MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bommarillu-movie22aae2c3-7d18-4801-a7f0-21f020418ac5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bommarillu-movie22aae2c3-7d18-4801-a7f0-21f020418ac5-415x250-IndiaHerald.jpgకొన్ని సినిమాలకి ఎక్స్ పైరీ డేట్స్ ఉండవు. అవి జీవితాంతం ప్రేక్షకుల గుండెల్లో అజరామరంగా ఉండిపోతాయి. ఈ మధ్య కాలంలో అలాంటి చిత్రాలు చాలా తక్కువ అయిపోయాయి. కానీ.., బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దార్ధ్ హీరోగా తెరకెక్కిన బొమ్మరిల్లు మూవీ మాత్రం ఇలాంటి అజరామరం అని చెప్పుకోవచ్చు. bommarillu movie;allu arjun;bhaskar;dil raju;geetha;jr ntr;bollywood;cinema;sangeetha;baba bhaskar;producer;king;producer1;hero;arjun 1;father;dil;mass;allariతారక్, బన్నీ వద్దు అంటే... సిద్దార్ధ్ ఓకే చెప్పాడు...చివరికి అంత షాక్ అయ్యారుతారక్, బన్నీ వద్దు అంటే... సిద్దార్ధ్ ఓకే చెప్పాడు...చివరికి అంత షాక్ అయ్యారుbommarillu movie;allu arjun;bhaskar;dil raju;geetha;jr ntr;bollywood;cinema;sangeetha;baba bhaskar;producer;king;producer1;hero;arjun 1;father;dil;mass;allariTue, 05 Jan 2021 16:00:00 GMTభాస్కర్ దర్శకత్వంలో సిద్దార్ధ్ హీరోగా తెరకెక్కిన బొమ్మరిల్లు మూవీ మాత్రం ఇలాంటి అజరామరం అని చెప్పుకోవచ్చు. కథ, కథనం, సంగీతం, తారాగణం ఇలా అన్నీ ఈ మూవీకి బాగా  కుదిరిపోయాయి. ఇక నిర్మాత దిల్ రాజు నిర్మాణ విలువలు కూడా అద్భుతం.

2005లో విడుదలైన ఈ చిత్రం  మాస్‌ ప్రేక్షకులు, క్లాస్‌ ప్రేక్షకులని వర్గ భేదం లేకుండా అన్ని వర్గాల వారిని అలరించింది. హాసినిగా కథానాయిక జెనీలియా చేసిన అల్లరి ధియేటర్స్ లో అందరి చేత విజిల్స్ వేపించింది. తండ్రి కోసం తన ఇష్టాలను చంపుకుని తనలో తనే బాధపడే యువకుడి పాత్రలో  సిద్దార్థ్‌ అద్భుత నటన కనపరిచాడు. ఈ సినిమా తరువాతనే  సిద్దార్థ్‌ సినీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కానీ.., మీకు తెలుసా? ఈ కథ ముందుగా జూనియర్ యన్టీఆర్ కోసం సిద్ధం చేపించాడట దిల్ రాజు. తారక్ అప్పట్లో మాస్ హీరోగా కొనసాగుతున్నాడు. అతనికి ఒక క్లాస్ స్టోరీ పడితే బాగుంటుంది అన్నది దిల్ రాజు ఆలోచనట. కానీ.., యన్టీఆర్ ఈ కథని రిజెక్ట్ చేశాడు. జూనియర్ నో అన్నాక ఈ స్టోరీ మళ్ళీ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది. కానీ.., అల్లు హీరో కూడా నో చెప్పేశాడట.

దీనితో వేరే మార్గం లేక సిద్దార్ద్ ని హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశారు దిల్ రాజు. విడుదల అయ్యాక బొమ్మరిల్లు  మంచి పేరుతో పాటు.., దిల్ రాజుకి  కలలో కూడా ఉహించనంత లాభాలను తెచ్చి పెట్టింది. ఇప్పటికీ దిల్ రాజు తన ఫేవరేట్ మూవీ అంటే బొమ్మరిల్లు  పేరే చెప్తాడు. జెనీలియా ఈ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ముఖ్యంగా ఆమె బాలీవుడ్ ఎంట్రీకి బొమ్మరిల్లు చాలా యూజ్ అయ్యింది. బొమ్మరిల్లు  తరువాత దిల్ రాజు తారక్ కోసం బృందావనం అనే మరో క్లాస్ స్టోరీని సిద్ధం చేపించాడు. జూనియర్ కి బృందావనం హిట్ ఇచ్చింది కానీ.., బొమ్మరిల్లు లాంటి సూపర్ హిట్ మాత్రం మిస్ అయ్యింది . పాపం అల్లు అర్జున్ ది కూడా ఇదే పరిస్థితి. ఒకవేళ ఈ ఇద్దరు స్టార్ హీరోలు కనుక బొమ్మరిల్లు మూవీలో నటించి ఉంటే ఆ సినిమా ఇంకెంత పెద్ద విజయం సాదించేదో మరి?


అలా చేస్తే కళ్ళ అందం అమాంతం పెరిగిపోతుందట!

తెలంగాణాకు రాహుల్ గాంధీ...?

ఏపీ లో మరో దారుణం...వరాహ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ధ్వంసం ...!?

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>