PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/peddagattu-jatarad3a348e4-7aa1-48e4-bf3a-b6ff22946c3d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/peddagattu-jatarad3a348e4-7aa1-48e4-bf3a-b6ff22946c3d-415x250-IndiaHerald.jpgతెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతర గా పేరొందిన సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని దూరజ్ పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం రెండు కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. యాదవుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర వచ్చే నెల అంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకు జరగనుంది.peddagattu jatara;kcr;raj;ramakrishna;hyderabad;vijayawada;district;suryapeta;chief minister;mla;february;minister;local language;march;reddyపెద్దగట్టు జాతరకు రెండుకోట్లు!పెద్దగట్టు జాతరకు రెండుకోట్లు!peddagattu jatara;kcr;raj;ramakrishna;hyderabad;vijayawada;district;suryapeta;chief minister;mla;february;minister;local language;march;reddyTue, 05 Jan 2021 19:11:38 GMTసూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని దూరజ్ పల్లి  లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర కు రాష్ట్ర  ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
జాతర ఏర్పాట్ల కోసం రెండు కోట్ల రూపాయలు కేటాయిస్తూ  ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. యాదవుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న లింగమంతుల స్వామి పెద్దగట్టు  జాతర వచ్చే నెల అంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకు జరగనుంది.

        రాష్ట్ర స్థాయి లో రెండో అతిపెద్ద గా  గుర్తించబడిన పెద్దగట్టు జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి చాలా ఘనంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది గా  వచ్చే భక్తులతో దూరాజ్ పల్లి లోని పెద్ద గట్టు పరిసరాలు కుంభ మేళాను తలపిస్తుంది. రెండు రోజుల పాటు లక్షలాది మంది భక్తులు లింగమంతుల స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సందర్భంగా రెండు రోజుల పాటు హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని కూడా బంద్ చేస్తారు. జాతర దగ్గర పడుతున్న నేపధ్యంలో ప్రభుత్వం పెద్దగట్టు  జాతర ఏర్పాట్లను చెయ్యటానికి ఈ నిధులను విడుదల చేసింది.

              జాతర నిర్వహణ కోసం జిల్లా అధికారులతో చర్చించిన స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్ రెడ్డి గారు ఈ మేరకు ముఖ్యమంత్రి వద్దకు ప్రతిపాదన తీసుకెళ్లారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించడంతో పాటు వెంటనే నిధులు విడుదల చేశారు.దీంతో జాతర నెల రోజులకు ముందు గానే నిధులు రావడం పట్ల పెద్దగట్టు ఆలయ పూజారులు, యాదవ కుల పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదల కావడంతో జాతరలో  భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు, పాలక మండలి ఏర్పాట్లు చేస్తోంది.నెల రోజుల సమయం ఉండటంతో ఈసారి గతంలో కంటే ఘనంగా ఏర్పాట్లు చేస్తామంటున్నారు లోకల్ అధికారులు.


టాలీవుడ్ లిరిక్ రైటర్ వెన్నెలకంటి మృతి

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>