయర్ స్వామివారు కూడా ఆలయాల యాత్రలకు రెడీ అవుతున్నారు. ఆయన రాష్ట్రంలో విగ్రహాల విద్వంసం జరిగిన అన్ని ఆలయాలను పరిశీలిస్తారు అని అంటున్నారు. ఆలయాలకు రక్షణ కల్పించడంతో పాలకులు విఫలం అయ్యారని కూడా ఆరోపించారు. ఆస్తిక జనులు తన వెంట తరలిరావాలని కూడా ఆయన కోరుతున్నారు.

ఇదిలా ఉంటే చినజీయర్ స్వామి ఈ ఆలయాల యాత్ర చేపడితే మిగిలిన స్వామీజీలు కూడా అనుసరించడం ఖాయం. దాంతో ఏపీలో స్వామీజీలు, పీఠాధిపతుల యాత్రలో అన్ని అంశాలు కూడా గుడుల చుట్టూనే తిరుగుతాయి అని అంటున్నారు. మరి ఓ వైపు వైసీపీ సర్కార్ సంక్షేమ కార్యక్రమాలను వెల్లువలా అమలు చేస్తోంది. దాంతో మంచి పేరు ప్రభుత్వానికి వస్తోంది. అయితే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యేలా ఉంది అంటున్నారు.  గుడులూ అక్కడ దేవతా విగ్రహాల కూల్చివేత వల్ల పెద్ద ఎత్తున  చెడ్డ పేరు వస్తుందా అన్న బెంగ అయితే వైసీపీలో ఉందిట. మరి చూడాలి ఏపీలో ఎటువంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో ఏమో.




అమెరికాలో ఆ రాష్ట్రం భారత ఎన్నారై అడ్డా..మామూలు రికార్డ్ కాదుగా..!!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>